పాకిస్తాన్- ఆప్ఘన్ మధ్య మరోసారి సాయుధ ఘర్షణలు
x

పాకిస్తాన్- ఆప్ఘన్ మధ్య మరోసారి సాయుధ ఘర్షణలు

నిన్న రాత్రి ఆప్ఘన్ భూభాగంపై దాడులు చేసిన పాక్ ఆర్మీ


Click the Play button to hear this message in audio format

పాకిస్తాన్- ఆప్ఘనిస్థాన్ మధ్య మరోసారి ఘర్షణలు ప్రారంభం అయ్యాయి. నిన్న అర్థరాత్రి నుంచి పాక్ సైన్యం తాలిబన్ల పాలనలోని నంగర్ హార్, పాక్టికా ప్రావిన్స్ లోని ఏడు ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. ఇందులో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు మరణించినట్లు వెల్లడించింది.

అయితే ఈ ప్రకటనను తాలిబన్ పాలకులు ఖండించారు. ఈ ప్రావిన్స్ లోని సాధారణ పౌర ఆవాసాలపై పాక్ మిలిటరీ బాంబుల వర్షం కురిపించిందని, పదులు సంఖ్యలో సాధారణ ప్రజలు మరణించాలని పేర్కొంది. "నిన్న రాత్రి, వారు నంగర్‌హార్, పాక్టికా ప్రావిన్సులలోని మా ప్రజలపై బాంబు దాడి చేశారు. మహిళలు, పిల్లలతో సహా డజన్ల కొద్దీ సాధారణ ప్రజలను బలిగొన్నారు. చాలామందిని గాయపరిచారు" అని ఆఫ్ఘన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ Xలో ఒక పోస్ట్‌లో తెలిపారు.

శనివారం ఆప్ఘనిస్తాన్ సరిహద్దులోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బన్ను ప్రాంతంలో బాంబు దాడి జరిగింది. ఇక్కడ జరిగిన ఆత్మాహుతి దాడిలో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఒక లెప్టినెంట్ కల్నల్, సహ కొంతమంది సైనికులు మరణించారు. దీనికి ప్రతీకారంగానే దాడులు చేసినట్లు పాకిస్తాన్ సైన్యం ప్రకటించింది.
ఈ ఆత్మాహుతి దాడికి ఆఫ్ఘన్ నుంచే వ్యూహ రచన జరిగిందని, ఇందుకు సరైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పాకిస్తాన్ ఆర్మీకి చెందిన పీఆర్ విభాగం పేర్కొంది. అక్కడ ఉగ్రవాదుల ఆదేశాలతోనే పాకిస్తాన్ ఆర్మీ మీద దాడి జరిగిందని ఆరోపించింది. ఇస్లామాబాద్‌లోని షియా మసీదుపై దాడి, బజౌర్, బన్నులో ప్రత్యేక దాడులకు ప్రణాళికలు ఆప్ఘనిస్తాన్ నుంచి కుట్రలు రచించారని పేర్కొంది.
పాకిస్తాన్ లో జరిగిన దాడులకు ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫిట్నా అల్ ఖ్వారిజ్ (FAK), వారి అనుబంధ సంస్థలు, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ ప్రావిన్స్ (ISKP) కు చెందిన పాకిస్తాన్ తాలిబన్లు కూడా బాధ్యత వహించాయని పాక్ సమాచార మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఉగ్రవాదులకు కాబూల్ ఆశ్రయం..

పాకిస్తాన్ లోపల దాడులు చేయడానికి ఆఫ్ఘన్ భూభాగాన్ని ఉపయోగించకుండా ఉగ్రవాద గ్రూపులు విదేశీ ప్రాక్సీలను ఆపడానికి ఇస్లామాబాద్ అనేక సార్లు అభ్యర్థించిందని, కానీ కాబూల్ వీటిని పట్టించుకోవడం లేదని సమాచార మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ప్రతీకార చర్యగా పాకిస్తాన్ ఎఫ్ఏకే, దాని అనుబంధ ఉగ్రవాద గ్రూపులు, ఐఎస్కేపీ, టీటీపీకి చెందిన ఏడు ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్లు పేర్కొంది. తాత్కాలిక ఆఫ్ఘన్ ప్రభుత్వం తన బాధ్యతలను నెరవేరుస్తుందని తాము ఆశిస్తున్నట్లు కూడా పాకిస్తాన్ పేర్కొంది.

దోహ ఒప్పందం..

దోహా ఒప్పందంలో భాగంగా తాలిబాన్ పాలన తన కట్టుబాట్లకు కట్టుబడి ఉండాలని అంతర్జాతీయ సమాజం సానుకూల నిర్మాణాత్మక పాత్ర పోషించాలని తాము కోరుకుంటున్నట్లు పాకిస్తాన్ తెలిపింది. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి కృషి చేస్తుందని, కానీ అదే సమయంలో, "మా పౌరుల భద్రత ప్రాధాన్యతగా ఉంటుంది" అని పేర్కొంది.

దెబ్బతిన్న సంబంధాలు- ఘర్షణలు

పాకిస్తాన్‌పై దాడి చేయడానికి ఉగ్రవాదులు తమ మట్టిని ఉపయోగించకుండా ఆపడంలో కాబూల్ విఫలమైనందున పాకిస్తాన్, ఆఫ్ఘన్ తాలిబాన్ల మధ్య సంబంధాలు క్షీణించాయి. గత సంవత్సరం అక్టోబర్‌లో, రెండు వైపులా కొంతకాలం సాయుధ పోరాటం జరిగింది, ఇందులో 23 మంది పాకిస్తాన్ సైనికులు, 200 మందికి పైగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ సైనికులు మరణించారని పాకిస్తాన్ సైన్యం తెలిపింది.


Read More
Next Story