భారత్- ఈయూ ఒప్పందంపై అమెరికా అక్కసు
x
స్కాట్ బెసెంట్

భారత్- ఈయూ ఒప్పందంపై అమెరికా అక్కసు

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుందని విమర్శించిన యూఎస్ వాణిజ్యకార్యదర్శి


భారత్- ఈయూ మధ్య భారీ ఒప్పందం కుదరడంపై అమెరికా తన కడుపు మంటను బయటపెట్టింది. భారత్, రష్యా నుంచి శుద్ది చేసిన చమురు ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ యూరప్ కు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్దానికి నిధులు సమకూరుస్తుందని అమెరికా వాణిజ్య కార్యదర్శి స్కాట్ బెసెంట్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

‘‘రష్యా చమురు కొనుగోలు కోసం భారత్ పై 25 శాతం సుంకాలు విధించాము. గతవారం ఏం జరిగిందో ఊహించండి? యూరోపియన్లు భారత్ తో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశారు’’ అని బెసెంట్ ఆదివారం ఏబీసీ మీడియాతో అన్నారు.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేస్తాం
‘‘రష్యన్ చమురు భారత్ కొనుగోలు చేస్తుంది. శుద్ది చేసిన ఉత్పత్తులు బయటకు వస్తాయి. యూరోపియన్లు వారు నుంచి వచ్చిన వాటిని కొనుగోలు చేస్తున్నారు. వారు తమపై తామే చేసే యుద్దానికి నిధులు సమకూరుస్తున్నారు. చివరకు ట్రంప్ నాయకత్వంలో ఈ యుద్ధాన్ని ముగిస్తాము’’ అని ఆయన అన్నారు.
ట్రంప్ హయాంలో భారత్ పై 50 శాతం సుంకాలు విధించినట్లు చెప్పుకొచ్చారు. ఇందులో 25 శాతం సుంకాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు విధించామని చెప్పారు.
అమెరికా సుంకాల కారణంగా ప్రపంచ వాణిజ్యంలో అంతరాయాల మధ్య రెండు ప్రాంతాల మధ్య ఆర్థిక సంబంధాలను పెంచే లక్ష్యంతో భారత్, ఈయూ జనవరి 27న చర్చల ముగింపు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయనున్నాయి. ఈ చర్చలు 2007 లో ప్రారంభం అయ్యాయి. భారత్- ఈయూ వాణిజ్య చర్చలు మంగళవారం అధికారికంగా ప్రకటించబడతాయని వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ ధృవీకరించారు.
ప్రస్తుతం ఈయూ కూటమి నేతలు భారత్ ఉన్నారు. గణతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హజరైన యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ లేయన్, ఈయూ - భారత్ ఎఫ్టీఏను అన్ని వాణిజ్య ఒప్పందాలకు తల్లిగా అభివర్ణించారు.
అమెరికా సెనెటర్ ఏమన్నారంటే..
ట్రంప్ సొంత పార్టీలోనే తాజా వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో అమెరికన్ సెనెటర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రిపబ్లికన్ సెనేటర్ టెడ్ క్రూజ్ మాట్లాడుతూ.. భారత్ తో వాణిజ్య ఒప్పందంపై పురోగతిని ఆపేస్తున్నదని న్యూఢిల్లీ కాదు, వైట్ హౌజ్ అని విమర్శించారు.
గత ఏప్రిల్ లో ట్రంప్, భారత్ పై సుంకాలు విధించకుండా తాము నిరోధించడానికి ప్రయత్నించామని చెప్పారు. అయితే ఇవేవి పట్టించుకోకుండా ట్రంప్ భారత్ పై 50 శాతం సుంకాలు విధించారు.
భారత్- కెనడా సంబంధాలు..
వాషింగ్టన్ నుంచి కూడా సుంకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న కెనడా, భారత్ తో ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రధాని మార్క్ కార్నీ నేతృత్వంలోని కెనడియన్ ప్రభుత్వం భారతీయ ఎగుమతులపై విధించిన 35 శాతం లెవీని ఉపసంహరించుకుంది.
జస్టిన్ ట్రూడో పదవీకాలంలో భద్రతా వివాదాల కారణంగా భారత్ తో సంబంధాలు దెబ్బతిన్నాయి. వీటిని పునరుద్దరించేందుకు ప్రస్తుతం అట్టావా ప్రయత్నిస్తోంది.
Read More
Next Story