తిరుపతి సమయం రాత్రి ఎనిమిదిన్నర.
డెభై యేండ్ల సీనియర్ సిటిజెన్ తన మోటార్ సైకిల్ పై రోడ్ దాటుతున్నాడు.
ఇంతలో చెవులు చిల్లులు పడేలా పెద్దగా దడ దడ మంటూ శబ్దం విరుచుకుపడింది.
ఏదో వాహనం వేగంగా వస్తున్న వార్నింగ్ అది.
అప్పటికే రోడ్ మధ్యలో వున్నా సీనియర్ సిటిజెన్ ఎటు తిరగాలో తెలియక తత్తరపడి వాహనంతో సహా కింద పడిపోయాడు. ఆ సౌండ్ విన్నపుడు ఆ పెద్దాయనలో కలిగిన మానసిక అలజడి, సంక్షోభం, రక్తపోటు పెరగడం, మనుసులోఉద్రిక్తతక పెరడగా, రానున్న ముప్పు ను తప్పించుకునేందుకు వేగంగా స్పందించాలనుకోవడం, శరీరం, తన వాహనం సహకరించకపోవడం...ఎలా ఉంటుందో వూహించండి. ఫలితంగా ఆయన కిందపడ్డాడు. గాయపడ్డాడు. ఇదందా మితిమీరిన ధ్వని చేస్తూ ఒక ఆకతాయి రోడ్డు మీద సృష్టించడమే.
అదేక్షణంలో ఆకతాయి వాహనం వేగంగా, దీన్నేమీ పట్టించుకోకుండా క్రాస్ చేయడం జరిగిపోయింది.
ఫలితం పెద్దాయన మోకాలిలో లిగమెంట్ టేర్ ,హాస్పిటల్ ఖర్చు నెల రోజుల రెస్ట్ ..
ఇందులో ఎవరిది తప్పు?
రోడ్డులో తన మానాన సాగుతున్న వృద్ధుడి తప్పా? లేక, చెవులు చిల్లులు పడేలా శబ్దం చేస్తూ ఇతరులను భయపెట్టేలా వాహనం నడిపిన యువకుడిదా?
చట్టప్రకారం మరియు సామాజిక బాధ్యతల దృష్టికోణంలో చూస్తే, ఇది స్పష్టంగా ధ్వని కాలుష్యం సృష్టించిన వాహనదారుడి బాధ్యతా హీనత, బుద్ధి హీనత అని చెప్పాలి.

ధ్వనికాలుష్యం వల్ల భయపడి పడిపోవడం అనేది ఈ ఒక్క సంఘటనలోనే కాదు. ఇటువంటి సంఘటనలు ప్రతిరోజూ చిన్న పెద్ద పరంగా అనేక చోట్ల జరుగుతూనే ఉన్నాయి. మీకు ఎదరవుతూ ఉంటాయి. ఎన్నో సార్లు మీరు రోడ్డు మీద వెళ్తున్నపుడు ఇలాంటి వాహనాలు చేసే విపరీత ధ్వనికి మీరు ఉలిక్కి పడి ఉంటారు. ఎన్నోసార్లు రోడ్డుమీద మిమ్మల్ని కూడా అలాంటి ఆకతాయి వాహనాలు టెర్రరైజ్ చేసి ఉంటాయి. పక్కన నడుస్తున్న వారిని భయపెట్టి, టెర్రరైజ్ చేసి ప్రమాదానికి గురిచేసేలా వాహనం నడపడం ఏ కోణంలో చూసినా నేరమే.
శబ్దకాలుష్యం వల్ల హాని
ఆ మధ్య హైదరాబాద్ పోలీసులు రోడ్డు మీద వెలువడే శబ్ద కాలుష్యం ఎంత ప్రమాదమో వివరించారు.నేరుగా మరణానికి కారణం కాపోయినా, చాలా పెద్ద సమస్యలకు ఇది దారి తీస్తుంది. రక్తపీడనం పెంచి గుండెజబ్బులకు దారి తీస్తుంది. గ్యాస్ట్రైటిస్, కోలిటిస్ లతో పాటు హార్ట్ ఎటాక్ కు కూడా దారి తీస్తుంది. మనుషుల్లోనే కాకుండా జంతువల్లో కూడా తలనొప్పి, ఉద్రిక్తత, కన్ ఫ్యూజన్, డిప్రెషన్ లను కలిగిస్తాయి. కొద్ది రోజుల కిందట హైదరాబాద్ డిసిపి విడుదల చేసిన అనర్థాల జాబితా ఇక్కడ చూడండి.
EFFECTS OF NOISE POLLUTION:
Noise Pollution is associated with high బ్లడ్ pressure, but the long-term impact may lead to hospitalization and rare chances of death. In a study, it was revealed that traffic noise was associated with cardiovascular defects in all adults (≥25 years) and the elderly (≥75 years). It shows that long-term exposure to road traffic noise increases the risk of death and the risk of cardiovascular disease in the population. As well as damaging our hearing by causing - tinnitus or deafness - constant loud noise can damage human health in many ways, particularly in the very young and the very old.
Here are some of the main ones:
I) PHYSICAL: Respiratory agitation, racing pulse, high blood pressure, headaches and, in case of extremely loud, constant noise, gastritis, colitis and even heart attacks.
II) PSYCHOLOGICAL: Noise can cause attacks of stress, fatigue, depression, anxiety and hysteria in both humans and animals.
III) SLEEP AND BEHAVIOURAL DISORDERS: Noise above 45 dB stops you from falling asleep or sleeping properly. Remember that according to the World Health Organization it should be no more than 30 dB. Loud noise can have latent effects on our behaviour, causing aggressive behaviour and irritability.
IV) MEMORY AND CONCENTRATION: Noise may affect people's ability to focus, which can lead to low performance over time. It is also bad for the memory, making it hard to study. (source: Press Note Issued by Hyderabad Police)
చట్టం ఏమంటుంది?
1. కేంద్ర మోటారు వాహనాల నియమాలు – 1989 (Central Motor Vehicle Rules, 1989) రూల్ 120 ప్రకారం: ద్విచక్ర వాహనాల శబ్ద మోత 80–90 డెసిబెల్స్ (dB) కంటే ఎక్కువ ఉండకూడదు. సైలెన్సర్‌ను తొలగించడం లేదా మార్చడం నిషేధించబడింది – ఫ్రీ-ఫ్లో ఎగ్జాస్ట్ వంటివి చట్ట విరుద్ధం.
2. శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలు – 2000 (Noise Pollution (Regulation and Control) రూల్స్, 2000)ప్రకారం
వివిధ ప్రాంతాల్లో అనుమతించే గరిష్ఠ శబ్ద మోత: నివాస ప్రాంతాలు: 55 dB (పగలు), 45 dB (రాత్రి) వాణిజ్య ప్రాంతాలు: 65 dB (పగలు), 55 dB (రాత్రి) నిశ్శబ్ద ప్రాంతాలు (హాస్పిటల్, పాఠశాల, కోర్టు చుట్టుపక్కల): ఇంకా తక్కువ వీటిని ఉల్లంఘిస్తే దండనలూ ఉంటాయి.
3. ఇండియన్ పీనల్ కోడ్ (IPC) – సెక్షన్ 268 ప్రకారం పబ్లిక్ న్యూసెన్స్ ( అధిక శబ్దం ద్వారా పబ్లిక్‌లో భయం, అసౌకర్యం కలిగించడం నేరం అందుకు శిక్షలు విధించవచ్చు.
4. మోటారు వాహన చట్టం – 1988 (Motor Vehicles Act, 1988)సెక్షన్ 190(2) ప్రకారం సురక్షితంగా లేని, అనధికారంగా మార్పులు చేసిన వాహనాలు నడపడం నేరం. దండన లేదా జైలుశిక్ష విధించవచ్చు.
5. ట్రాఫిక్ పోలీసులు & RTO చర్యలు ట్రాఫిక్ పోలీసులు మరియు RTO అధికారులు: అనధికార సైలెన్సర్లను ద్వాంసం చేస్తారు. శబ్దం ఎక్కువగా చేసే వాహనాలపై పట్టుకొన్న స్థలంలోనే ఫైన్ వేస్తారు. కొన్ని సందర్భాలలో వాహనం సీజ్ చేయడం కూడా జరుగుతుంది.
సాధారణ జరిమానాలు (పెనాల్టీలు)
నేరం-జరిమానా
సైలెన్సర్ మార్పు ₹1,000 నుండి ₹10,000 వరకు
శబ్ద కాలుష్యం సృష్టించడం ₹500–₹1,000 లేదా అంతకన్నా ఎక్కువ.
ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకువచ్చినా, వాటి అమలుకు బాధ్యత కేవలం పోలీస్ లేదా ఆర్‌టీవో అధికారులదే కాదు – ప్రతి పౌరుడూ సహకరించాలి, భాగస్వామిగా ఉండాలి.
అధిక శబ్దం చేసే వాహనాలను ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు (WhatsApp/టోల్ ఫ్రీ నంబర్) ద్వారా..
ఫోటో, వీడియోలతోపాటు స్థలం మరియు సమయం తెలియజేయాలి.
వాహనంలో నడపడంలో బాధ్యత ఉండాలి
వాహనం నడపడం అంటే కేవలం డ్రైవింగ్‌నే కాదు, అది బాధ్యత, మానవీయత, సామాజిక విలువలు కలగలసిన పని ధ్వని కాలుష్యం మన ఆరోగ్యానికీ, మన సమాజానికీ ముప్పుగా మారుతోంది. ప్రతి ద్విచక్ర వాహనదారుడు, ముఖ్యంగా యువత, శబ్ద నియంత్రణ పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.
శాంతియుత వాతావరణాన్ని కాపాడటంలో మనం భాగస్వాములం కావాలి.యువత, ముఖ్యంగా మోటార్ సైకిల్ ప్రేమికులు, బైక్ శబ్దం గొప్పదని భావించి, ప్రజలపై దాడిలా వినిపించే శబ్దాలను సృష్టించకూడదు. అది మీ ఆనందం కోసం బుద్ధిహీనత తో చేసిన పని వల్ల కొంతమందికి జీవితాంతం మచ్చలు మిగిల్చే ప్రమాదాలుగా మారుతున్నాయి.
మీ వాహనంలో సైలెన్సర్‌ను మార్చకండి – చట్టపరంగా, మానవతా దృక్పథంతో మసులుకోండి.