అరుణాచల్ ప్రదేశ్ మాదే, చైనాకు మరోసారి తలంటిన భారత్
x

అరుణాచల్ ప్రదేశ్ మాదే, చైనాకు మరోసారి తలంటిన భారత్

అరుణాచల్ ప్రదేశ్ ముమ్మాటికి భారత భూభాగమే అని న్యూఢిల్లీ మరోసారి ఉద్ఘాటించింది. చైనా రక్షణశాఖ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వం ఖండించింది.


పక్క దేశాల భూమిని ఆక్రమించడం, సముద్రం మొత్తం నాదే అని వితండవాదం చేయడం, అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించకపోవడం.. జిత్తులమారీ చైనా నైజం. ఇప్పుడు అదే రీతిలో భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ కూడా నాదే అంటూ మరోసారి వితండవాదానికి దిగడంతో భారత గట్టిగా కౌంటర్ ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటూ చైనా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను ఖండించింది. " భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ అప్పడు ఇప్పుడూ, ఎల్లప్పుడూ విడదీయరాని భాగం" అని ప్రకటించింది.

ఈ మధ్య భారత ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించారు. రక్షణపరంగా కీలకమైన ‘సెలా’ టన్నెల్ ను ప్రారంభించారు. ఇది తవాంగ్ ను చైనా సరిహద్దులను కలుపుతుంది. దీంతో భారత సైన్యానికి సంవత్సరమంతా సరిహద్దు భద్రతను పర్యవేక్షించడానికి అవకాశం లభిస్తుంది. దీనిపై జిత్తులమారీ చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది.
"భారత రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ భూభాగంపై చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి చేసిన అసంబద్ధమైన వ్యాఖ్యలను మేము గమనించాము" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వా ల్ పేర్కొన్నారు.
" అరుణాచల్ ఎన్నటికీ మా భూభాగమే. దేశంతో దానికి విడదీయరాని అనుబంధం ఉంది. మా ప్రజలు అభివృద్ది కార్యకలాపాల ఫలాలను ఎప్పటికీ పొందుతూనే ఉంటారు. మీ నిరాధారమైన వాదనలు పదే పదే చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు" అని ఆయన అన్నారు. ఇంతకుముందు కూడా చైనా భారత భూగమైన అరుణాచల్ ప్రదేశ్ కు పేర్లు పెట్టింది. దీనిని కూడా న్యూఢిల్లీ ఖండించింది. మీరు పేర్లు పెట్టడం వల్ల వాస్తవికతను మార్చలేరని మొట్టికాయలు వేసింది.


Read More
Next Story