కనిపించని వేదనకు అక్షర రూపం ఇచ్చే రచయిత్రి బండారు విజయ
x

కనిపించని వేదనకు అక్షర రూపం ఇచ్చే రచయిత్రి బండారు విజయ

అపరిష్కృత, సహజాత పుస్తకాల పరిచయ సభ


ప్రముఖ రచయిత్రి భండారు విజయ సంపాదకత్వం వహించిన ‘పరిష్క్తృత‘ (కథా సంకలనం), ఆమె స్వీయ కథా సంపుటి ‘సహజాత’ మహిళల అదృశ్య వేదనకు అక్షరరూపం ఇస్తాయని పలువురు రచయితలు కొనియాడారు.

హైదరాబాద్ విమెన్ రైటర్స్, హస్మిత ప్రచురణ సంస్థలు కలిసి తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, రవీంద్రభారతి, కాన్ఫరెన్స్ హాలులో తేది 23.1.2026 సాయంత్రం 5గం.లకు ఈ రెండు పుస్తకాలు పరిచయ సభ జరిగింది.

వరంగల్ వాసి అయిన విజయ సాహిత్య ప్రస్థానం సుదీర్ఘమైనది. మొదటగా 'వరంగల్ వాణి' అనే దినపత్రికలో రోజుకొకటి చొప్పున మహిళలకు సంబంధించిన సమస్యలపై రాసేవారు. 'ప్రసారిక' అనే మ్యాగజైన్ లోనూ రాస్తుండేవారు. ఆమె వివిధ ప్రక్రియల్లో రచనలు చేసారు. అనేక అవార్డులు అందుకున్నారు. గతంలో దీపిక (1984) తడి ఆరని దుఃఖం (2016) అలల అంతరంగం (2018)కవితా సంకలనాలు, గణిక (2020) విభజిత (2024) కథా సంకలనాలు ప్రచురించారు. ఇపుడు ఆమె రాసిన కథా సంపుటి సభలో చర్చకు వచ్చింది.



వరంగల్ అరసం అధ్యక్షులు, శ్రీ నిధి భండారు విజయ గురించి, ఆమె స్త్రీ వాద రచనల గురించి, రాబోయే రచనల గురించి పరిచయం చేసారు.

సభా అధ్యక్షులు తెలంగాణ బిసి కమీషన్, తొలి కనీషనర్, శతాధిక రచయిత బి.ఎస్. రాములు మాట్లాడుతూ తాను కథలు రాయడమే కాకుండా, ఇతర రచయితలతో వర్క్ షాప్ లు నిర్వహిoచి , వారిచే ‘పరిష్క్తృత ‘ లాంటి కథా సంకలనాలను తీసుకుని వస్తున్న భండారు విజయ మంచి స్త్రీవాద రచయిత అని కొనియాడారు.
కథకులు కథలు రాసేటప్పుడు పాటించాల్సిన కొన్ని నియమాలు ఉంటాయని, వాటిని తను “కథల బడి” పుస్తక రూపంలో మూడు దశబ్దాల క్రితమే రాసి ప్రచురించానని, ఆ పుస్తకం ప్రతి రచయిత చదివినట్లయితే కథలు రాయడంలో మెలుకువలు పాటించే అవకాశం ఉంటుందని రాములు అన్నారు.
ముఖ్య అతిధిగా వచ్చిన ఏనుగు నర్సింహారెడ్డి మాట్లాడుతూ స్త్రీవాదం భూమికగా చేసుకుని భండారు విజయ రచనలు చేస్తు, ఇతరులతో రాయిస్తున్న మంచి రచయిత అని కొనియాడారు.
తాను గతంలో అనిశెట్టి రజితతో కల్సి తెలంగాణ ప్రాంత విశిష్టతను తెలియచేసే “జిగర్” అనే అరుదైన కవిత్వ సంకలనం తీసుకుని వచ్చారు. ఎంతో శ్రమకోర్చి, తెలంగాణ కు అద్భుతమైన చేర్పును తెచ్చిన ఆ పుస్తకంలో నా కవిత్వం కూడా వుందని ఆయన గుర్తు చేశారు. తన మిత్రురాలు కీ శే. అనిశెట్టి రజితకు అంకితం ఇస్తూ తన కథా సంపుటి ‘సహజాత’ ను తేవడం ఆమెను స్మరించుకోవడం గొప్ప విషయం అన్నారు.
తను రచనలు చేస్తు, ఇతర రచయితల కథలతో కథా సంకలనాలు తీసుకుని వస్తూ స్త్రీవాదాన్ని సమర్ధవంతంగా ముందుకు తీసుకుని వెళ్తున్నారని అన్నారు. వారికి భాషా సంస్కృతి క శాఖ నుండి అభినందనలు తెలియచేసారు.
‘సహజాత ‘ కథా సంపుటిని పరిచయం చేస్తూ, ప్రముఖ సాహిత్య విమర్శకురాలు, రచయిత పి.జ్యోతి మాట్లాడుతూ ఈ సంపుటిలో వున్న 21 కథలు వస్తు పరంగా భిన్నమైనవని చెబుతూ ప్రతి కథ ఒక కొత్త చూపును అందిస్తుందని అన్నారు. కథలు విక్టిమైజడ్ మోడ్ లో వున్నాయని, సమస్య పరిష్కారాలు ఐడియాలిస్టిక్ గా, సైకోతెరిపి, కౌన్సిలింగ్ పద్దతిలో వున్నాయని అన్నారు. కథల్లో మనకు యాదార్ధవాదం, ఆదర్శవాదం కలిపి రాయడం జరిగిందని అన్నారు.
కథల్లో వర్ణనలు, పోయేటిక్ ఎక్స్ప్రెషన్ మూడ్ లోకి తీసుకెళ్తాయ్యని, కథల్లో వస్తు పరంగా శిల్ప పరంగా అద్భుతంగా వున్నాయని అన్నారు. Ivf పద్దతిలో సంతానం కనడం, సింగల్ మహిళలు మై ఛాయాస్ అంటూ పిల్లల్ని కనడం విప్లవాత్మకమైన ఆలోచనలు రేకెత్తిస్తాయని అన్నారు. అలాగే కులాంతర వివాహాలు, అందులోని సమస్యలు అద్భుతంగా ప్రెజెంట్ చేసారు. NRI పెండ్లిళ్ల విఫలత్వాలను తెలియజేసారు. అన్నీ కథలు బాగున్నప్పటికి, నాకు బాగా నచ్చిన కథలు అమ్మగది, దేవుడమ్మలు. పిల్లల లైంగిక వేధింపులు, సామూహిక అత్యాచారాల కథలు కూడా ఇందులో వున్నాయని ముఖ్యంగా యువత తప్పకుండా ఈ కథలు చదవాలని కోరారు.
ఇదే పుస్తకం మీద ప్రముఖ దళిత రచయిత జూపాక సుభద్ర మాట్లాడుతూ ఇందులోని అన్ని కథలు “సర్వే జన సుఖినో భవంతు” లా ముగుస్తాయని, కుటుంబాలు, వాటి పరిసరాలు , తెలంగాణ ఉద్యమంలోని సంఘటనలు, ట్రాన్స్ కమ్యూనిటీకి సంబంధిన కథలను చాలాబాగా రాసిందని అన్నారు. స్త్రీవాదంతో కథలు రాస్తూ, అదే వాదాన్ని తాను ఆచరిస్తున్నట్లు నటించే పురుష రచయితలు, తమ ఇళ్లల్లో స్త్రీలను ఎలా అణచివేస్తారో చెప్పే కథ చాలా బాగుంది. ఇందులో వున్న 21 కథలు మనల్ని చదివిస్తాయని, ముఖ్యంగా యువత ఈ కథలు తప్పకుండా చదవాలని కోరుతూ , ఈ కథల్లో సీతామహాలక్ష్మి, దేవుడమ్మ తనకు బాగా నచ్చాయని చెప్పారు.
రెండవ పుస్తకం “పరిష్క్తృత” ను పరిచయం చేస్తూ ప్రముఖ రచయిత, కార్టునిష్టు నెల్లుట్ల రమాదేవి “కాలాలు మారుతున్న స్త్రీల సమస్యలు” అలాగే వున్నాయని, ఇందులో కనిపించే సమస్యలు కొన్నయితే కనబడనివి అనేకం అని అన్నారు. గృహహింస అంశం మీద ఇందులో 16 కథలున్నాయని, అందులో దేనికవి భిన్నమైన సమస్యను తెలియచేస్తాయని చెప్పారు. భండారు విజయ తెచ్చిన ఈ పరిష్క్తృత సాహిత్యం చదివే వారికి సమస్యల పట్ల ఒక అవగాహనను ఇస్తాయని అన్నారు. ఏ వస్తువు తనంతట తాను కథగా మారదని, వస్తు ప్రధానంగా తెచ్చిన ఈ కథల్లో ఒక్కొక్కరిది ఎడతెగని వేదన అని అన్నారు. కథలన్నీ చదివిస్తాయని అందరూ చదవాలని ఆమె కోరారు.
ఇదే పుస్తకం మీద మరో రచయిత కస్తూరి ప్రభాకర్ మాట్లాడుతూ..మనం ఎప్పుడు ప్రొటెక్షన్ and రిస్ట్రిక్షన్ గురించి మాట్లాడుతామని, విక్టిమ్ ధోరణిలో కాకుండా విక్టి మైజడ్ ధోరణిలో సమస్యలు చూడాలని కోరారు.
గృహహింస, లింగ వివక్ష, ఇంటిచాకిరీ, అనుమానం, వరకట్నం,సంతాన సమస్యలు, వివాహ వ్యవస్థలో వున్న విభిన్న ధోరణులను ఈ కథల్లో చూస్తామని అన్నారు.
ఈ కథలు చదువుతున్నప్పుడు మన గుండెల్ని పిండేస్తాయని అంటూ...విపరీతమైన హింసా రూపాలు , చిత్రహింసలు ఈ కథల్లో కనబడతాయి. చదువుకున్న స్త్రీలు కూడా తప్పని పరిస్థితుల్లో అనుభవిస్తున్న హింస “రక్త గాయాల నది”గా ప్రవహిస్తూ..మనల్ని ఆలోచింప చేస్తాయి. ఇలాంటి కథలు కాలేజీ విద్యార్థులకు పరిచయం చేయవల్సిన అవసరం, వారిని చైతన్య పరచవల్సిన అవసరం ఎంతైనా వుందని అన్నారు.
తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి శ్రీ నామోజు బాలాచారి మాట్లాడుతూ కాలం మారుతున్న కొద్ది మహిళల సమస్యలు కొత్త రూపాలను సంతరించుకుంటున్నాయి. సమాజంలో పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువగా స్థిరంగా, బలంగా వుంటారు.కష్టాలను తట్టుకుని, సానుకూల దృక్పధంతో కథలు ముగిoచిన కథలే బాగుంటాయి.
పేద, మధ్యతరగతి , ధనిక కుటుంబాల్లో కూడా ఒక్కో రకమైన సమస్య కనిపిస్తుంది. సమస్యలు లేని స్త్రీ లెవరు ఈ సమాజంలో వుండరు. సాహిత్యం ఎప్పుడు పరిష్కార దిశగా వున్నప్పుడే అది సమాజానికి, వ్యక్తులకు ఉపయోగపడుతుంది.
అలాంటి కథలు, తను రాయడమే కాకుండా ఇతర రచయితలతో స్త్రీవాద దృక్పధంతో కథలు రాయిస్తూ, ఆ పుస్తకాలు ముద్రించి సమాజం దృష్టిలో పెడుతున్న భండారు విజయకి తెలంగాణ సాహిత్య అకాడమి తరపున అభినందనలు తెలియచేసారు.తెలంగాణ సాహిత్య అకాడమీ తరపున రచయిత భండారు విజయను శాలువతో సత్కరించారు.
మరో గ్రంథాలయ ఉద్యమ బస్ యాత్ర ఫిబ్రవరి 1వతేది ఉదయం ఉస్మానియా యూనివర్సిటీ నుండి మొదలై తేది 3 ఫిబ్రవరి ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ముగించే ఈ యాత్ర కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది.చివరగా గిరిజ పైడిమర్రి వందన సమర్పణ తో కార్యక్రమం ముగిసింది.


Read More
Next Story