వాళ్లు-వీళ్లు (కవిత)
ఇండియా వాళ్లు, వీళ్లు అని రెండుగా ఎంత స్పష్టంగా చీలిపోయిందో చక్కగా చెప్పిన చిక్కటి రాజకీయ కవిత.
వాళ్ళు -వీళ్ళు!
-తమ్మినేని అక్కిరాజు
'వాళ్ళ' దోపిడీ'వ్యాపారం'!
'వీళ్ళు'ఎదిరిస్తే'అక్రమం'!
'వాళ్ళు'ఏంచేసినా అట్టహాసం
'వీళ్ళు:ఏంచేసినా అపహాస్యం
'వాళ్ళది నిత్య దోపిడీ!
'వీళ్ళ' ది నిత్య దరిద్రం!
'వాళ్ళు' ఎలాగ పుట్టారో
'వీళ్ళు' అలాగే పుట్టారు!
భూమి..సర్వసంపదలు
'వాళ్ళ' చేతుల్లో ఉన్నాయి
'వీళ్ళ' చేతుల్లో దరిద్రం
రేఖలు గీసి ఉంది!
వాళ్ళుపెట్టుబడ్నినమ్ముతారు
'వీళ్ళు' కర్మ ని నమ్ముతారు!
వాళ్ళు 'గుళ్ళు' కడతారు
వీళ్ళు 'గుళ్ళు' గీయిస్తారు!
'వాళ్ళు'అన్నదానాలు చేస్తారు
'వీళ్ళు' వెళ్లి తిని వస్తారు!
వాళ్ళువాళ్ళుతోడుదొంగలు!
వీళ్ళువీళ్ళు చిర్రుబుర్రులు!
వ్యాపార అభివృద్ధికి
'వాళ్ళు' కలుసు కుంటారు!
కులంగొప్పలకోసం
'వీళ్ళు' తన్నుకుంటారు!
'వాళ్ళు' దినదినాభి వృద్ధి!
'వీళ్ళు' ఇంకా దిగజారుడు!
'వాళ్ళు' కులమతాల్ని
వాడుకుంటారు!
'వీళ్ళు' కులమతాల్ని
నిజమనుకుంటారు!
'వాళ్ళు' కలిసొస్తే కులాంతర
మైనా వదలరు!
'వీళ్ళు 'కులపౌరుషంతో
చంపుకుంటారు!
'వాళ్లకు' కులం కంటే
ధనం గొప్ప!
'వీళ్ళకు' ధనం కంటే
కులం గొప్ప!
'వాళ్ళు' సృష్టించిన పరలోకం
వీళ్ళ కోసం!
'వీళ్ళు' నమ్మిన పరలోకం
వీళ్ళకే తెలీదు!
'వాళ్ళ' పరమార్ధం 'లాభం'!
'వీళ్ళ' పరమార్ధం 'చావటం'!
'వాళ్ళు' ఓటు కొంటారు
'వీళ్ళు' ఓటు అమ్ముతారు!
'వాళ్ళ' భాగ్యం -పేదల
శ్రమ దోపిడీ!
'వీళ్ళ' దరిద్రం దేవుడికి
వదిలేయటం!
'వాళ్ళు' బ్యాంకుల్ని దోస్తారు
'వీళ్లు' బ్యాంకుల్లో దాస్తారు!
ఓటుతో పనిలేకుండా
'వాళ్ళ' ఆశ మనుస్మృతి!
దేనిగురించీ తెలియని
'వీళ్ళ' అజ్ఞానాంధకారం!
****
Next Story