స్టార్ లింక్ కు పోటీగా అమెజాన్ శాటిలైట్ ఇంటర్నేట్ సేవలు?
x

స్టార్ లింక్ కు పోటీగా అమెజాన్ శాటిలైట్ ఇంటర్నేట్ సేవలు?

రెండు వేలకు పైగా శాటిలైట్లను ప్రయోగించాలని నిర్ణయం


స్పేస్ ఎక్స్ కు పోటీగా శాటిలైట్ సేవల్లోకి అమెజాన్ సైతం దిగింది. తన మొదటి బ్యాచ్ ఇంటర్నెట్ ఉపగ్రహాలను అట్లాస్ ఫైవ్ రాకెట్ ద్వారా కక్ష్యలోని ప్రవేశపెట్టింది. ఇందులో మొత్తం 27 కైపర్ ఉపగ్రహాలు ఉన్నాయి.

ఇప్పటికే వేలాది స్టార్ లింక్ శాటిలైట్లను స్పేస్ ఎక్స్ అధినేత అంతరిక్షంలోకి పంపారు. వీటి ద్వారానే ఆయన ఉక్రెయిన్ కు ఇంటర్నేట్ లో సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు ఈ మార్కెట్ లోకి పోటీగా అమెజాన్ సైతం దిగింది. వీటిని కక్ష్యలోకి విడుదల చేసిన తరువాత ఉపగ్రహాలు చివరికి దాదాపు 630 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంటాయి.

2023 లో అట్లాస్ ఫైవ్ ద్వారా రెండు పరీక్షా- ఉపగ్రహాలను ప్రయోగించారు. తాజా వెర్షన్ కు అనేక మార్పులు చేసి ప్రయోగించారు. వీటికి మిర్రర్ ఫిల్మ్ తో తాజా ఉపగ్రహాలకు పూత పూశారు. అయితే ఈ ఉప గ్రహాలు అత్యంత ప్రమాదకరమైనవని, ఇవి అంతరిక్ష పరిశీలనకు ఆటంకం కలిగిస్తాయని కొంతమంది వాదిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష బ్రాడ్ బ్యాండ్ సేవలను అందించడానికి బ్లూ ఆరిజన్ ను స్థాపించిన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్.. వీటి ద్వారా 3200 ఎంటే ఎక్కువ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.
స్పేస్ ఎక్స్ లో తరఫున 2019 నుంచి ఇప్పటి వరకూ దాదాపు 8 వేలకు పైగా శాటిలైట్లను ప్రయోగించింది. వీటిద్వారానే స్టార్ లింక్ సేవలను ప్రారంభించింది. ఆ కంపెనీ ఆదివారం రాత్రి తన 250 వ స్టార్ లింక్ ప్రయోగాన్ని జరుపుకుంది. ఇప్పుడు ఏడు వేల కంటే ఎక్కువ స్టార్ లింక్ లు ఇప్పటికీ భూమికి 550 కిలో మీటర్ల ఎత్తులో కక్ష్యలో ఉన్నాయి.
యూరోపిత ఆధారిత వన్ వెబ్ ఉపగ్రహ కూటమి వందల సంఖ్యలో ఇంకా ఎక్కువ సంఖ్యలో కక్ష్యలో ఉన్నాయి. అమెజాన్ ఇప్పటికే ప్రాజెక్ట్ కైపర్ కోసం యునైటెడ్ లాంచ్ అలయన్స్ నుంచి రాకెట్ ప్రయోగాలను చేయబోతోంది. మిషన్ ఎలా జరిగిన, ఇది మా ప్రయాణానికి ప్రారంభం మాత్రమే అని సాయంత్రం లిఫ్ట్ ఆప్ కు ముందు ప్రాజెక్ట్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ బద్యాల్ అన్నారు.
ఈ నెల ప్రారంభంలో జరిగిన మొదటి లిఫ్టాప్ ప్రయత్నం చెడు వాతావరణం కారణంగా విఫలమైంది. కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ లోని ప్రయోగ శ్రేణిలో మరొక స్థానాన్ని పొందేందుకు ఇప్పటివరకూ పట్టింది.
Read More
Next Story