
నల్గొండ దగ్గిర ‘వైజాగ్ కాలనీ’ , చేపలపులుసు, ఫ్రైకి ట్రేడ్ మార్క్
కృష్ణానది ఒడ్డున ఆహ్లాదకరమైన వాతావరణంలో వైజాగ కాలనీ ఎలా వచ్చింది, అక్కడ చేపల కూడా ఎందుకు అదిరిపోతుంది?
కృష్ణ నది ఒడ్డున ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ రకరకాల చేపల వంటకాలను రుచి చూడాలనుంటే ఒక సారి నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని వైజాగ్ కాలనీని సందర్శించవలసిందే!
మళ్ళీ మళ్ళీ సందర్శించేలా మనల్ని ఆ ప్రదేశం కవ్విస్తుంది. ఇక్కడ తయారు చేసే ఫిష్ ఫ్రై, రాష్ట్రమంతా గుర్తింపు వుంది. దానితో సమానంగా ఇంతా ఇష్టపడేది చేపలపులుసు. కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ చిన్న గ్రామం మత్య్స కారుల శ్రమైక జీవన సౌందర్యానికి చిహ్నం. తెలంగాణ నల్గొండ సమీపాన ఉన్న కాలనీ పేరు వైజాగ్ కాలనీ.
వైజాగ్ కాలనీ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి 137 కిలోమీటర్లు, జిల్లా కేంద్రం నల్గొండ నుంచి 83 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి ప్రజలకు కృష్ణ నదిలో చాపల వేట జీవనాదారం.
వారాంతపు సెలవులు శని, ఆదివారాలలో వందలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. భోజనప్రియులు హైదరాబాద్, ఇతర ప్రాంతాలనుంచి వైజాగ్ కాలనీని కి వస్తూవుంటారు.
తెలంగాణాలో వైజాగ్ కాలనీ ఏంటి ?
నాగార్జున సాగర్ ప్రాజక్టు నిర్మాణ సమయంలో వైజాగ్ ప్రాతం నుంచి కూలీ పనుల కోసం వలస వచ్చిన మత్య్స కారుల కుటుంబాలు ప్రాజక్టు నిర్మాణం తర్వాత ఇక్కడే స్థిరపడ్డాయి. వారంతా నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ సమీపంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. క్రమంగా ఇక్కడ నివసించే కుటుంబాల సంఖ్య 150 కి పెరగటంతో అక్కడ ఒక చిన్న గ్రామం ఏర్పడింది. ఇక్కడ నివసించే కుటుంబాలు అన్ని వైజాగ్ ప్రాతం నేపధ్యం ఉన్నవే. దీనితో ఈ గ్రామంపై వైజాగ్ కాలనీగా పేరు తెచ్చుకుంది.
తెలంగాణ ఉద్యమం ఉవెత్తున ఎగసిన కాలంలో కూడా సమీప గ్రామాలలోని ప్రజలు వీరి పట్ల ఎలాంటి ద్వేషం, వివక్ష చూపలేదు. వైజాగ్ కాలనీ ప్రజలకు ఈ ప్రాంతంలో ప్రత్యే క గుర్తింపు ఉంది.
ఇక్కడి మత్య్సకార కుటంబాలు చేపలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి చేపలు హైదరాబాద్, కలకత్తా వంటి నగరాలకు సరఫరా అవుతుంటాయి.
ప్రకృతి అందాల మధ్య ... చేప వంటల విందు
పర్యాటకులకు ఈ చేపల పులుసు, ఫ్రై రుచి చూసేందుకు వస్తారంటే ఆశ్చర్యం లేదు. ఆర్డర్ ఇస్తే ఇక్కడి మత్య్సకార కుటుంబాల మహిళలు ఆగమేఘాల మీద చేప పులుసు, ఫ్రై వంటలు తయారు చేసి అందిస్తారు. చుట్టూ ఉన్న కొండల నుండి వస్తున్న చల్లని గాలిని ఆస్వాదిస్తూ రుచికరమైన 'చేపల పులుసు' భోజనం అరుదైన అనుభవాన్ని మిగులుస్తుంది .
ఫిషింగ్ బోట్లలో కృష్ణా నదిలో ప్రయాణం చేస్తూ చుట్టు కొండలు, ప్రకృతి అందాలను ఆస్వాదించడం కోసం పర్యాటకుల కోసం ఇక్కడి మత్య్సకారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు.
రోహు (కార్ప్), కాట్లా, కొర్రమీను, బొచ్చెలు పంప్లెట్స్ మరియు రొయ్యల వంటి చేపలతో తయారుచేసిన వంటకాలు సరసమైన ధరలకు లభిస్తాయి. ఇక్కడి మత్స్యకార కుటుంబాల మహిళలు వండే 'చేపల పులుసు' రుచి ప్రత్యేకంగా ఉంటుంది. కల్తీ మసాలాలు వాడరు. అంతా అక్కడే తయారు చేసుకున్న మసాలాలు వాడటంతో ఈ రుచి బయటి ప్రాంతాలలో రెస్టారెంట్లలో లభించే దానికంటే భిన్నంగా ఉంటుంది.
"మేము ప్రత్యేకంగా తయారు చేసే మసాలాలు వల్లనే మా చాపల కూరకు ఆ రుచి వస్తుంది," మత్య్సకార కుటుంబానికి చెందిన మహిళ పి. పార్వతమ్మ తెలిపారు. మసాలా తయారీకి వాడే దినుసుల గురుంచి చెప్పటానికి మాత్రం ఆమె ఇష్టపడలేదు.అది గోప్యం అంటూ సిగ్గుపడుతుంది. ఒకరికి సరిపోయే అన్నం, చేప పులుసు, ఫ్రై ని కేవలం 120 రూపాయలకే అందిస్తామని ఆమె తెలిపారు. ఈ ధరకు పట్టణాలలో స్ట్రీట్ ఫుడ్ కూడా దొరకదు. ఎందుకంత చౌక. "మేము సందర్శకులను కస్టమర్లుగా భావించము, అతిధులుగా భావిస్తాము. ఇది ఒక రోజు అమ్మి నాలుగు రూకలు సంపాదించే వ్యాపారం కాదు. నిరంతరం సాగాలి. ఒక సారి వచ్చిపోయిన వ్యక్తి మళ్లీ మళ్లీ రావాలి. అందుకు మేం చాలా తక్కువ లాభం తీసుకుంటాం," అని ఆమె తెలిపారు.
తాజా చేపలు వాడటం కూడా వంటల ప్రత్యేక రుచికి కారణమని మత్స్యకారుడు కూర శంకర్ అన్నారు. " మా వైజాగ్ కాలనీలో అప్పుడే పట్టిన తాజా చేపలతో వంటలు చేస్తాము.అంతా కళ్లెదుటే జరుగుతుంది. అందువల్ల వంటలు చాలా రుచికరంగా ఉంటాయి," అని శంకర్ న్నారు.
హైదరాబాద్‌కు చెందిన కత్రోజు నవీన్ అనే పర్యాటకుడు రెగ్యులర్ విజిటర్. వారాంతంలో రిలాక్స్ కావాలనుకుంటే ఆయన కుటుంబంతో ఇక్కడికి వస్తారు. , " వైజాగ్ కాలనీ ఆహ్లాదకరమైన వాతావరణం లో ఉంది. అనుమానం లేకుండా కాలనీ వాస్తులు క్వాలి టీ భోజనం అందిస్తారు. శుచిగా రుచికరంగా చేపల వంటకాలు తయారు చేస్తారు. క్వాలిటీ గురించి ఏమీ అనుమానించాల్సిన పనిలేదు. దానికి తోడు హైదరాబాద్ కు సమీపానే ఉంటుంది. ఈ కారణంతో వా రాంతాల్లో కుటుంబ సమేతంగా ఈ ప్రదేశాన్ని రావటానికి ఇష్టపడతాను,"అని నవీన్ న్నారు. ఇది తాము వైజాగ్ కాలనీని సందర్శింటం ఐదవ సారి అని అయన తెలిపారు. మత్స్యకారులు కూడా సందర్శకులతో స్నేహపూర్వకంగా ఉంటారని ఆయన అన్నారు.

