‘కనిపిస్తే కాల్చివేత’ .. మేము టచ్ లోనే ఉన్నామన్న జైశంకర్
x

‘కనిపిస్తే కాల్చివేత’ .. మేము టచ్ లోనే ఉన్నామన్న జైశంకర్

బంగ్లాదేశ్ లో జరుగుతున్న రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం తీవ్ర హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వం కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేసింది. భారత విదేశాంగ శాఖ..


రిజర్వేషన్ కోటా సంస్కరణపై బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఉద్యమం తీవ్ర హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వం కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వూలు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా విద్యార్థుల ముసుగులో అసాంఘిక శక్తులు ఎక్కడికక్కడ లూటీలు, దోపిడీలు చేయడం, ప్రైవేట్ ఆస్థికి నష్టం కలిగించడంతో వెంటనే ప్రభుత్వం కాల్చివేత ఆదేశాలు జారీ చేసింది.

సివిల్ సర్వీస్ ఉద్యోగ కోటాలను రద్దు చేయాలా వద్దా అనే అంశంపై బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఆదివారం (జూలై 21) నిర్ణయం తీసుకోనుంది. గత నెలలో, హైకోర్టు కోటా విధానాన్ని పునరుద్ధరించింది, 1971 స్వాతంత్ర్య సమరయోధులు, వారి కుటుంబ సభ్యులకు 30 శాతం ప్రభుత్వ ఉద్యోగాలను రిజర్వ్ చేసింది.
నిరసనలు ఎందుకు..
రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఒక్కసారిగా రోడ్లకెక్కారు. అవామీ లీగ్ పార్టీ స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించిన హసీనా మద్దతుదారులకు ఈ వ్యవస్థ వివక్ష, ప్రయోజనాలను కలిగిస్తుందని, దాని స్థానంలో మెరిట్ ఆధారిత వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.
అయితే ప్రధానమంత్రి షేక్ హసీనా కోటా వ్యవస్థను సమర్థించారు, అనుభవజ్ఞులు వారి రాజకీయ అనుబంధంతో సంబంధం లేకుండా యుద్ధానికి చేసిన కృషికి అత్యున్నత గౌరవం పొందుతారని సమర్థించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇది వ్యాపించింది. నిరసనల కారణంగా చెలరేగిన హింసాకాండలో ఇప్పటివరకు 133 మంది చనిపోయారు.
షేక్ హసీనా ప్రభుత్వం కర్ఫ్యూ విధించగా, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు నిరవధికంగా మూసివేశారు. ఆ దేశంలో చదువుకుంటున్న అనేక మంది భారత విద్యార్థులు తిరిగి ఇంటిముఖం పట్టారు. దాదాపు 953 మంది విద్యార్థులు ఇప్పటి వరకూ మేఘాలయ మీదుగా భారత్ లోకి ప్రవేశించారు.
శనివారం, మేఘాలయలోని పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లాలోని దాకీ ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టు ద్వారా బంగ్లాదేశ్ నుంచి మరో 284 మంది భారత్ లోకి ప్రవేశించారు. వీరిలో 168 మంది నేపాల్‌కు చెందిన వారు కాగా, 115 మంది భారత్‌కు చెందిన వారు కాగా వీరిలో ఎనిమిది మంది మేఘాలయ విద్యార్థులు, ఒకరు కెనడాకు చెందిన వారు ఉన్నారు. బంగ్లాదేశ్ లో హింసాత్మక ఘటనల కారణంగా ఇబ్బంది ఎదుర్కొంటున్న వారి కోసం మేఘాలయ ప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్ ను ఏర్పాటు చేసింది.
భారతీయుల భద్రతను కాపాడతాం: విదేశాంగ శాఖ
దాదాపు 1,000 మంది భారతీయ విద్యార్థులు బంగ్లాదేశ్ నుంచి వివిధ ల్యాండ్ ట్రాన్సిట్ పాయింట్ల ద్వారా లేదా విమానంలో భారత్ కు తిరిగి వచ్చినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) శనివారం తెలిపింది. బంగ్లాదేశ్‌లోని భారతీయుల భద్రత, శ్రేయస్సును నిర్ధారించడంపై MEA పూర్తిగా దృష్టి సారించిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు.
బంగ్లాదేశ్‌లోని భారతీయ మిషన్లు భారతీయ పౌరులు, విద్యార్థుల భద్రత కోసం సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నామని MEA తెలిపింది. "ఇప్పటి వరకు, 778 మంది భారతీయ విద్యార్థులు వివిధ ల్యాండ్ పోర్ట్‌ల ద్వారా భారతదేశానికి తిరిగి వచ్చారు. అదనంగా, దాదాపు 200 మంది విద్యార్థులు ఢాకా, చిట్టగాంగ్ లోని సాధారణ విమాన సేవల ద్వారా స్వదేశానికి తిరిగి వచ్చారు" అని విదేశాంగ శాఖ తెలిపింది.
తమిళనాడు హెల్ప్‌లైన్
బంగ్లాదేశ్‌లో చిక్కుకుపోయిన తమిళుల కోసం తమిళనాడు ప్రభుత్వం హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేసింది. బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న భారతీయులు తమ భద్రత కోసం ప్రజల రాకపోకలను నియంత్రించాలని భారత హైకమిషన్ ఆదేశించినట్లు పబ్లిక్ అండ్ రిహాబిలిటేషన్ డిపార్ట్‌మెంట్ శనివారం అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది.
ముఖ్యమంత్రి MK స్టాలిన్ జారీ చేసిన ఆదేశాల ఆధారంగా, బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న తమిళుల వివరాలను సేకరించేందుకు, ప్రవాస తమిళుల పునరావాసం, సంక్షేమ కమిషనరేట్, భారత హైకమిషన్, తమిళ సంస్థలను సంప్రదించింది. బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న తమిళుల కుటుంబాలు +911800303793, +918069009900, +918069009901 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని కోరింది.
అక్కడికి వెళ్లద్దు: అమెరికా..
దక్షిణాసియా దేశంలో కొనసాగుతున్న పౌర అశాంతి దృష్ట్యా బంగ్లాదేశ్‌కు వెళ్లవద్దని యునైటెడ్ స్టేట్స్ తన పౌరులను కోరింది. అత్యవసర ప్రభుత్వ ఉద్యోగులు, కుటుంబ సభ్యుల స్వచ్ఛంద నిష్క్రమణను అనుమతించింది. బంగ్లాదేశ్ కోసం US కొత్త ప్రయాణ సలహాను జారీ చేసిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. కలహాలతో దెబ్బతిన్న దేశానికి తమ ప్రయాణాన్ని పునఃపరిశీలించమని అమెరికన్లను కోరింది.
US డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ బంగ్లాదేశ్ కోసం ప్రయాణ సలహా స్థాయిని 4వ స్థాయికి పెంచింది , అంటు దీనర్ధం 'ప్రయాణం చేయవద్దు' అని. "బంగ్లాదేశ్ ప్రభుత్వం బంగ్లాదేశ్ అంతటా కర్ఫ్యూ ప్రకటించింది, ప్రతి ఒక్కరినీ ఇంట్లోనే ఉండమని ఆదేశించింది. పోలీసులను బలోపేతం చేయడానికి బంగ్లాదేశ్ సైన్యం దేశవ్యాప్తంగా మోహరించింది. ఢాకాలో, దేశవ్యాప్తంగా టెలికమ్యూనికేషన్‌లకు అంతరాయం ఏర్పడింది. భద్రతా పరిస్థితుల కారణంగా, అక్కడ సాధారణ కాన్సులర్ సేవలను అందించడంలో ఆలస్యం కావచ్చు" అని యూఎస్ పేర్కొంది.
Read More
Next Story