బంగ్లా: ‘‘మూడు సార్లు కాల్చి.. ఆపై కిరాతకంగా గొంతుకోసి’’
x
మైనారిటీలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ప్రదర్శన చేస్తున్న హిందువులు

బంగ్లా: ‘‘మూడు సార్లు కాల్చి.. ఆపై కిరాతకంగా గొంతుకోసి’’

కొనసాగుతున్న మైనారిటీ హిందువుల హత్య, 24 గంటల్లో ఇద్దరిని పాశవికంగా హతమార్చిన ఇస్లామిక్ మతోన్మాద మూకలు


బంగ్లాదేశ్ లో మైనారిటీ హిందువులపై ఇస్లామిక్ జిహాద్ శక్తులు దాడులు కొనసాగిస్తూ హత్యాకాండను కొనసాగిస్తూనే ఉన్నాయి. తాజాగా నర్సింగ్ది జిల్లాలోని ఓ కిరాణా షాపు యజమాని 40 ఏళ్ల శరత్ మణి చక్రవర్తిపై కొంతమంది జిహదీ శక్తులు పదునైన ఆయుధాలతో దాడులు చేసి హత్య చేశాయి.

గత 24 గంటలలో ఇద్దరు హిందువులను ఇస్లామిక్ మతోన్మాదులు దాడులు చేసి హత్య చేశారు. సోమవారం ఉదయం నర్సింగ్ది జిల్లాలోని పలాష్ ప్రాంతంలోని చార్సిందూర్ బజార్ లో శరత్ ఎప్పటిలాగే తన కిరాణా దుకాణంలో ఉండగా గుర్తు తెలియని దండుగులు దాడులు చేశారు. స్థానికులు ఆస్పత్రికి తరలించే లోపే అతను మృతి చెందాడు.

శరత్ కు భార్య అంతరా ముఖర్జీ, 12 ఏళ్ల కుమారుడు అభిషేక్ చక్రవర్తి ఉన్నారు. మీడియా నివేదికల ప్రకారం మృతుడు కొన్ని సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్ కు రాకముందు దక్షిణ కొరియాలో ఉద్యోగం చేస్తున్నాడని తెలుస్తోంది.
జషోర్ లో జర్నలిస్టు కాల్పులు..
కొన్ని గంటల ముందు బంగ్లాదేశ్ లోని జషోర్ జిల్లాలో 45 ఏళ్ల ఫ్యాక్టరి యజమానికి కాల్చి చంపేశారు. ఒక వార్తా పత్రికకు యాక్టింగ్ ఎడిటర్ అయిన రాణా ప్రతాప్ బైరాగిని దుండగులు తలపై కాల్చి చంపింది.
‘‘జషోర్ లోని కేశబ్ పూర్ ప్రాంతంలో రాణా ప్రతాప్ బైరాగి అనే వ్యక్తి కాల్చి చంపాబడ్డాడని మాకు సమాచారం అందించింది’’ అని బంగ్లాదేశ్ పూజా వేడుకల కమిటీ అధ్యక్షుడు బషుదేవ్ ధార్ తెలిపారు.
38 ఏళ్ల మృతుడు ఖుల్నా డివిజన్ జషోర్ లోని కేశబ్ పూర్ ఉప జిల్లాలోని అరువా గ్రామ నివాసి అని బంగ్లా భాషా దినపత్రిక ‘ప్రోథోమ్ అలో’ లో వార్తా కథనాలు ప్రచురించాయి. మెనిరాంపూర్ లోని కోపాలియా బజార్ లో ఐస్ తయారీ కర్మాగారాన్ని కలిగి ఉన్న బైరాగి, నరైల్ నుంచి ప్రచురితమయ్యే ‘దైనిక్ బిడి ఖబర్’ అనే వార్తాపత్రికకు యాక్టింగ్ ఎడిటర్ గా కూడా పనిచేశారని దినపత్రిక తెలిపింది.
సోమవారం సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో కోపాలియ బజార్ లో ఈ సంఘటన జరిగిందని అదనపు పోలీస్ సూపరిడెంటెంట్ అబుల్ అసర్ తెలిపారు. మోటార్ సైకిల్ పై వచ్చిన ముగ్గురు దండగులు తనన ఐస్ ప్యాక్టరీ నుంచి పిలిచి కోపాలియా బజార్ పశ్చిమం వైపున ఉన కపాలియా క్లినిక్ డయాగ్నిస్టిక్ సెంటర్ ముందు ఉన్న సందులోకి తీసుకెళ్లి కాల్చి చంపారు.
బైరాగి తలపై మూడు సార్లు కాల్పులు జరిపిన దుండగులు, చనిపోయిన తరువాత కూడా కిరాతకంగా గొంతు కోసి చంపారని మోనిరాంపూర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్ చార్జ్ ఎండీ రాజియుల్లా ఖాన్ తెలిపారు.
బైరాగి నిషేధిత పుర్బో బంగ్లార్ కమ్యూనిస్ట్ పార్టీ గ్రూపులో క్రియాశీల సభ్యుడని పోలీసులు తెలిపారు. మృతుడి పై రెండు పోలీస్ స్టేషన్ లలో నాలుగు కేసులు నమోదు అయ్యాయని వారు తెలిపారు.
అయితే కేసుల వివరాలంటో మాత్రం తెలపలేదు. గత కొన్నివారాలుగా దేశంలో మైనారిటీ సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని హింసాకాండ పెను సంచలనం సృష్టించింది. బంగ్లాదేశ్ మారిన రాజకీయాల కారణంగా మూక హింస సాధారణంగా మారింది.
బంగ్లాదేశ్ లో మైనారిటీలపై ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2022 జనాభా లెక్కల ప్రకారం బంగ్లాదేశ్ లో దాదాపు 13.13 మిలియన్ల మంది హిందువులు నివసిస్తున్నారు. ఇది మొత్తం జనాభాలో 7.95 శాతానికి సమానం.
Read More
Next Story