వర్ణశోభ
x

వర్ణశోభ

మండే కవిత, హోలీ కవిత.





వర్ణ శోభ


డా.బండారి సుజాత


వసంతకాలమా వందనమందుమా
చిగురించే మోడులతో చిరునవ్వొందుమా
॥వసంత కాలమా॥

రాధమ్మ రంగులద్దే
కృష్ణయ్యకూర్మిపంచే
యశోదమ్మ ఎద మురియగ
రేపల్లె సంతసించె
॥ వసంత కాలమా॥

చెడును చెండాడీ మంచికి మార్గమేసి
కామాన్ని కాల్చేసీ
ప్రేమను పంచేటి
రంగుల పండుగా
రంగేలి పండుగ

॥వసంత కాలమా॥

మోదుగపూలన్నీ మోహనమై
విరియగా
తంగేడు పూలన్నీ తన్మయం చెందగా
బుక్కా,గులాలుతో భూమంత మురియగా
పసుపు ,కుంకుమలతో
ప్రకృతే నవ్వగా
జగమంత హోళి తో హోరెత్తి ఆడగా
మురిసేను ముంగిళ్ళు
కురిసిన వర్ణాలతో

॥వసంత కాలమా॥

ఫల్గుణ పౌర్ణమే ప్రజలకు హితమాయె
వరసైన వారిపై చల్లేటి రంగులతో
విరిసేను ఆనందం మెరిసేను అనుబంధం

॥వసంతకాలమా॥

హోళికా దహనంతో హోరెత్తె సంతసం
సింగిడి సింగారం సిరుల పందేరం
వర్ణాల కలయికతో స్నేహాలు చిగురించి చైతన్యమందేను


Read More
Next Story