
రష్యాలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.0గా నమోదు
బద్దలయిన అగ్నిపర్వతం..
రష్యా(Russia)లో భూకంపం(Earthquake) సంభవించింది. కురిల్ దీవులలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.0గా నమోదైంది. అప్రమత్తమయిన రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ పలు ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటివరకు ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం తెలియలేదు. భూకంపం ధాటికి పలు నగరాల్లోని భవనాలు ఊగిపోయాయని రష్యా మీడియా పేర్కొంది.
బద్దలైన అగ్నిపర్వతం..
రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలోని క్రాషెన్నినికోవ్ అగ్నిపర్వతం శనివారం అర్ధరాత్రి బద్దలైనట్లు (Volcano Eruption) స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. ఇటీవల సంభవించిన భారీ భూకంపం వల్ల దాదాపు 600 ఏళ్ల తర్వాత మొదటిసారి ఈ అగ్నిపర్వతం బద్దలైనట్లు రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో 6 వేల మీటర్ల ఎత్తుకు బూడిద ఎగసిపడినట్లు వెల్లడించింది. మరో ఘటనలో కమ్చట్కా ద్వీపకల్పంలోని అత్యంత చురుకైన అగ్నిపర్వతం క్ల్యూచెస్కీ బద్దలైంది.