VOICE OF VOICELESS | గుర్తుంచుకోండి!'వాళ్ళ'కుట్రలు కూహకాలు!
తమ్మినేని అక్కిరాజు.. ప్రగతిశీల కవి. పదునైన పదాలతో ప్రజల కష్టసుఖాలను మన ముందుంచే రచయిత. ప్రజాస్వామ్యం పేరిట ప్రస్తుతం జరుగుతున్న కపటాన్ని చీల్చిచెండాడాడు.
తమ్మినేని అక్కిరాజు.. ప్రగతిశీల కవి. పదునైన పదాలతో ప్రజల కష్టసుఖాలను మన ముందుంచే రచయిత. అభ్యుదయ వాది. ప్రజాస్వామ్యం పేరిట ప్రస్తుతం జరుగుతున్న కపటాన్ని చీల్చిచెండాడాడు. ఆ కవిత ఏమిటో చదవండి.
"మనకు తెలియటం లేదు
'వాళ్ళ'కుట్రలు కూహకాలు!
ఇది నాలుగుస్తంభాలాట!
ఒకస్తంబాన్ని బానిసల్ని చేసి
పీడించితాడించి పీల్చి పేల్చి
ఎంతో బలహీనలుగా చీల్చి
రాజ్యాధికారం చేస్తున్నారు!
వాళ్లు చీల్చిన'ఒక్కస్తంభం'
చీలికలు పేలికలై మనం
అందరం ఒకటే అని మరచి
ఏడువేల కులాలుగామారి
మనలోమనం ఎవరు గొప్ప
అని వెతుక్కుంటూ వాడికి
ఇంకా హీనమై పోయాము!
అందరం కష్టజీవులమన్న
స్పృహపోయి మనలో మనం
ఎక్కువ తక్కువ కులాలను
వెతుక్కుంటున్నామంటే
అదివాడిదుష్ట వ్యూహం!!
మనమంతాపావులమైఇంకా
వాడి వ్యూహంలోనే ఉన్నాం!
కమ్మరి కుమ్మరి కంసాలి
సాలె ఒడ్డెర ఎరుకల మాల
మాదిగ చాకలి మంగలి...!
సహస్రవృత్తుల కష్టజీవులం
అందరిదీ 'శ్రామిక కులం'!
ఎక్కువతక్కువ లేనేలేదు
ఒక్కటైమనం పోరాడుదాం!
గడ్డిపోచలన్నీ ఒక్కటై
గజమును బంధించలేదా!
ఈసత్యాన్నెవరుమరవకండి
నేనుగొప్ప, నాకులంగొప్పని
కలలోకూడా రానివ్వ కండి!
వర్గ చైతన్యంతో పోరాడితే
విజయమ్మనదేరాజ్యమ్మనదే
కష్టజీవులం ఒకటే అంటూ
నిత్యంమీరుస్పృహలోఉండి
తరతరాలుగాసాగుతువున్న
ఆర్ధిక సాంస్కృతిక దోపిడికి
వ్యతిరేకంగా అందరూ ఒకటై
పోరాడితేనే విజయం అని
నిత్యంమీరు గుర్తుంచుకోండి!
ఆనాడే దారిద్ర్యం నుండి
మనకు నిజమైన విముక్తి!
అంతవరకువీళ్లాడేఆటలో
మనమంతా పావులం!
వీళ్ళ మార్కెట్లకు లాభాలకు
మనం బలిపశువులం!
ఇదికూడా గుర్తుంచుకోండి!"
****
-తమ్మినేని అక్కిరాజు
Next Story