ఇజ్రాయెల్ దాడితో.. రిస్క్ లో పడిన అమెరికా.. ఎందుకంటే..
x

ఇజ్రాయెల్ దాడితో.. రిస్క్ లో పడిన అమెరికా.. ఎందుకంటే..

గత ఆరు నెలలుగా ఇజ్రాయెల్, ఉగ్రవాద సంస్థ హమాస్ మధ్య గాజా కేంద్రంగా యుద్దం జరుగుతోంది. తాజాాగా సిరియాలో ఉన్న అధికారులపై వైమానికి దాడితో ఇది విస్తరించే ప్రమాదం..


సిరియాలోని ఇరాన్ కాన్సులేట్ భవనాన్ని ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ధ్వంసం చేసిన తరువాత వాషింగ్టన్, టెహ్రాన్ కు ఓ సందేశం పంపింది. మాకు ఈ దాడితో సంబంధం లేదు అని. ఎందుకంటే పశ్చిమాసియాలో అమెరికా బలాగాలను ఇరాన్ ప్రాక్సీలు అటాక్ చేసే అవకాశం ఉండే అవకాశం ఉంది. దీనిని నివారించడానికి ఈ చర్యకు వైట్ హౌజ్ పూనుకుంది.

అయితే దీనిని ఇరాన్ నమ్మకపోవచ్చని అమెరికా టాప్ కమాండర్ ఒకరు అభిప్రాయపడ్డారు. అక్టోబర్ 7 న జరిగిన దాడి తరువాత ఇజ్రాయెల్ మొదట హమాస్ పై యుద్దం ప్రకటించింది. తరువాత మెల్లగా తన మిగిలిన శత్రు దేశాలపై దాడులు మొదలు పెట్టింది. లెబనాన్ లోని హిజ్బుల్లా పై దాడులు ప్రారంభించి మెల్లగా సిరియా కు విస్తరించారు. దీంట్లోకి అమెరికాను లాగేలాగే ప్రణాళిక వేస్తున్నాడు టెల్ అవీవ్ అధినేత.

ఇరాన్ హెచ్చరిక
మొత్తం పశ్చిమాసియాను సమస్యల వలయంలోకి నెట్టేసేలా ఇజ్రాయెల్ పావులు కదుపుతోందా అనే అనుమానాలు ప్రస్తుతం అంతర్జాతీయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. హామాస్ కు వ్యతిరేకంగా ఆరు నెలలుగా చేస్తున్న పోరాటం, ఇప్పుడు దౌత్యకార్యాలయాలపైకి దాడికి దిగడం, ఇందులో ఇద్దరు ఇరానియన్ జనరల్స్ సహ 12 మంది మరణించడం ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది. ఇజ్రాయెల్ దాడిపై ఇరాన్ మండిపడింది. యూదులను అరబ్ గడ్డపై లేకుండా చేస్తామనే ప్రతిజ్ఞను మరోసారి గుర్తు చేసింది.
" గాజాలో యుద్ధభూమిలో ఇజ్రాయెల్ విఫలమవుతూనే ఉంటుందని, దాని ఓటములు పతనానికి చేరువవుతాయి" సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు.
"సిరియాలో వారు చేసిన చర్య వంటివి వారిని ఓటమి నుంచి రక్షించలేవు. దీనికి తగిన ప్రతీకారం ఉంటుంది" అని ఖమేనీ బుధవారం అధికారులతో జరిగిన సమావేశంలో హెచ్చరించినట్లు అధికారిక IRNA వార్తా సంస్థ ఉటంకించింది.
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ బుధవారం దాడికి "సమాధానం లేకుండా ఉండదని" అన్నారు. డమాస్కస్‌లో జరిగిన ఘోరమైన దాడి ఇరాక్, సిరియాలో ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు అమెరికన్ దళాలపై దాడులకు ప్రేరేపిస్తుందనే వైట్ హౌజ్ ఆందోళన వ్యక్తం చేస్తుందని లెఫ్టినెంట్ జనరల్ అలెక్సస్ గ్రిన్‌కేవిచ్ అభిప్రాయపడుతున్నారు. ఈయన మిడిల్ ఈస్ట్‌కు US వైమానిక దళం యొక్క టాప్ కమాండర్ గా ఉన్నారు.
ఒంటరి అవుతున్న ఇజ్రాయెల్
ఇరాన్ దాని మిత్రదేశాలు - లెబనీస్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా, సిరియా, ఇరాక్, యెమెన్‌లోని ఇతర సాయుధ సమూహాలతో సహా - గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పదే పదే కాల్పులకు దిగుతూ చికాకు పరుస్తున్నాయి. తాజాగా గాజాకి సముద్ర మార్గం ద్వారా ఆహారం అందజేస్తున్న ఓ ఎన్జీఓ పై ఐడీఎఫ్ దాడులకు దిగింది. ఇందులో ఆరుగురు మృతి చెందారు. దాంతో ఆ సంస్థ ఆహారం అందించలేమని చేతులెత్తేసింది. ఈ పరిణామం ఇజ్రాయెల్ ను ఇబ్బందికి గురి చేసింది. ప్రపంచ దేశాలన్నీ టెల్ అవీవ్ కు క్లాస్ తీసుకున్నాయి. ఉత్తర గాజాలోని జనాభాలో ఎక్కువ మంది ఆకలితో అలమటిస్తున్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.
ఇప్పటికే గాజాలోని హమాస్ ఉగ్రవాదులను దాదాపు తుద ముట్టించిన ఐడీఎఫ్, చివరగా రఫా పై కూడా దాడి చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇదే జరిగితే ఇక హమాస్ పని అయిపోయినట్లే. దీనిని ఆపడానికి ఇజ్రాయెల్ ను రెచ్చగొట్టడానికి కొన్ని ప్రాక్సీ శక్తులు ఓ పథకం పన్నాయని, అందులో ఇజ్రాయెల్ చిక్కుకుందని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. ఈ పరిణామానికి ఇప్పుడు ఇరానియన్ జనరల్లపై దాడి కలిసొచ్చింది. దీనికి తోడు ఇజ్రాయెల్ బందీల విడుదల విషయంలో ఇంకా కష్టపడుతోంది. మరో 100 మంది దాకా బందీలు హమాస్ చేతుల్లో ఉన్నారు. వారిని తన పావులుగా వాడుకుంటోంది. ఈ వారం, బందీల కుటుంబాలు నెతన్యాహు రాజీనామా చేసి, కొత్తగా ఎన్నికలు జరపాలని కోరుతూ విస్తృత నిరసన నిర్వహించాయి. నెతన్యాహు నివాసం దగ్గర ఈ వారం జరిగిన నిరసనలు ప్రదర్శనకారులు పోలీసుల మధ్య ఘర్షణలతో హింసాత్మకంగా మారాయి.
దాడికి ఇజ్రాయెల్ బాధ్యత: US
సోమవారం నాటి వైమానిక దాడి గురించి తమకు ముందస్తు సమాచారం లేదని బిడెన్ పరిపాలన ప్రకటించింది. US, ఇజ్రాయెల్ అనివార్య మిత్రదేశం. ఆయుధాల నిరంతర సరఫరాదారుగా ముద్రపడింది. ఇజ్రాయెల్ ఆయుధ దిగుమతులలో 70% ఇజ్రాయెల్ రక్షణ బడ్జెట్‌లో 15% వరకు యూఎస్ బాధ్యత వహిస్తుంది. దాడిలో ఉపయోగించినట్లు కనిపించే అధునాతన విమానాలు, ఆయుధ సామాగ్రి కూడా ఇజ్రాయెల్ కు అమెరికానే అందించింది.
అమెరికాకు ముప్పు
ఇరాన్ ప్రభుత్వం మాత్రం దాడికి యునైటెడ్ స్టేట్స్ బాధ్యత వహించాలని హెచ్చరించింది. సిరియా రాజధాని డమాస్కస్‌లో జరిగిన ఈ దాడిలో సిరియా, లెబనాన్‌కు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ సీనియర్ కమాండర్లు, లెబనాన్‌లోని శక్తివంతమైన ఇరాన్-మిత్రరాజ్యం హిజ్బుల్లా మిలీషియా అధికారితో పాటు పలువురు మరణించారు. ఇరాన్, దాని మిత్ర దేశాలు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తే మొదటగా ఇక్కడ ఉన్న అమెరికా బేస్ లే ప్రథమ లక్ష్యాలుగా మారతాయని మిడిల్ ఈస్ట్ ఇన్‌స్టిట్యూట్ యొక్క సిరియా ప్రోగ్రామ్ డైరెక్టర్ చార్లెస్ లిస్టర్ పేర్కొన్నారు.
"ఇరానియన్లు చాలా సంవత్సరాలుగా ఇజ్రాయెల్ చేత దాడులకు గురువుతున్నారు. అయితే ప్రతీకార దాడులు మాత్రం అమెరికన్లు గురవుతున్నారు ఈ ప్రాంతంలో వారే తేలిక లక్ష్యాలుగా మారుతున్నారు" లిస్టర్ చెప్పారు.
US దళాలకు ప్రమాదం
బుధవారం వాషింగ్టన్‌లో, మిడిల్ ఈస్ట్‌కు చెందిన యుఎస్ ఎయిర్ ఫోర్స్ టాప్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ అలెక్సస్ గ్రిన్‌కెవిచ్ మాట్లాడుతూ, ఇజ్రాయెల్ చర్యలకు యుఎస్ బాధ్యత వహిస్తుందని ఇరాన్ చేసిన ప్రకటన, యుఎస్ దళాలపై మిలీషియా దాడులకు ప్రేరేపణ ఇవ్వగలదని అన్నారు. ఇప్పటికిప్పుడు యుఎస్ దళాలకు ఎటువంటి ముప్పు లేదని, సమీప కాలంలో దాడులకు మాత్రం అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
గత ఏడాది అక్టోబర్ 7న హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాక్, సిరియాలోని ఇరాన్ మద్దతుగల మిలీషియాలు ఆ దేశాలలోని అమెరికా స్థావరాలపై 150 కంటే ఎక్కువ దాడులు జరిగాయని వివిధ గణాంకాలు తెలియజేస్తున్నాయి.
యుద్ధంలో US పాత్ర
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి US మిలిటరీ ఇప్పటికే మధ్యధరా నుండి ఎర్ర సముద్రం వరకు తన యుద్ద నౌకలను మోహరించింది. తరువాత హౌతీలు చేస్తున్న దాడులను తిప్పికొట్టేందుకు పలుమార్లు వైమానిక దాడులు చేపట్టింది.
Read More
Next Story