‘ఏఐ’ తో 40 శాతం ఉద్యోగాలకు ఎసరు: ఐఎంఎఫ్ చీఫ్
x

‘ఏఐ’ తో 40 శాతం ఉద్యోగాలకు ఎసరు: ఐఎంఎఫ్ చీఫ్

ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్ తో భవిష్యత్ లో టెక్ దిగ్గజాల నుంచి భారీగా ఉద్యోగాల కోతలు ఉంటాయని ఐఎంఎఫ్ చీఫ్ అంచనావేశారు.


భవిష్యత్ లో ఆదాయ అసమానతలు ఇప్పుడున్న స్థాయి కంటే ఇంకా పెరిగిపోతాయని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టినా జార్జీవా ఆందోళన వ్యక్తం చేశారు. గూగుల్ లో వందలాది మంది ఉద్యోగులను తొలగించిన నాలుగు రోజుల తరువాత క్రిస్టినా స్పందించారు. ఇది ప్రపంచ కార్మిక వ్యవస్థను మరింత ప్రభావితం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఎక్కువ ఉత్పాదకత కోసం ‘ఏఐ’ సాంకేతికతపై ఆధారపడటమే ఇందుకు కారణంగా వివరించారు.

అంతర్జాతీయ ద్రవ్యనిధి చీఫ్ అయిన క్రిస్టినా మీడియాతో మాట్లాడారు. " ఏఐ ఇప్పుడున్న అసమానతలను పూర్తి గా పెంచుతుంది. దీనిద్వారా సామాజిక ఉద్రికత్తలు మరింత తీవ్రతరం కాకుండా విధాన నిర్ణేతలు తగిన పరిష్కార మార్గాలు కనుగొనాలి " అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

" ఆధునాతన ఆర్థిక వ్యవస్థలు ఇంకా ఎక్కువ ప్రమాదం ఎదుర్కొనే అవకాశం ఉంది. దాదాపు 60 శాతం ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉంది " అని చెప్పారు. "అభివృద్ధి చెందుతున్న దేశాలలో మాత్రం ఏఐ తక్కువ ప్రభావాన్ని చూపుతుందని, దాదాపు 40 శాతం ఉద్యోగాలు కోల్పోవలసి ఉంటుంది " అని ఐఎంఎఫ్ నివేదికను ఉటంకిస్తూ చెప్పారు.

ఉద్యోగాలపై ప్రభావం

ఐఎంఎఫ్ నివేదిక ప్రకారం, అభివృద్ధి చెందిన దేశాలలోని ఆర్థిక వ్యవస్థలలో ఏఐ ద్వారా దాదాపు 60 శాతం ఉద్యోగాలు కోల్పోవాల్సి ఉంటుంది. కానీ అందులో సగం మంది కార్మికులు ఏఐ ఇంటిగ్రేషన్ నుంచి ప్రయోజనం పొందవచ్చు. ఇదీ వారి ఉత్పాదకతను పెంచే అవకాశం ఉంది.

మిగిలిన సగం ఏఐ అప్లికేషన్లు ప్రస్తుతం మానవులు నిర్వహిస్తున్న కీలకమైన పనులను పూర్తి చేస్తుంది. ఇది కార్మిక డిమాండ్ ను తగ్గిస్తుంది. క్రమంగా కార్మికులను తక్కువ వేతనాలకు పని చేయించడానికి సిద్దం చేయిస్తుందని వార్తా సంస్థలు క్రిస్టినా మాటలను ఉటకిస్తూ ప్రచురించాయి. అయితే ఏఐ వల్ల ఉత్పాదకత స్థాయి కూడా పెరుగుతుంది. ఆదాయ స్థాయి కూడా పెరిగే అవకాశం ఉంది. ఐఎంఎఫ్ నివేదిక ప్రకారం టెక్నాలజీపై ఆధారపడిన ఉద్యోగాలు ఏఐ అత్యధికంగా ప్రభావితం చూపిస్తుంది.

క్రిస్టినా ప్రకారం " చారిత్రాత్మకంగా ఆటోమేషన్, ఇన్పర్మేషన్ టెక్నాలజీ రోటీన్ టాస్క్ లను ఏఐ ప్రభావితం చేస్తాయి. అధిక సామర్థ్యం, నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను ఏఐ ప్రభావితం చేస్తుంది. ప్రపంచంలోని అభివృద్ది చెందుతున్న దేశాలలోని ఆర్థిక వ్యవస్థలు ఎక్కువ నష్టాలు ఎదుర్కొంటాయి. కానీ దాని ప్రయోజనాలను పొందెందుకు మరిన్ని అవకాశాలు కూడా ఉన్నాయి " అని అన్నారు. ఏఐ ప్రయోజనాలు, నష్టాలు రెండింటిని పేర్కొన్నారు.

తీవ్ర అసమానతలు

ఏఐ దేశాల మధ్య సైతం తీవ్ర అసమానతలు తీసుకొస్తాయని ఐఎంఎఫ్ నివేదిక అంచనావేసింది. ఆధునిక ఆర్థిక వ్యవస్థలు ఏఐ ఏకీకరణ ప్రయోజనాల ద్వారా లోపాలను భర్తీ చేస్తుందని అన్నారు. అనేక అభివృద్ధి చెందిన దేశాలు చేస్తున్నంత వేగంగా వర్ధమాన దేశాలు చేయలేవని, వాటి దగ్గర నైపుణ్యం కలిగిన శ్రామికులు లేకపోవడమే అందుకు కారణంగా వివరించారు. ఇదీ దేశాల మధ్య అసమానతలను ఎక్కువ చేస్తుంది అన్నారు.

"అభివృద్ది చెందుతున్న దేశాలు ఏఐ వల్ల తక్షణ అంతరాయాలు ఎదుర్కొంటాయని ఈ పరిశోధనలు సూచిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు- తక్కువ ఆదాయ దేశాలలో దీనికి విరుద్దంగా ఏఐ ప్రభావం వరుసగా 40 శాతం, 26 శాతంగా అంచనా వేయబడింది. త్వరగా ఈ సాంకేతికత దేశాల మధ్య అసమానతలను మరింత దిగజార్చే ప్రమాదాన్ని పెంచుతుంది " అని ఐఎంఎఫ్ చీఫ్ చెప్పారు. ఏఐ ని ఉపయోగించుకునే ఉద్యోగులు అధిక వేతనాన్ని పొందుతారు. అదీ సాధించలేని ఉద్యోగులు ఆర్థికంగా దివాలా అంచున నిలబడతారు అని నివేదిక వివరించింది.

ఏఐ సన్నద్దత సూచిక

ఐఎంఎఫ్ వివిధ ఆర్థిక వ్యవస్థలు, ఉద్యోగాలపై అది చూపే ప్రభావాన్ని అంచనా వేస్తూ సన్నద్దత సూచికను కూడా విడుదల చేసింది. ఓవైపు సురక్షితమైన, బాధ్యతాయుతమైన ఏఐ వాతావరణాన్ని పెంపొందించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను నొక్కి చెప్పింది. ప్రజల విశ్వాసాన్నిపెంపొందించడానికి బలమైన ఫ్రేమ్ వర్క్ లు అభివృద్ధి చేస్తూనే అభివృద్ధి చెందిన ఆవిష్కరణ ఆర్థిక వ్యవస్థలు ఏఐ ఆవిష్కరణ, ఏకీకరణకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను నొక్కి చెబుతుంది. డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లో పెట్టుబడుల కోసం బలమైన వర్క్ ఫోర్స్ ను తయారుచేయడానికి అన్ని ఆర్థిక వ్యవస్థలకు ఐఎంఎఫ్ పిలుపునిచ్చింది.

Read More
Next Story