
క్రూడ్ ఆయిల్
భారత్ పై ఈయూ ఆంక్షలు తుస్సుమన్నాయా? ఎందుకలా?
అమెరికా ఆంక్షలు విధిస్తేనే ఇబ్బంది అంటున్న నిపుణులు
ప్రణయ్ శర్మ
రష్యాతో వాణిజ్యం నెరుపుతున్న భారత్ పై ఈయూ తాజాగా ఆంక్షలు విధించింది. అయితే ఈ ఆంక్షలు పెద్దగా ప్రభావం చూపలేకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి చర్యలు మన వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు.
వాడినర్ చమురు శుద్ది కర్మాగారంపై ఆంక్షలు
భారత విధాన రూపకర్తనలను ఆందోళనకు గురి చేయని విషయం ఏంటంటే.. రష్యాతో వ్యాపారం చేస్తే భారత్ పై ఆంక్షలు విధిస్తామని అమెరికా హెచ్చరించడం. ‘‘అదే జరిగితే భారత్ కు తీవ్రమైన సవాల్’’ అని ఒక నిపుణుడు అభిప్రాయపడ్డాడు.
రష్యాకు చెందిన రోస్ నెఫ్ట్, భారత పెట్టుబడి కన్సార్టియం సంయుక్తం యాజమాన్యంలోని గుజరాత్ కు చెందిన వాడినార్ శుద్ది కర్మాగారంపై ఈయూ శుక్రవారం ఆంక్షలు విధించింది.
ఇది రష్యాపై భారీ ఒత్తిడి తీసుకొచ్చే వ్యూహాంలో భాగం. ఉక్రెయిన్ తో చేస్తున్న యుద్ధాన్ని బలవంతంగా ముగించే దాని ప్రయత్నాలలో ఒక భాగం.
అయితే ఈయూ ఆంక్షలపై భారత్ గట్టిగా విమర్శించింది. భారత పౌరులకు అత్యంత ముఖ్యమైన ఇంధన వాణిజ్యంపై ఈయూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని ఆరోపించింది.
ఇప్పటికే అమెరికా, నాటో కూటమి కూడా రష్యాతో వాణిజ్యం జరిపే దేశాలపై ఆంక్షలు విధించాయి. భారత్ లోని వదినార్ సంస్థ మొదటిసారిగా ఆంక్షలు ఎదుర్కొంది.
మాస్కో నాయకత్వం 50 రోజుల్లోపు కీవ్ తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని, లేకపోతే రష్యన్ వస్తువులు కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ఈయూ ఆంక్షలు విధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ట్రంప్ బెదిరింపును అనుసరించి మార్క్ రుట్టే కూడా .. రష్యాతో వ్యాపారం చేస్తే ఆంక్షలు ఎదుర్కొనే జాబితాలో భారత్, బ్రెజిల్, చైనా కూడా ఉంటాయని హెచ్చరించారు.
చమురు నిల్వలు..
ఈయూ చర్యలు రష్యన్ ముడి చమురు కొనుగోలును దాని సగటు మార్కెట్ ధర కంటే 15 శాతం తక్కువకు, అంటే బ్యారెల్ కు కేవలం 47.60 డాలర్లకే విక్రయిస్తోంది. ఇది డిసెంబర్ 2022 లో గ్రూప్ ఆఫ్ సెవెన్ విధించాలని ప్రతిపాదించిన 60 డాలర్ల కంటే తక్కువ.
‘‘మేము ఇప్పటి వరకూ చెల్లిస్తున్న దానికంటే చాలా తక్కువ ధరకు రష్యా నుంచి ఎక్కువ చమురును కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది’’ అని విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి అనిల్ వాధ్వా అన్నారు. కొంతమంది దౌత్యవేత్తలు ఈయూ ఆంక్షలు భారత్ కు వ్యతిరేకంగా లేవని అంటున్నారు.
‘‘మనం రష్యా నుంచి కొనుగోలు చేసే చమురును వైవిధ్యం చేయాలి. దేశీయ, ఇతర మార్కెట్లకు ఎక్కువగా వినియోగించాలి’’ అని పదవీ విరమణ చేసిన దౌత్యవేత్త ఒకరు అన్నారు.
భారత ప్రధాన చమురు సరఫరాదారు
భారత్ తన చమురు, గ్యాస్ లో 85 శాతానికి పైగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. మన సరఫరాదారుల్లో ఇరాక్, సౌదీ, రష్యా, యూఎస్ఏ, యూఏఈ ఉన్నాయి.
ఇరాక్ అతిపెద్ద సరఫరాదారు అయినప్పటికీ 2022 లో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా ప్రధాన ఎగుమతిదారుడిగా మారింది. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనరజీ అండ్ క్లీన్ ఎయిర్ తాజా నివేదిక ప్రకారం.. దాడి జరిగిన మూడో సంవత్సరం తరువాత కొత్త మార్కెట్లపై రష్యా పట్టు బలపడింది.
రష్యన్ చమురును ఎక్కువగా కొనుగోలు చేసే మూడు దేశాలు చైనా(78 బియలిన్ యూరోలు), భారత్(49 బిలియన్ యూరోలు) టర్కీ (34 బిలియన్ యూరోలు).
భారత దిగుమతుల విలువ గత సంవత్సరంతో పోలీస్తే ఎనిమిది శాతం పెరిగిందని అది తెలిపింది. దాడి జరిగిన మూడో సంవత్సరంలో రష్యా మొత్తం ప్రపంచ శిలాజ ఇంధన ఆదాయాలు 242 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దాడి జరిగినప్పటి నుంచి లెక్క గడితే ఈ మొత్తం 847 బిలియన్ డాలర్లుగా ఉంది.
రష్యా తన ఇంధనం నుంచి వచ్చే ఆదాయాన్ని అరికట్టడానికి పాశ్చాత్య దేశాలు ప్రయత్నించినప్పటికీ లోటును భర్తీ చేసే అవకాశం కనిపించకపోవడంతో అప్పుడు మిన్నకుండిపోయారు. అయితే మాస్కో కూడా వీటికి కౌంటర్ ప్రతిపాదనలు చేయడంతో చాలా సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చింది.
వైవిధ్యనమైన వనరులు..
భారత్ తన ఇంధన అవసరాల్లో దాదాపు 60 శాతం గల్ఫ్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. అయితే వీటి ధర అనేది మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయించబడతాయి. కాబట్టి భారత్ కూడా చౌకైన చమురు, గ్యాస్ వనరుల కోసం వెతికింది.
తన ఇంధన అవసరాల కోసం వాటిని ఉత్పత్తులను కొనుగోలు చేసే దేశాల సంఖ్య 27 నుంచి ఇప్పుడు 40 కి పెరిగిందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పూరీ తెలిపారు. కొత్తగా నైజీరీయా, అంగోలా, అల్జీరియా, లిబియా, ఈక్వటోరియల్ గినియా, కాంగో, గాబన్ వంటి దేశాలు చేరాయి. లాటిన్ అమెరికాలోని వెనిజులా, కొలంబియా, మెక్సికో నుంచి కూడా చమురును దిగుమతి చేసుకుంటున్నాము.
ద్వంద్వ ప్రమాణాలు..
రష్యా నుంచి ఇంధన కొనుగోలుపై ఈయూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని భారత్ ఘాటుగా ఆరోపించింది. రష్యన్ ఉత్పత్తులపై ఆంక్షలు విధించడంలో అమెరికాతో కలిసి అడుగులు వేయడానికి సిద్దంగా ఉందని, కానీ జూన్ 2025 వరకూ రష్యన్ చమురు, గ్యాస్ కొనుగోలు దారులలో నాల్గవ అతి పెద్ద కూటమి ఈయూనే అని గణాంకాలు విడుదల చేసింది.
రష్యా నుంచి ఈయూ శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుని 1.2 బిలియన్ యూరోలను చెల్లించినట్లు ఆరోపించింది. రష్యా నుంచి సహజవాయువు ను ఈయూ అనుమతించిందని సీఆర్ఈఏ పేర్కొంది. దాని దిగుమతుల్లో 72 శాతానికి పైగా రష్యా నుంచే వస్తోంది.
అయితే ఈయూ మాత్రం తన ఆంక్షలను సమర్థించుకుంది. ప్రపంచ ఇంధన మార్కెట్లో స్థిరత్వాన్ని దెబ్బతీయడం లేదా భారత్ కు వ్యతిరేకం కాదని భారత్ లోని ఈయూ రాయబారీ హెర్వ్ డెల్పిన్ గత వారం స్పష్టం చేశారు. రష్యా ఆదాయాలను అరికట్టడానికి, ఉక్రెయిన్ యుద్దాన్ని ముగించడానికి ఒక ప్రయత్నం అని ఆయన అన్నారు.
వాణిజ్య చర్చలలో పాల్గొన్న భారత్- యూఎస్ఏ
భారత ఉత్పత్తులపై ట్రంప్ సుంకం 26 శాతం వరకూ పెరగకుండా ఉండటానికి జూలై చివరి నాటికి వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడంపై భారత్- అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి. రెండు వైపులా ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆసక్తిగానే ఉన్నాయి.
కానీ వ్యవసాయ ఉత్పత్తులు, ఆటోమొబైల్ భాగాలు విషయంలో చర్చలు ముందుకు సాగడం లేదు. అవి విఫలమైతే రెండు వైపులా ఒకరి ఉత్పత్తులపై పరస్పరం సుంకాలు విధించుకునే అవకాశం ఉంది. దీని వలన వాటిని మార్కెట్లో లో విక్రయించడం కష్టంగా ఉంటుంది.
అలాగే రష్యాతో వ్యాపారం చేస్తే 500 శాతం సుంకాలు విధించాల్సి ఉంటుందని సెనేట్ ప్రతిపాదించింది. వందమంది సభ్యులు గల సెనెట్ లో దీనికి 82 మంది సభ్యుల మద్దతు ఉంది.
ఆమోదం పొందాలంటే అది సెనెట్ తో పాటు ప్రతినిధుల సభ రెండింటిలో నెగ్గాలి. ప్రతిపాదిత చట్టాన్ని ఓటింగ్ పెట్టే విషయంలో ఇప్పటి వరకూ ఎలాంటి సూచనలు లేవు.
కాంగ్రెస్ లో బిల్లును ముందుకు తీసుకురాకుండా ఉండటానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఇతర మంత్రిత్వ శాఖల తో భారత అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.
ఈ చట్టం పరిధిలోకి వచ్చే దేశాలకు అధ్యక్షుడు మినహయింపు మంజూరు చేసే నిబంధనలు ఇందులో ఉన్నాయి. ట్రంప్ అధ్యక్ష పదవిలో ఉండగా ఈ చట్టం ఎలా ఉపయోగిస్తారనే దానిపై అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయి.
Next Story