![ప్రేమికుల రోజు ఏమి చేయాలబ్బా! ప్రేమికుల రోజు ఏమి చేయాలబ్బా!](https://telangana.thefederal.com/h-upload/2024/02/12/430021-screenshot-2024-02-12-115458.webp)
ప్రేమికుల రోజు ఏమి చేయాలబ్బా!
ప్రేమిస్తే సరిపోదు, ప్రేమించానని చెప్పాలి, మీ ప్రేమ సక్సెస్ కావాలంటే మీ పార్టనర్ కి ఆ విషయం తెలియాలి.. అదేంటో చూడండి
ఫిబ్రవరి 14.. వాలెంటైన్స్ డే.. తెలుగులో ప్రేమికుల దినోత్సవం.. ప్రేమికులకు, ప్రేమించిన వాళ్లకి, ప్రేమించబోయే వాళ్లకి శుభాకాంక్షలు. ప్రేమకు ప్రతిరూపం రోమన్ అంటుంటారు. ఈ వాలెంటైన్ అనే పదం అక్కడి నుంచే పుట్టిందన్నా చరిత్రా ఉంది. ఫిబ్రవరి మధ్యలో వస్తుంది. దీనికో కథా ఉంది. వసంత రుతువులో వచ్చే ఓ పండుగ ఇది. ఎన్నో పరిమితులు, మరెన్నో ఆంక్షల మధ్య 15 వందల ఏళ్లుగా ఈ పండుగను జరుపుకుంటూనే వస్తోంది ప్రపంచం. 5వ శతాబ్దం చివర్లోనైతే రోమ్ లో దీనిపై నిషేధం కూడా విధించారట.
వాలెంటైన్స్ డే చరిత్ర ఇదీ...
పురాతన రోమన్ పండుగ. వాలెంటైన్ అనే పేరుతో అనేక మంది క్రైస్తవ అమరులు ఉన్నప్పటికీ, చక్రవర్తి క్లాడియస్ II గోతికస్ చేతిలో చనిపోయిన ఓ ప్రీస్ట్ కు గుర్తుగా ఈ పేరు వచ్చిందన్న కథనమే నిలిచిపోయింది. క్రీస్తూ పూర్వం 270లలో ఈ ప్రీస్ట్ చనిపోయారు. ఇప్పుడున్న కథల ప్రకారం ఆ ప్రీస్ట్ ఓ జైలర్ కుమార్తెను ప్రేమించారు. అది జైలర్ కి ఇష్టం ఉండదు. చక్రవర్తికి ఫిర్యాదు చేస్తే ఆ రాజు ఈ పూజారికి మరణశిక్ష విధిస్తారని, ఆ సందర్భంగా ఆ ప్రీస్ట్ రాసిన లేఖను జైలర్ కుమార్తెకు అందిస్తూ "మీ వాలెంటైన్ నుంచి వచ్చిన లేఖ" ఇది అంటారని, అదే వాలెంటైన్ డేగా నిలిచిపోయిందన్న కథనం ప్రచారం ఉంది. ఆతర్వాత ఎన్నెన్నో కథలు ప్రచారంలో ఉన్నా ఇదే నిలిచిపోయింది. సెయింట్ వాలెంటైన్ ఆఫ్ టెర్ని, ఒక బిషప్ పేరిట ఈ కథనం ఉంటుంది. సెయింట్ వాలెంటైన్ చక్రవర్తి ఆదేశాలను ధిక్కరించాడు కాబట్టి చనిపోయి ఉంటారు.
ఇవన్నీ ఎలా ఉన్నా ఇవాళ ప్రపంచమంతా జరుపుకుంటోంది. కార్పొరేట్లు పెద్దఎత్తున వ్యాపారమేళాగా మార్చాయి. ఈవేళ ఇదో పెద్ద ఈవెంట్ గా మార్చివేశాయి. 15 వందల రకాల అధికారిక సందేశాలు లేదా వాలెంటైన్స్ సందేశాలు ఈవేళ మనకు కనిపిస్తుంటుంటే వ్యాపార సందేశాలు 1700లకు పైగా ఉన్నాయంటేనే ఇది ఎంతగా వ్యాపారమైందో మనకు తెలుస్తుంది.
ప్రేమ అనడంతోనే మనకు గుర్తుకువచ్చేది మన్మథుడు. ఫిలిప్పీన్స్‌లో ఇది అత్యంత సాధారణ వివాహ వార్షికోత్సవం. ఆ తేదీన వందలాది జంటల సామూహిక వివాహాలు చేసుకుంటాయి. బంధువులు, స్నేహితుల మధ్య ఆప్యాయతలు చూపుకుంటూ ముందుకు సాగుతుంటారు.
గాఢంగా అందరూ ప్రేమిస్తారు. కానీ.. అదే స్థాయిలో ప్రేమను వ్యక్తపరచడం అందరికీ రాదు. ఈ పని సరిగ్గా చేయలేక విలువైన ప్రేమను కోల్పోయిన వారు ఎందరో. అవును.. ప్రేమ సక్సెస్ కావాలంటే నీ పార్ట్నర్ను నువ్వెంత ప్రేమిస్తున్నావో నీకు తెలిస్తే సరిపోదు.. తనకు తెలియాలి. నువ్వు తన వెంట ఉంటే చాలు.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా జీవితాంతం ధైర్యంగా బతికేయగలను అనే నమ్మకం వాళ్లకు కలగాలి. అప్పుడే.. నీ వేలు అందుకుని.. నీతో ఏడడుగులు వేస్తారు. ఈ భావన కలిగించకుండా.. కేవలం ప్రేమిస్తున్నాను అని చెప్పడం ద్వారా ఉపయోగం లేదంటున్నారు మానసిక నిపుణులు. భాగస్వామికి ఆ నమ్మకం కలిగించడంతోపాటు.. లవ్ ప్రపోజ్ చేయడానికి ముందు మరికొన్ని విషయాలు గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు.
చాలా మంది ప్రేమ గురించే ప్రపోజ్ చేస్తారు. కానీ.. మీరు పెళ్లి చేసుకోవడానికి కూడా ప్రపోజ్ చేయొచ్చు. దీని వల్ల మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో మీ పార్ట్నర్కు తెలుస్తుంది. మీది టైమ్ పాస్ లవ్ కాదు అని అర్థమవుతుంది. అంతేకాకుండా తనలో ఏ క్వాలిటీస్ నచ్చాయో చెప్పండి. తద్వారా.. ఎందుకు లవ్ చేస్తున్నారో క్లారిటీ వస్తుంది.
పెళ్లి తర్వాత ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి..? ఎలా ఉండాలనుకుంటున్నారు..? అనేది చెప్పేయండి. అంతేకాకుండా.. మీ ప్రేమను పెళ్లి పట్టాలు ఎక్కించడానికి ఏం చేస్తారో ముందే ఆలోచించుకోండి. ఆ విషయాన్ని కూడా చెప్పేయండి. పెళ్లికోసం.. మీ పార్ట్నర్ పేరెంట్స్తో కూడా మాట్లాడతానని చెప్పండి. వారిని ఎలా ఒప్పిస్తారో కూడా వివరించండి.
ఒక పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేయడం కాకుండా.. మీ పార్టనర్ ఇష్టాఇష్టాలకు విలువ ఇస్తూ.. వారు మెచ్చేలా ప్రపోజ్ చేయండి. అంటే వారికి నచ్చిన ప్రదేశాలకు తీసుకెళ్లి ప్రపోజ్ చేయడం, లేకుంటే ఇష్టమైన వస్తువులను ఇచ్చి వారు సర్ప్రైజ్ అయ్యేలా మీ ప్రేమను వ్యక్తపరచండి. అందుకోసం ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. మీరు ఏమి చేసినా మీ పార్టనర్ ను ఇంప్రెస్ చేసేలా ఉండాలని మరిచిపోవొద్దు.