
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
‘‘‘న్యూయార్క్ టైమ్స్’ పై 15 బిలియన్ డాలర్ల దావా’’
సొంత సోషల్ మీడియాలో ట్రంప్ ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘న్యూయార్క్ టైమ్స్’ పై దావా వేస్తున్నట్లు ప్రకటించారు. తనను చెడు వ్యక్తి చిత్రీకరిస్తూ సంపాదకీయాలు ప్రచురించినందుకు, అలాగే లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్ప్టీన్ తో సంబంధాలు ఉన్నట్లు రాసిన వార్తలపై ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు.
రాడికల్ లెప్ట్ డెమోక్రాట్ పార్టీకి వర్చువల్ మౌత్ పీస్ గా న్యూయార్క్ టైమ్స్ వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలంగా అబద్దాలను వండి వారుస్తోందని దుయ్యబట్టారు.
ట్రంప్ దావా..
తన సొంత సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం అయిన ట్రూత్ సోషల్ లో ఆయన ఈ విషయాన్ని ధృవీకరించారు. ‘‘మీకు ఇష్టమైన అధ్యక్షుడు, నా కుటుంబం, వ్యాపారం, మాగా, మన దేశం గురించి అనేక దశాబ్ధాలుగా అబద్దాలు చెప్పే పద్దతిలో వారు నిమగ్నమైమయ్యారు’’ అని విమర్శించారు. ఫ్లోరిడాలో దావా వేస్తున్నట్లు ప్రకటించారు.
‘‘ఈ రోజు మన దేశ చరిత్రలో అత్యంత చెత్త, దిగజారుడు వార్తా పత్రికలలో ఒకటైన ది న్యూయార్క్ టైమ్స్ పై 15 బిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేసిన గొప్ప గౌరవం నాకు లభించింది. ఇది రాడికల్ లెప్ట్ డెమోక్రాటిక్ పార్టీకి వర్చువల్ మౌత్ పీస్ గా మారింది’’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అధ్యక్ష రేసులో తన డెమొక్రాటిక్ ప్రత్యర్థి కమలా హ్యారిస్ కు ఏకపక్షంగా మద్దతు ఇచ్చినట్లు ఆయన వాదించారు.
దీర్ఘకాలిక అబద్ధాలు..
ప్రచురణ సంస్థ తన గురించి, తన కుటుంబం గురించి తన వ్యాపారాల గురించి, అమెరికా ఫస్ట్, మాగా వంటి ఉద్యమాల గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తోందని ఆయన ఆరోపణలు గుప్పించారు.
ఆ వార్తా పత్రిక చాలాకాలంగా స్వేచ్ఛగా అబద్ధాలు చెప్పడానికి, నా పరువు తీయడానికి ప్రయత్నిస్తోందని ట్రంప్ అన్నారు. ఆమోదయోగ్యం కానీ, చట్టవిరుద్దమైన దీర్ఘకాలిక ఉద్దేశ్యం, దుర్వినియోగ పర్యవసానాలు ఈ దావాతో ముగుస్తుందని ఆయన ప్రతిజ్ఞ చేశారు.
‘‘న్యూ యార్క్ టైమ్స్ దీర్ఘకాలిక ఉద్దేశం, దుర్వినియోగ పద్దతులను నామీద అనుసరించారు. ఇది ఆమోదయోగ్యం కాదు. చట్ట విరుద్దం కూడా. ఈ పత్రిక చాలా కాలంగా స్వేచ్చగా అబద్దాలు చెప్పడానికి, నిందించడానికి, నన్ను అపఖ్యాతి పాలు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇది ఇప్పుడు ఆగిపోతుంది. గ్రేట్ స్టేట్ ఆఫ్ ఫ్లోరిడాలో ఈ దావా వేస్తున్నాను. ఈ విషయంపై మీ శ్రద్ధకు ధన్యవాదాలు. అమెరికాను మళ్లీ గొప్పగా చేయండి’’ అని ఆయన అన్నారు.
లిబరల్ పేరిట వన్ సైడ్ జర్నలిజం..
న్యూయార్క్ టైమ్స్ తో పాటు ఏబీసీ న్యూస్, సీబీఎస్ వంటి ఇతర లిబరల్ ప్రచురణ సంస్థలను కూడా ట్రంప్ లక్ష్యంగా చేసుకున్నారు. ఒక క్రమ పద్దతిల తనపై విమర్శలు చేస్తూ, అబద్దాలతో అపఖ్యాతి పాలు చేస్తున్నాయని విమర్శించారు.
‘‘జార్జ్ స్లోపాడోపౌలోస్, ఏబీసీ, డీస్నీ, 60 మినిట్, సీబీఎస్, పారామౌంట్ వంటి నకిలీ వార్తా నెట్ వర్క్ లపై మేము విజయవంతంగా వ్యాజ్యాలు దాఖలు చేస్తున్నాము. వారు నా పై తప్పుగా చూపిస్తున్నారు. ఇది హానికరమైన పరువు నష్టం. అందువలన రికార్డు మొత్తాలకు పరిష్కరించబడుతుంది’’ అని ట్రంప్ అన్నారు.
వాల్ స్ట్రీట్ జర్నల్ పై ట్రంప్ ఇప్పటికే దావా వేశారు. ఈ కుంభకోణం అంతర్జాతీయ ప్రతిధ్వనించింది. ఎప్స్టీన్ తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై యూకే వాషింగ్టన్ కు తన రాయబారిని ఉపసంహరించుకుంది.
మీడియాతో ట్రంప్ వివాదాలు..
యూఎస్ లోని ప్రధాన మీడియా సంస్థలపై ట్రంప్ గతంలోనూ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. న్యూయార్క్ టైమ్స్ పై ట్రంప్ ఘర్షణకు దిగారు. ఏబీసీ న్యూస్, సీబీఎస్ రెండు కూడా ఆయనతో కోర్టు బయట సెటిల్ చేసుకున్నాయి. ఒక సందర్భంలో ఈ. జీన్ కారోల్ సివిల్ కేసులో పదాలను తప్పుగా వాడినందుకు ట్రంప్ లైబ్రరీకి ఏబీసీ 15 మిలియన్ డాలర్లకు విరాళంగా అందించడం ద్వారా వివాదాన్ని పరిష్కరించుకుంది.
అదే విధంగా సీబీఎస్ మాత సంస్థ అయిన పారామౌంట్ 2024 లో కమలా హ్యారిస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంపాదకీయా నిర్ణయాలపై దావాను పరిష్కరించడానికి 16 మిలియన్ డాలర్లను చెల్లించడానికి అంగీకరించింది. ఇది కూడా ట్రంప్ లైబ్రరీకి ఈ మొత్తాన్ని చెల్లించింది.
Next Story