పది గుల్జార్ ఉర్దూ పదాలు
x

పది గుల్జార్ ఉర్దూ పదాలు

గుల్జార్ ఉర్దూ కవి. హిందీ సినీగేయ రచయిత. ఆయన అల్లే ఉర్దూ పదాలు సూటిగా గుండెని తాకి అంతరాంతరాల్లోకి వెళతాయి. కొన్ని మచ్చుతునకలు


మూల కవి -గుల్జార్

అనుసృజన-గీతాంజలి

***

చిన్న పాటి జీవితంలో..లెక్కకు మించిన కోరికలు.

చుట్టూ మనుషులైతే ఉన్నారు ..ఒఖ్ఖ ప్రేమించే వాళ్ళు తప్ప !

మనసులోని విషాదాన్ని ఎవరితో చెప్పుకోను గుల్జార్ ?

హృదయానికి దగ్గరగా ఉన్నారనుకున్న వాళ్ళు కూడా అపరిచితుల్లాగే ఉన్నారు !

***

ఎలాగో ముందుకు నడుస్తున్నది జీవితం!

కానీ దోస్త్.. ఈ కళ్లేమో నిద్రపొమ్మని చెబుతాయా.. హృదయం మాత్రం ఏడవమని చెబుతుంది !

***

బతికిన కాలమంతా… ఈ జీవితం తనని తాను రెండు కాళ్ళ మీదే సంభాళించుకుంది!

కానీ ఈ మృత్యువుంది చూసారూ.,వస్తూ.. వస్తూనే తనకి నాలుగు భుజాలు కావాలని చెప్పేసింది !

***

జీవితమా ఇంత కాలం ..నిన్ను చాలా కోల్పోయాక..అప్పుడు కదా నన్ను నేను పొందగలిగాను ?

***

కొన్ని బంధాలు నెరపడంలో ఏ లాభం ఉండదు కానీ జీవితాన్ని ఐశ్వర్యంతో నింపేస్తాయి!

***

ఈ ప్రేమ ఉంది చూసారూ...భలె గమ్మతయ్యింది జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది .

అది అందినా.. అందక పోయినా

***

ఈ లోకంలో మంచి వాళ్ళు చాలా చవుకగా దొరుకుతారు సుమా!

బస్..తియ్యగా మాట్లాడి కొనేస్కోవడమే !

***

చందమామ కోసం కల కను..తప్పు లేదు ! కానీ దానిలోని మచ్చని కూడా ప్రేమించాలి. మరి !

***

హృదయం తో పాటు నా తలరాతని కూడా నువ్వే తయారు చేసావు. కానీ ఖుదా.. నా హృదయంలో ఉన్న అతగాడు నా తలరాత లో ఎందుకు లేడు ?

***

ప్రేయసీ...దేనికి ఈ శిక్ష నాకు?

నిన్ను ప్రేమించాననా ?

లేక నీకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాననా..దేనికి ?




Read More
Next Story