
హోలీ ఇప్పుడు యుద్ధ వర్ణం!
యుద్ధ పిపాసి దేహంలో పారేది రక్తం కాదు మృత్యువు!
హోలీ రంగు సప్త వర్ణం కాదు!
హోలీ రంగు ఇప్పుడు యుద్ధం!
యుద్ధం రంగు మనిషి రక్తపు ఎరుపు!
యుద్ధం రంగు కన్నీటి తెలుపు !
**
యుద్ధం రంగు ఇప్పుడు సామ్రాజ్యవాదం!
యుద్ధం రంగు స్వార్థం!
యుద్ధంరంగు ఇప్పుడు పెట్టుబడి!
యుద్ధం రంగు ఇప్పుడు మత విద్వేషం!
యుద్ధం రంగు ఇప్పుడు
రెండు నెలల పసిగుడ్డుని కూడా
చిదిమేసే కులోన్మాదం!
యుద్ధంరంగు ఇప్పుడు జాత్యాహంకారం!
యుద్ధం రంగు ఇప్పుడు అత్యాచారం!
యుద్ధం రంగు ఇప్పుడు వలసల సంక్షోభం!
యుద్ధం రంగు ఇప్పుడు జాతి నరమేధం!
**
బద్దలైన ఇళ్ళూ,
పేలిపోయిన బడుల బూడిదే యుద్ధం రంగు!
చెదిరిపోయిన పిల్లల రంగు రంగుల స్కూలు బాగుల మీది
చిద్రమైన పసినెత్తురు కదా యుధ్ధపు రంగు?
అక్షరాలు చెదరని నోటు పుస్తకాలలో గీచినః
సూర్యోదయపు బంగారు రంగు!
ఎగిరే శాంతి పావురాల రెక్కల చిత్రాల రంగు !
సాయంత్రం ఇంటికి పోయాక
నాన్నమ్మకి, తాతయ్యకు చూపించాలనుకున్న,
ఆ పసి చేతులు వేసిన
అమ్మా నాన్నల బొమ్మలలోని
ప్రేమని ధ్వంసం చేయడమే కదా యుధ్ధపు రంగు!
**
ఇరాన్ లోని 'మినాబ్ 'లో బడినీ,
పిల్లలు కూర్చునే గదులనీ
వందల ఖనన గుంతలుగా
ఃమార్చిన క్రౌర్యం కదా యుధ్ధపు రంగు!
పిల్లలపై నీ ఎప్స్టీన్ కామ ప్రకోపాన్నించి
లోకం దృష్టిని మళ్ళించడానికేగా
You paedophile!
ఈ యుద్ధం!
***
వేదన రంగు,ఆక్రందన రంగు,
ప్రాణాలు విడుస్తున్నప్పటి జీవితేచ్చ రంగు,
భూమ్మీద విడిచిన చిట్ట చివరి శ్వాస రంగు
ఎరుపు! అవును యుధ్ధపు రంగు మనిషి రక్తంలా ఎరుపు!
*
ఇప్పుడు హోలీ రంగు సప్త వర్ణం కాదు!
ఒక్క ఎరుపు మాత్రమే!
సామ్రాజ్యవాది జాత్యహంకార వికటాట్ట హాసపు ఎరుపు రంగు!
ఎప్స్టీన్ ఫైళ్ల కామపు ,భయపు రంగు ఎరుపు!
వాడు దోచాలనుకున్న చమురు వనరుల రంగు,
తానే అడవైపోయి బలైపోయిన
హిడ్మా దేహపు గాయాల రక్తం రంగు ఎరుపు!
ఎలాన్ ముస్క్,అదానీ అంబానీల క్రూరమైన నవ్వుల రంగు ఎరుపు !
**
రంజాన్ మాసపు ఖీర్ రుచిని,
నెలవంక సౌందర్యాన్ని రక్తశిక్తం చేసిన
యుద్ధ పిపాసి దేహంలో పారేది రక్తం కాదు మృత్యువు!
**
అరే పదండి!
ఎవరైనా ఈ సామ్రాజ్యవాద మృగాలకు
ప్రేమ రంగుని అద్దండి!
యుద్ధ విరమణది,
రుధిర వర్ణం ఒక్కటే కాదని,
సప్త వర్ణాలూ అని , ప్రేమ రంగు మరణం కాదనీ,
పసి పిల్లల నవ్వుల తెలుపు రంగనీ చెప్పండి!
**
ఎన్నటికీ ఇక ఇంటికి తిరిగి వెళ్ళలేని
ఆ పిల్లలు అక్కడ సమాధుల్లో
నిద్ర పట్టక ఏం ఆలోచిస్తున్నారో?
పదండి,
ఆ నూటయాభై పిల్లల సమాధుల సాక్షిగా
వాళ్ళు చెప్పాలనుకున్నవి, మిస్సైళ్ళ దాడుల్లో బద్దలై,
చెల్లా చెదురై పోయి,
గొంతు చిట్లిన ఆ చిన్నారుల చిట్ట చివరి మాటలేవో,
అల్లాహో అక్బర్ అనో, అమ్మీ బచావో అనో,
యుద్ధం ఆపమనో,ఈ పాపాత్ములను కూడా క్షమించమనో,
మరి అన్నవో,అరిచినవో విందాం పదండి!
ఆ కడపటి మాటలు!
వాడిని యుద్ధం ఆపమని గర్జిద్దాం పదండి!
Next Story

