తిరుమల కొండల్లో ట్రెక్ చేయాలనుకుంటున్నారా; జనవరి 25 అరుదైన అవకాశం
x
రామకృష్ణ తీర్థంలో హారతి (credit: TTD)

తిరుమల కొండల్లో ట్రెక్ చేయాలనుకుంటున్నారా; జనవరి 25 అరుదైన అవకాశం

తిరుమల కొండల్లోకి ప్రవేశించడం నిషేధం. అయితే, జనవరి 25 వ తేదీన టిటిడి ఒక అరుదైన ప్రదేశానికి అనుమతినిస్తాంది. ఇదొక అద్భుతమయిన ట్రెక్. అందేంటంటే..


తిరుమల కొండల్లో ఎన్ని తీర్థాలున్నాయో లెక్కలేదు. వైకుంఠతీర్థం, హలాయుధ తీర్థం, బ్రహ్మ తీర్థం, శేషతీర్థం, మార్కండేయ తీర్థం, స‌న‌క‌స‌నంద‌న తీర్థం, కుమారధార తీర్థం, తాంత్రికలోయ, శక్తి కఠారి తీర్థం, తుంబురు తీర్థం... ఇలా ఎన్నోొ తీర్థాలున్నాయి. వీటిలా చా లావాటికి వెళ్లేందుకు అనుమతి లేదు. అటవీశాఖ అధికారులనుంచి అనుమతి తీసుకుని మాత్రమే వెళ్లాలి. అందువల్ల సామాన్యులకు ఈ తీర్థాలేవీ అందుబాటులో లేవు. అక్కడక్కడా కొన్ని తీర్థాలలో సాదువులు మాత్రమే కనిపిస్తారు. కొన్ని తీర్థాలకు వెళ్లాలంటే పరిసర గ్రామాల్లోని ప్రజలసాయం తీసుకోవాలి. అయితే, టిటిడి వారు ఒక తీర్థాన్ని సందర్శించేందుకు ప్రతియేటా మాఘ మాసంలో అనుమతిస్తారు. అదే రామకృష్ణ తీర్థం.




ఈ తీర్థానికి కూడా నాలుగయిదు కిలో మీటర్లు అడవిలో కొండలు ఎక్కుతూ దిగుతూ వగరుస్తూ లోయల్లోకి చెక్కనిచ్చెనల ద్వార దిగుతూ చేరుకోవడం గొప్పగా అనుభవం. 2024లో జనవరిలో ఈ అక్కడి వెళ్లే అవకాశం లభిస్తూ ఉంది. దీనికి సంసిద్ధం కండి.





తిరుమ‌ల‌ గిరుల్లో ఒక ఆకర్షణీయ ప్రదేశం రామ‌కృష్ణ‌తీర్థం. ప్రతిసంవత్సరం మాఘపౌర్ణమి నాడు ఇక్కడ ముక్కోటి ఉత్సవం జరుగుతుంది. ఆ ఆరోజు ఉత్సవాన్ని తిలకిచేందుకు వేలాది మంది వస్తారు. తీర్థ స్నానం చేస్తారు. కరోనా కాలంలో ఈ ఉత్సవాన్ని నిషేధించారు. తీర్థస్నానం కోసం రామకృష్ణ తీర్థం వెళ్లి ఆ అడ‌విలోనే, ఆ కొండ‌ల మ‌ధ్య వెన్నెల‌లో నిద్ర చేసి, మ‌ర్నాటి ఉద‌యం తిరుగు ప్ర‌యాణ‌మ‌వుతారు. అదిమరొక మహానుభూతి.




ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ వల్ల కొన్నేళ్ళుగా తీర్థ ఉత్స‌వం రోజున‌ త‌ప్ప మిగ‌తా రోజుల్లో టీటీడీ అనుమ‌తించ‌డం లేదు. రామకృష్ణ తీర్థం ఉత్సవం చూడటం ఎత్తయితే, అందమయిన ప్రకృతి మధ్య పాదయాత్ర చేస్తూ తీర్థం చేరుకోవడం అద్భుతమయిన అనుభవం. తొందర్లోనే ముక్కోటి వివరాలను టిటిడి ప్రకటిస్తుంది.





సాధారణ రోజుల్లో ఈ తీర్థానికి ప్రవేశం లేదు కాబట్టి, వచ్చే ముక్కోటి ట్రెకింగ్ సిద్ధం కావాలి.2024 ముక్కోటి జనవరి 25 జరుగుతుంది. ఇప్పటికే నుంచే సన్నద్ధం కండి. ఏడాదికి ఒక సారి వచ్చే అవకాశం. జారవిడుచుకోవద్దు.

ముక్కోటి ఆ రోజు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అర్చ‌క సిబ్బంది మంత్రోచ్ఛాటణ చేసుకుంటూ ఊరేగింపుగా బయలుదేరి ఉదయం 9 గంటలకు శ్రీ రామకృష్ణ తీర్థానికి చేరుకుంటారు. అక్క‌డ కొలువై ఉన్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ భగవానుల విగ్రహాలకు పాలు, పెరుగు, చంద‌నం త‌దిత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం స‌మ‌ర్పిస్తారు. ఇదే ఉత్సవం. కర్నాటక, తమిళనాడు లనుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు.


రామ‌కృష్ణ తీర్థం ముక్కోటికి వెళ్లే భక్తులు మొదట ఉదయమే పాపవినాశనం డ్యామ్‌ చేరుకోవాలి. తిరుపతి నుంచి పాపవినాశనానికి భక్తులను తరలించేందుకు ఏపీఎస్ ఆర్టీసి బస్సులుంటాయి. డ్యాం వద్ద పొంగళి, ఉప్మా, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర పొట్లాలు, తాగునీరు, మ‌జ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తారు. పోలీసుల సమన్వయంతో టీటీడీ విజిలెన్స్‌, ఫారెస్ట్‌ మజ్దూర్‌లు భక్తులకు దారి పొడవునా భద్రత ఉంటుంది. పాపనాశం గోగర్భం డ్యాం పాయింట్ దాటి ప్రైవేట్ ట్యాక్సీలు జీప్‌లను అనుమతించరు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత భక్తులకు ప్రవేశాన్ని నిలిపివేస్తారు. తిరుమ‌ల‌లోని పాప‌నాశ‌నం డ్యాం వరకే వాహనాలు వెళతాయి. ఈ విషయం గమనించాలి. చాలామంది యాత్రికులు ఈ ట్రెకింగ్ అనుభవం కోసమే రామకృష్ణ తీర్థం వస్తుంటారు.

Read More
Next Story