
మద్రాస్ అసెంబ్లీలో ముత్తులక్ష్మికి పెరియార్ ఇచ్చిన సలహా ఏంటీ?
1947 అక్టోబర్ 8... మద్రాస్ అసెంబ్లీ నిండుకుండలా ఉంది. సభలో సభ్యులు రెండు వర్గాలు విడిపోయి ఉన్నారు. యావత్తు అయ్యర్లు ఓవైపు, మిగతా వాళ్లందరూ మరో వైపు..
1947 అక్టోబర్ 8... మద్రాస్ అసెంబ్లీ నిండుకుండలా మౌనంగా, గంభీరంగా ఉంది. సభలో సభ్యులు రెండు వర్గాలు విడిపోయి ఉన్నారు. ఓవైపు యావత్తు అయ్యర్లు, మిగతా వాళ్లందరూ ఓ వైపు.. ముఖ్యమంత్రి రాజాజీ.. రాజకీయ ఉద్దండుండే.. కానీ చేష్టలుడిగిన వారిలా ముందువరుసలో కూర్చొని ఉన్నారు.
అప్పుడు శాసనసభ్యులు ఒ.పి. రామస్వామి రెడ్డియార్, ముత్తులక్ష్మి రెడ్డి ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సభాపతి అనుమతి కోరారు. ఆ తీర్మానమే... దేవదాసి నిర్మూలన చట్టం కోసం పెట్టిన తీర్మానం. సభలో దేవదాసి రద్దు తీర్మానం అనడంతోనే అయ్యర్లు కోడెతొక్కిన తాచుల్లా రెచ్చిపోయారు.
సభలో గందరగోళం ప్రారంభం అయ్యింది. సత్యమూర్తి అయ్యర్, శ్రీనివాస్ అయ్యర్, గోవిందరాఘవ అయ్యర్, శేషగిరి అయ్యర్ల టీం.. "దేవదాసి వ్యవస్థను నిర్మూలించడం సనాతనధర్మానికి విరుద్ధం, మతశాస్త్రాలకు వ్యతిరేకం" అంటూ ఆందోళన చేశారు. రెండు పక్షాల ఆందోళనలో రాజాజీ మౌనం వహించారు. తీర్మానాన్ని ఎలాగైనా గట్టెక్కించాలని ఓ వర్గం గట్టిగా తలపెట్టింది. ఈ దశలో గందరగోళం జరిగింది. ఏమి చేయాలో పాలుపోని ముత్తులక్ష్మికి చటుక్కున ఓ ఐడియా వచ్చింది.
పెరియార్ ఏమన్నారంటే...
ఆరోజు సాయంత్రం ముత్తులక్ష్మి నేరుగా మహిళా పక్షపాతి, సంఘ సంస్కర్త, హేతువాద ఉద్యమనేత పెరియార్ రామస్వామి ఇంటికి వెళ్లి విషయం చెప్పారు. ఈ సంకట స్థితి నుంచి గట్టెక్కే సలహా ఇమ్మని కోరారు. ఓ గంటసేపు మాటా మంతి సాగిన తర్వాత ఏమి చేయాలో పెరియార్ సలహా ఇచ్చారు. ఆ తర్వాత సీనే మారిపోయింది. నేర్పరితనమంటే ఏమిటో నిరూపించారు. అమ్మ అనేదానికి నీయమ్మ అనే దానికి ఎంత తేడా ఉంటుందో అలాగే చేయించారు. ఏ అస్త్రమైతే విపక్షం ప్రయోగించిందో అదే అస్త్రాన్ని తిప్పి కొట్టడమంటే ఏమిటో సభలో నిరూపితమైంది.
ఇక సీను ఎలా మారిందంటే...!
మరుసటి రోజు సభ ప్రారంభం కాగానే సత్యమూర్తి అయ్యర్ చర్చ ప్రారంభించారు. "దేవదాసిలు సనాతన ధర్మం, శాస్త్రాలతో దేవాలయంలో ఏర్పాటు చేయబడ్డ పరిచారికలు. దేవదాసిలు నేరుగా దైవ సేవకులు. వారు చేసే అన్నీ పవిత్రకార్యాలను బట్టి వారికి భగవంతుని సర్వఆశీస్సులు, సుఖభోగాలు లభిస్తాయి. దేవదాసీలంటే దేవతా మూర్తులే, సమాజ శ్రేయస్సు కాంక్షించే వారే"నంటూ సత్యమూర్తి సుదీర్ఘ, అనర్ఘళ ప్రసంగం చేశారు. ఆ తర్వాత తాపీగా లేచిన ముత్తులక్ష్మి.. సత్యమూర్తి ప్రసంగాన్నే యధాతథంగా పదాలను అటు ఇటూ మార్చి అద్భుతంగా తిప్పికొట్టారు. ఎలాగంటే "అయ్యర్ గారు చెప్పిన శాస్త్ర విషయాలతో ఏకీభవిస్తున్నాను. అయితే.. ఇన్ని వందల సంవత్సరాల నుంచి మేము చేసిన సేవలకు మాకు దక్కిన శుభాశీస్సులు మాకిక చాలు. ఇకపై ఇటువంటి పనులు చేయటం ద్వారా దైవాశీస్సులను మీరే స్వీకరించండి. ఇది సనాతన ధర్మం అని నమ్మే వారు మీ ఇంటి ఆడవాళ్ళని.. మీ బ్రాహ్మణ మహిళలని స్వచ్ఛదంగా దేవదాసీలుగా మార్చాలని కోరుతున్నాను!" అని కూర్చున్నారు. సభ మూగబోయింది. అయ్యర్లకు ఏమి చేయాలో మళ్లీ ఎలా తిప్పికొట్టాలో అర్థం కాలేదు. పెరియార్ రామస్వామి చెప్పిన మంత్రం అదే. అద్భుతంగా పని చేసింది.
ఫలితం తేలిపోయింది. మద్రాస్ అసెంబ్లీ "దేవదాసి నిర్మూలన చట్టాన్ని" ఆమోదించింది. అప్పటి మద్రాస్ స్టేట్ లోని రాయలసీమ, కోస్తా ఆంధ్ర ల్లోని మాతమ్మ, జోగిని వ్యవస్థ, మలబార్ ప్రాంతంలోని నంగా వ్యవస్థ, కన్నడ ప్రాంతంలోని బసివి ని వ్యవస్థ రద్దు అయ్యాయి.
దేవదాసి పుత్రిక డాక్టర్ ముత్తులక్ష్మి...
దేవదాసి తల్లికి జన్మించిన డాక్టర్ ముత్తులక్ష్మి ఆ తర్వాత డాక్టర్ సుందరరామిరెడ్డిని వివాహం చేసుకున్నారు. పెరియార్ ఉద్యమ ఫలితంగా అనేక ప్రతికూల పరిస్థితులను ఎదిరించి చదువుకుని డాక్టర్ అయ్యారు. ప్రపంచ ప్రఖ్యాత అడయారు కేన్సర్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ అయ్యారు. పేదల పాలిట పెన్నిదయ్యారు.
శాస్త్రాలు చెప్పాయని దేవుడితో కళ్యాణం జరిపించి వాళ్ళని వేశ్యలుగా మార్చి వాడుకుని 40 ఏళ్ల తర్వాత వేలం వేసే నీచ నికృష్ట ఆచారం వందల ఏళ్ల నుంచి సనాతన ధర్మం పేరుతో ఆచరించేవారు. ఒక్క తంజావూరు టెంపుల్ లోనే రాజరాజాచోళుని కాలంలో 400 మంది పైగా దేవదాసిలు ఉండేవారు అని చరిత్ర.