కన్జర్వేటివ్ లను స్మార్ట్ గా ఓడించిన స్టార్మర్
x

కన్జర్వేటివ్ లను స్మార్ట్ గా ఓడించిన స్టార్మర్

యూకే లో 14 ఏళ్లుగా అధికారం చెలాయించిన రైట్ వింగ్ కన్జర్వేటివ్ పార్టీ తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైంది. కైర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర పార్టీ..


గ్రేట్ బ్రిటన్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. 14 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ ను ఓడించి కెయిర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ 33 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చింది. బ్రిటన్ దిగువ సభలో 650 సీట్లు ఉండగా, ఆ పార్టీకి 412 సీట్లు వచ్చాయి. అంటే మొత్తం సీట్లలో 63 శాతం సీట్లను పార్టీనే కైవసం చేసుకుంది. ఒక సీటు ఫలితం ఇంకా ప్రకటించబడలేదు.

రిషీ సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీకి కేవలం 121 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇది ఆ పార్టీ రెండు దశాబ్దాల చరిత్రలో అత్యల్ఫ స్థానాలు కావడం గమనార్హం. 2019 తో పోల్చుకుంటే 365 స్థానాలను పార్టీ కొల్పోయింది. ఈ ఎన్నికల్లో కొన్ని చిన్న పార్టీలు సైతం తమ సత్తా చాటాయి. మధ్యేవాద లిబరల్ విధానాలను అమలు చేసే డెమొక్రాట్లు ఏకంగా 71 స్థానాలను కైవసం చేసుకుంది. గత ఎన్నికల కంటే ఇది 60 స్థానాలు అధికం.

ఎన్నికలకు ముందు స్కాట్లాండ్‌లోని 57 సీట్లలో ఎక్కువ భాగాన్ని స్కాటిష్ నేషనల్ పార్టీ ఆధీనంలో ఉండేది. అయితే ఇప్పుడు ఆ పార్టీ ఓటమి పాలైంది. అందులో చాలా వరకూ లేబర్ పార్టీ కైవసం చేసుకుంది. యూకే లోని ప్రతీసీటు కూడా అక్కడి భౌగోళిక ప్రాంతాన్ని సూచిస్తుంది.
14 ఏళ్ల పాటు..
14 ఏళ్ల తర్వాత తొలిసారిగా లేబర్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2010 నుంచి పార్లమెంట్‌ను సెంటర్-రైట్ వింగ్ కన్జర్వేటివ్‌లు నడిపిస్తున్నారు. వారు బ్రెగ్జిట్, చైనా మహమ్మారి, పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో పాటు అనేక సవాళ్లను వరుసగా ఎదుర్కొన్నారు. చాలా మంది ఓటర్లు బ్రిటన్ ఎదుర్కొంటున్న సమస్యలకు అధికార పార్టీ విధానాలే కారణమని నిందించారు. ముఖ్యంగా రైలు, ఆరోగ్య సేవల లోపాలు, బ్రిటన్ లోకి అక్రమంగా వస్తున్న పశ్చిమాసియా వలసలు ఈ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపాయని చెప్పవచ్చు. ఇదే సమయంలో కన్జర్వేటివ్ పార్టీ ఐదుగురు ప్రధానులను మార్చింది. ఇది కూడా ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపింది.
2010లో, లేబర్ పార్టీ 13 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న తర్వాత అధికారం కొల్పోయింది. ఇది దాని చరిత్రలో సుదీర్ఘకాలం పాలన. దాని చివరి పాలన ముగిసే సమయానికి, లేబర్ పార్టీ ప్రజాదరణ తగ్గింది. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా UKలో తీవ్ర మాంద్యం ఏర్పడింది.
మద్దతు తగ్గుతోంది
లేబర్, కన్జర్వేటివ్ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 60 శాతం ఓట్లను సాధించలేకపోయారు. ఇది కొత్త కనిష్ట స్థాయికి చేరింది. గత 100 సంవత్సరాలుగా, బ్రిటన్ రెండు ప్రధాన రాజకీయ పార్టీలు అత్యధిక ఓట్లను సంపాదించాయి. ఉదాహరణకు, 1951లో, కన్జర్వేటివ్‌లు, లేబర్‌లు దాదాపు 97 శాతం ఓట్లను సాధించారు. అయితే కొన్ని సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాలుగా ఓట్ల శాతం తగ్గుతూ వస్తోంది. హౌస్ ఆఫ్ కామన్స్ లైబ్రరీ ప్రకారం, రెండు ప్రధాన రాజకీయ పార్టీలు పార్లమెంట్‌లోని 650 సీట్లలో 600 కంటే ఎక్కువ స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకోగలిగాయి.
4,500 మంది అభ్యర్థులు
దాదాపు 100 వేర్వేరు రాజకీయ పార్టీల నుంచి సగటున ఏడుగురు అభ్యర్థులు ఒక్కో సీటుకు పోటీ పడ్డారని పార్లమెంట్ లైబ్రరీ పేర్కొంది. తొమ్మిది పార్టీలు 50 మంది అభ్యర్థులను నిలబెట్టాయి. ఈ ఏడాది పార్లమెంటు సీటు కోసం మొత్తం 4,515 మంది పోటీ చేశారని లైబ్రరీ పేర్కొంది. ఇది 2019 తో పోల్చుకుంటే వెయ్యి మందికి పైగా ఎక్కువ. సాపేక్షంగా తక్కువ ఓట్ల వాటా ఉన్నప్పటికీ, ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో భారీ మెజారిటీతో పరిపాలించగలరు.
Read More
Next Story