
భారత్‌లో పర్యటించనున్న పుతిన్
వాణిజ్య సంబంధాలపై న్యూఢిల్లీ, వాషింగ్టన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ప్రాధాన్యతను సంతరించుకున్న రష్యా అధ్యక్షుడి పర్యటన..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారతదేశంలో పర్యటిస్తారని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ పేర్కొన్నారు. ప్రస్తుతం మాస్కోలో ఉన్న ఆయన పర్యటన పూర్తి వివరాలను వెల్లడించలేదు.
ట్రంప్ టారిఫే కారణమా?
రష్యాతో భారతదేశ వాణిజ్య సంబంధాలపై న్యూఢిల్లీ, వాషింగ్టన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పుటిన్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. రష్యా నుంచి ఇంధనాన్ని కొనడం ద్వారా ఉక్రెయిన్‌పై యుద్ధానికి భారతదేశం సహాయం చేస్తోందని, ఫలితంగా భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు పక్కదారి పడుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండడంతో భారత్ దిగుమతులపై అమెరికా అదనంగా 25 శాతం సుంకాన్ని విధిస్తోంది. భారతపై అదనపు సుంకాలను అమెరికా 50 శాతానికి పెంచింది.
Next Story