
సికింద్రాబాద్‌లో పురా జ్ఞాపకాల మ్యూజియం
సికింద్రాబాద్ లోతుకుంటలో వై కృష్ణమూర్తి ఏర్పాటు చేసిన YK Antiques హోమ్ మ్యూజియంలో 700కి పైగా పురాతన వస్తువుల ప్రత్యేక ప్రదర్శన.
మీరు ఎప్పుడైనా పురాతన వస్తువులు అంటే ఒక దశాబ్దం వెనుక, మన ముందు తరం వాడిన వస్తువులు, అప్పటి కాలం వాళ్ళు వాడిన పనిముట్లు ఎప్పుడైనా దగ్గర ఉండి చూసారా ? ...మనం పాత వస్తువుల్ని, ఇంకా చారిత్రక ఆధారాలు కలిగిన వాటిని చూడాలి అంటే ఏ మ్యూజియం కో వెళ్ళాలి కదా. పురాతన సంపద ని సేకరించాలి అంటే చాలా అంటే చాలా కష్టం తో కూడినది మరియు ఖర్చు కూడా ...తన జీవితం లో సేకరించిన మొత్తం పురాతన వస్తువుల్ని సేకరించి తన ఇంట్లో నే మ్యూజియం లా ప్రదర్శన కి పెట్టారు ఒక వ్యక్తి ...ఎస్ వారు మరెవరో కాదు వై కృష్ణ మూర్తి గారు.
ఈ మ్యూజియం గురించి నాకు కూడా తెలియదు. కానీ ఫేస్బుక్ లో ఒక మిత్రుని కామెంట్ లో ఈ అద్భుతమైన మ్యూజియం గురించి తెలిసింది ..తెలిసిన వెంటనే ఇక ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా ఒక మిత్రుని సహాయం తో వెళ్ళాం.. అయితే ఇక్కడ ఈ మ్యూజియం ప్రత్యేకత ఏమిటి అంటే ముందు గా వారి అప్పోయింట్మెంట్ తీసుకొని వెళ్లడం . ఉదయం పదకొండు నుంచి ఒకటి వరకు, మరల సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది వరకు ఉంటుంది. ముందు గా చెప్పడం మూలాన మాకోసమే ఎదురు చూస్తున్నారు .. వారు మమల్ని ఆహ్వానించిన తీరు అద్భుతం...
పురాతన వస్తువులను సేకరించడం నుండి హోమ్ మ్యూజియంను నిర్వహించడం వరకు గల ప్రస్థానం వారి మాటల్లోనే ..
"చిన్నప్పుడు కూడా, నేను ఎక్కువ సమయం నా తల్లి వంటగది పాత్రలతో గడిపేవాడిని. నేను తరచుగా ఈ పాత పురాతన వస్తువుల చుట్టూ తిరుగుతూ ఉండేవాడిని, ఆసక్తికరమైన నమూనాను సృష్టించడానికి వాటిని అమర్చేవాడిని లేదా సంగీతం పేరుతో శబ్దం చేసేవాడిని" అని పురాతన వస్తువుల సేకరణకర్త గుర్తుచేసుకున్నాడు, పురాతన వస్తువుల పట్ల ఆయనకున్న మక్కువ వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. సోమేశ్వరం కాకినాడలోని ఒక సాంప్రదాయ కుటుంబం నుండి వచ్చిన వై కృష్ణమూర్తి, తన కెరీర్ ప్రారంభంలో చెన్నైలోని వారి ఫ్లాట్‌కు తన తల్లి తన ఇత్తడి సెట్‌ను తెచ్చినప్పుడు పురాతన వస్తువుల పట్ల ఆయనకున్న ఉత్సాహం ప్రారంభమైంది. అతని గదిలోని ప్రదర్శన ప్రాంతం అనధికారిక మ్యూజియంగా మారింది, ప్రజలు వారి చిన్ననాటి జ్ఞాపకాలు, ఆ మంచి పాత రోజులు మరియు వారి అమ్మమ్మ వంట అద్భుతాల గురించి మాట్లాడటం ప్రారంభించారు. ఈ సంతోషకరమైన ప్రమాదం ఈ అవశేషాలను సంరక్షించాలనే జీవితకాల కోరికకు దారితీసింది మరియు తద్వారా పురాతన వస్తువులను సేకరించే కథ ప్రారంభమైంది. అతని సేకరణలలో ఎక్కువ భాగం తెలిసిన కుటుంబాల నుండి నేరుగా పొందబడతాయి. ప్రతి ముక్కకు ఒక ఆసక్తికరమైన కథ ఉంది- దాని తయారీదారు, దాని వినియోగదారు మరియు వస్తువు యొక్క కథ! ఈ సేకరణ చివరికి మనోహరమైన అనుభవాలతో కూడిన రిపోజిటరీగా మారింది.
ఈ మ్యూజియం ఎప్పుడు స్థాపించారు, ఎలా ఎక్కడ నుంచి తెచ్చారు, అక్కడి వస్తువులు వాటి ఉపయోగాలు అన్నీ కూడా సవివరంగా చెప్పారు. అక్కడ ఉన్న ఒక్కో వస్తువు కి ఒక్కో చరిత్ర ఉంది. నేను చాలా అంటే చాలా ఆశ్చర్యపోయాను. ఎప్పుడో పద్దెనిమిది శతాబ్దం లో ఉన్న గ్రామఫోన్ ఇంకా, పురాతన టెలిఫోన్, గంగాళం, పెట్రోమాక్స్ లైట్, మొట్టమొదటి టైపు రైటర్ మెషిన్, రాజులు, జమీందార్ల వడ్డాణం భద్రపరిచే పెట్టె, విసనకర్రలు, అలంకరణ వస్తువులు, దేవుడి గుడి లో వెలిగించే దీపాలకుండీలు, అబ్బో ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఏడు వందల కి పైగానే వస్తువులు ఉన్నాయి. ప్రతి ఒక్కటి తీరికగా చూసి తరించాలి. నన్ను అడిగితే ఇలాంటి వాటిని నిర్వహించడం చాలా అంటే చాలా కష్టం కృష్ణమూర్తి గారు అలాంటి వాటిని సేకరించి మ్యూజియం లా ఏర్పాటు చేయడం గొప్ప విషయము. దీనికి ఎంతో కృషి మరింత అంకితభావం కావాలి.
వై కృష్ణమూర్తి ప్రయాణాలు అతని అంతులేని బకెట్ జాబితాకు కొత్త ఖాతాలను జోడించాయి. పురాతన వస్తువులను సేకరించడంలో అతని ఆసక్తి ఇంట్లో వాటి కోసం అతనికి ఉన్న స్థలం వలె పెరిగింది.
డిజిటల్ యుగం కృష్ణమూర్తి ఇంటర్నెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి సహాయపడింది. పురాతన వస్తువుల పట్ల తనకున్న ప్రేమ గురించి మాట్లాడటం ప్రారంభించాలని అతని సహచరులు ఒప్పించి, అతను YK యాంటిక్స్ పేరుతో WordPressలో బ్లాగులు మరియు కథనాలను రాయడం ప్రారంభించాడు. చేతిలో సాధారణ కెమెరా మరియు పదాలుగా సంవత్సరాల అనుభవాన్ని కలిగి, అతను తన మొదటి కథనాన్ని ప్రచురించాడు, అది ప్రతిదీ మార్చివేసింది. YK పురాతన వస్తువులపై యువ మనస్సులతో డిజిటల్ ప్రయాణం బ్లాగుల నుండి కథనాలకు ఆన్‌లైన్ అనుచరులకు పెరిగింది. ఫేస్‌బుక్ పోస్ట్‌లు, ఇన్‌స్టాగ్రామ్ షేర్‌లు మరియు YouTube ఛానెల్‌లతో డైనమిక్ బృందం డిజిటల్ మీడియాను స్వాధీనం చేసుకుంది, వారి స్వచ్ఛంద సహకారం కొత్త కోణాలను జోడించింది. హౌస్ నెం.16/3, లోతుకుంట అనేది కాలక్రమేణా మీడియా దృష్టిని ఆకర్షించిన మ్యూజియం కంటే తక్కువ కాదు. వార్తాపత్రికలు, టీవీ ఛానెల్‌లు మరియు ఇతర మీడియా మార్గాలు YK యాంటిక్స్ గురించి కథనాలను సందర్శించడం మరియు ప్రచురించడం ప్రారంభించాయి,,,
మాది సరిహద్దులు లేని మ్యూజియం, గత కాలపు కథలను మన భవిష్యత్ తరాలకు చెప్పడానికి కట్టుబడి ఉన్నాము. ఈ కథలను సంరక్షించాలనే తీవ్రమైన ఉత్సుకత మా దృష్టిని నడిపిస్తుంది. పురాతన వస్తువులు మన సంస్కృతికి మరియు మన సంప్రదాయం యొక్క పత్రాలకు నమ్మకమైన సాక్షులు అని మేము గట్టిగా నమ్ముతాము. దీనికి సంబంధించి ప్రతీ చిన్న విషయాన్నీ వారి మాటల్లో తెలుసుకున్నాము.
చివరికి మ్యూజియం సందర్శించి బయటకు ఒక మంచి అనుభూతి తో వచ్చాము. వెళ్లేప్పుడు ఫీడ్ బ్యాక్ రాసి కొంత అమౌంట్ డొనేషన్ గా ఇచ్చాము. ఇలాంటివి వాటిని కాపాడుకోవడం మన ధర్మం.కర్తవ్యం కూడా ..
ఈ సారి మీరు కానీ సికింద్రాబాద్ లోతుకుంట వైపు గా వెళ్తే ఒక సారి ఈ YK Antiques ని దర్శించండి ...

