అవన్నీ ‘బేస్ లెస్ క్లెయిమ్స్’,చైనాకు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్
x

అవన్నీ ‘బేస్ లెస్ క్లెయిమ్స్’,చైనాకు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్

అరుణాచల్ ప్రదేశ్ పై చైనా చేస్తున్న వాదనలను భారత్ మరోసారి ఖండించింది. అవన్నీ నిరాధారమైనవని గట్టి కౌంటర్ ఇచ్చింది.


అరుణాచల్ ప్రదేశ్ నాదే అంటూ వితండవాదం చేస్తున్న చైనాకు భారత్ మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చింది. అవన్నీ బేస్ లేస్ వాదనలు అంటూ గడ్డిపెట్టింది. మీరు ఎన్నిసార్లు అరిచినా, నిజం మారదని హితవు పలికింది. అరుణాచల్ ప్రదేశ్ ఎల్లప్పుడూ భారత్ లో ఉంది, ఉంటుంది, ఈ విషయంలో న్యూఢిల్లీ వైఖరి మారదని విదేశాంగ శాఖ సమాధానం పంపింది. విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విలేకరుల సమావేశం నిర్వహించగా.. అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా తన వాదనను కొనసాగిస్తోందని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం చెప్పారు.

చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ సోమవారం మరోసారి మాట్లాడుతూ.. అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటూ వ్యాఖ్యానించింది. దీనికి ప్రతీగా విదేశాంగ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ " చైనా తన నిరాధార ఆరోపణలను ఎన్ని సార్లు అయినా పునరావృతం చేసుకోవచ్చు. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగంగా విడదీయరాని భాగమై ఉంది"అని ఆయన అన్నారు.’
‘ట్రూడో’ కొత్త విషయం చెప్పలేదు
అలాగే, కెనడియన్ గడ్డపై ఖలిస్థాన్ వేర్పాటువాద నాయకుడిని హత్య చేయడంపై మరోసారి భారత్ పై నిందలు వేసిన ట్రూడో పై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ "ప్రధాని ట్రూడో చెప్పింది కొత్తేదేమీ కాదు, అయితే దానికి సంబంధించిన ఆధారాలను ఇస్తే దర్యాప్తు చేయడానికి సిద్దంగా ఉన్నాం అయితే ఇప్పటి దాకా ఆరోపణలే తప్ప, ఆధారాలను ఇవ్వలేదు. అయితే భారత్ నుంచి పారిపోయి వచ్చిన తీవ్రవాదులకు కెనడాను అడ్డాగా చేసుకున్నారు. దీనిపై ఇదివరకే అట్టావాకు చెప్పాం" అని వివరించారు.
అలాగే ఖలీస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ కేసుకు సంబంధించి చైనా విదేశాంగ శాఖ చేసిన ప్రకటను కూడా రణధీర్ జైశ్వాల్ ఖండించారు. భారత్, అమెరికా రెండు ప్రజాస్వామ్యదేశాలు. మా మధ్య ఏమైన సమస్యలుంటే మేము పరిష్కరించుకుంటాం. దీనిలో మూడో పక్షం సలహాలు, సూచనలు అనవసరం అన్నారు. పన్నూన్ చంపడానికి అమెరికా, భారత్ పై మోపిన అభియోగాలను విచారించడానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని చెప్పారు. యుఎస్, కెనడా ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్న పన్నూన్‌ను హత్య చేయడానికి కుట్రపన్నిన కేసులో భారతీయ పౌరుడు అయినా నిఖిల్ గుప్తాపై ఫెడరల్ ప్రాసిక్యూటర్లు గత ఏడాది నవంబర్‌లో అభియోగాలు మోపారు.
ఐరాస తీర్మానం సానుకూలంగా..
ఇజ్రాయెల్- ఉగ్రవాద సంస్థ హమాస్ వివాదంపై ఐరాస తక్షణ కాల్పుల విరమణకు డిమాండ్ చేస్తూ మార్చి 25 భద్రతా మండలి ఆమోదించిన తీర్మానాన్ని సానుకూల అంశంగా చూస్తున్నట్లు ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. "మేము ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నాం, బందీల విడుదల, పౌరుల రక్షణ కోసం పిలుపునిచ్చాము పాలస్తీనాకు అవసరమైన మానవత సాయం కూడా అందించాం. ఇజ్రాయెల్- పాలస్తీనా రెండు దేశాలు ఏర్పాటు, సమస్య పరిష్కారం కోసం కూడా మా మద్దతు ఉంటుంది" జైస్వాల్ అన్నారు.
శ్రీలంక ప్రధాని బీజింగ్ పర్యటనపై ఒక ప్రశ్నకు, "మా ఆర్థిక మరియు భద్రతా ప్రయోజనాలపై ప్రభావం చూపే అన్ని పరిణామాలను మేము పర్యవేక్షిస్తాము మరియు తీసుకోవాల్సిన చర్యలను మేము తీసుకుంటాము.
Read More
Next Story