సంఘర్షణలోంచే మంచి కవిత్వం పుట్టుకొస్తుంది
- డా. బండారి సుజాత పుస్తకాల ఆవిష్కరణలో ప్రముఖ విమర్శకురాలు కాత్యాయని విద్మహే
హన్మకొండలోని ప్రభుత్వ ప్రాక్టిసింగ్ ప్రాథమిక పాఠశాలలో రిటైర్డ్ ఉపాధ్యాయురాలు, కవయిత్రి రచించిన కవితా సంపుటి ‘వేకువ పుష్పం’, కథా సంపుటి ‘వెలుతురు చూడని యెన్నియలు’ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం శ్రీలేఖ సాహితి సమితి, వరంగల్ అధ్యక్షులు డా. టి. శ్రీరంగస్వామి అధ్యక్షతన ఘనంగా జరింది.
కార్యక్రమంలో ప్రముఖ విమర్శకురాలు, రచయిత్రి కాత్యాయని విద్మహే పుస్తకాలని ఆవిష్కరించి మాట్లాడుతూ కవిత్వంలో సాంద్రత, వ్యక్తీకరణ తోపాటు సాధారణ వాక్యానికి భిన్నంగా కవిత్వం ఉండాలని, లోతైన భావాలతో కవి నిరంతరం సంఘర్షణకు గురైనప్పుడే మంచి కవిత్వం వస్తుందని అన్నారు. డా. బండారి సుజాత రచనలలో సామాజిక అంశాలు ఎక్కువ చోటుచేసుకోవడం విశేషమని పేర్కొన్నారు.
కవి, ఉపాధ్యాయుడు బిల్ల మహేందర్ పుస్తకాన్ని సమీక్షిస్తూ సుజాత ఉపాధ్యాయురాలుగా, పరిశోధకురాలుగా, కవిగా, రచయితగా కొనసాగుతూనే పలు ప్రజాస్వామిక సంస్థలతో కలిసి విలువల కోసం నిరంతరం కృషిని కొనసాగిస్తున్నారని, తన రచనలలో మహిళలపై జరుగుతున్న వివక్షతలను ప్రశ్నించడంతోపాటు మగవాడి దౌర్ఙన్యాలనుండి స్త్రీ విముక్తి పొందేవిధంగా ధైర్యంగా అడుగులు ముందుపడాలని తెలియజేశారు.
మరో సమీక్షకులు సింగరాజు రమాదేవి మాట్లాడుతూ సుజాత కథలు మానవీయకోణంలో కొనసాగాయని అన్నారు. కార్యక్రమంలో అతిథులుగా అన్నవరం దేవేందర్, రాపోలు సత్యనారాయణ, అనిశెట్టి రజిత, పొట్ల పల్లి శ్రీనివాసరావు, రాపోలు సత్యనారాయణ పాల్గొని మాట్లారు. కవులు పి.చందు, నాగిళ్ళ రామశాస్త్రి, పల్లె నాగేశ్వరావు, కోడం కుమారస్వామి, మంథిని శంకర్, కార్తీకరాజు, గట్టు రాధిక. బాలబోయిన రమాదేవి, ఉదయశ్రీ ప్రభాకర్, వల్సపైడి, వందన, లీల, విద్యాదేవి, సోమన్న, సంపత్ రెడ్డి, ఆశయ్య తదితరులు పాల్గొన్నారు.
Next Story