అజిత్ ధోబాల్ తో మాట్లాడిన అమెరికా జాతీయ భద్రతా సలహాదారు..ఎందుకంటే?
x

అజిత్ ధోబాల్ తో మాట్లాడిన అమెరికా జాతీయ భద్రతా సలహాదారు..ఎందుకంటే?

భారత జాతీయ భద్రతా సలహదారు అజిత్ దోభాల్ తో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులైవాన్ మాట్లాడారు. ప్రధాని మోదీ మాస్కో పర్యటన నేపథ్యంలో..


భారత్- రష్యా మధ్య సంబంధాలు స్థిరంగా కొనసాగుతున్న నేపథ్యం, అలాగే ప్రధాని మోదీ ఇటీవల రష్యా పర్యటనకు వెళ్లిన సందర్భంగా భారత్ - అమెరికా మధ్య అశాంతి నెలకొంది. దీనిపై భారత జాతీయ భద్రతా సలహదారు అజిత్ ధోబాల్ - యూఎస్ జాతీయ భద్రతా సలహదారు జేక్ సులైవాన్ తో ఫోన్ లో మాట్లాడారు.

ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ భద్రత, సవాళ్లను పరిష్కరించుకోవడానికి భారత్- అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడానికి సమిష్టిగా పని చేయవలసిన అవసరాన్ని దోవల్, సులైవన్ పనురుద్ఘాటించారని విదేశీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

"జాతీయ భద్రతా సలహాదారులు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ ఆందోళనలకు సంబంధించిన విస్తృత శ్రేణి సమస్యలను చర్చించారు. జూలై 2024లో ఆ తర్వాత సంవత్సరంలో జరగనున్న క్వాడ్ ఫ్రేమ్‌వర్క్ కింద రాబోయే ఉన్నత-స్థాయి విషయాలను కూడా చర్చించారు" అని MEA తెలిపింది.
భారత్ లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి రష్యాతో భారత్ సంబంధాలను విమర్శించిన ఒక రోజు తర్వాత NSAలు ఫోన్ లో చర్చించుకున్నారు. ఇంతకుముందు భారత్ లోని అమెరికా రాయబారీ ఎరిక్ గార్సెట్టీ మాట్లాడుతూ..భారత్, అమెరికాలు ప్రజాస్వామ్య సూత్రాలను గౌరవించాలని అన్నారు.
"నాకు తెలుసు, భారత్ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని ఇష్టపడుతుందని నేను గౌరవిస్తాను. కానీ సంఘర్షణ సమయంలో, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి అనేది ఉండదు. సంక్షోభ సమయాల్లో మనం ఒకరినొకరు అండగా నిలబడాలి. అయితే మేము విశ్వసనీయ స్నేహితులం” అని గార్సెట్టి ఈ వారం ప్రధాని మోదీ మాస్కో పర్యటన గురించి వ్యాఖ్యానించారు. “సరిహద్దులు ఎంత ముఖ్యమైనవో నేను భారతదేశానికి గుర్తు చేయనవసరం లేదు.. మనం ఆ సూత్రాలపై నిలబడి ఉండాలి. ఇవే ప్రపంచ శాంతికి మార్గనిర్దేశం చేయగలవని గార్సెట్టీ వ్యాఖ్యానించారు.
ఉక్రెయిన్ యుద్దం విషయంలో అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు భారత్ కలిసి రావట్లేదు. పైగా రష్యాతో ఎస్-400 రక్షణ వ్యవస్థ కొనుగోలులో, అలాగే మాస్కో నుంచి భారీగా చమురు కొనుగోలులో కూడా అమెరికా ఒత్తిడిని న్యూఢిల్లీ ఖాతరు చేయలేదు. పైగా డాలర్ ను పక్కన పెట్టి భారీ స్థాయిలో రూపాయిలతో వ్యాపారం నడిపింది. దీనివల్ల ఉక్రెయిన్ యుద్ధం విషయంలో అమెరికా కూటమి విధించిన ఆంక్షలు రష్యాను ఏమి చేయలేకపోయాయి. మరో వైపు యూరోపియన్ దేశాలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా, భారత్ పై ఒత్తిడిని పెంచే ప్రయత్నాలు తీవ్రతరం చేసింది.
Read More
Next Story