బంగ్లాకు వచ్చిన బీఎన్పీ తాత్కాలిక చైర్మన్ తారిక్ రెహమాన్
x
తారిక్ రెహమాన్

బంగ్లాకు వచ్చిన బీఎన్పీ తాత్కాలిక చైర్మన్ తారిక్ రెహమాన్

17 సంవత్సరాల ప్రవాసం తరువాత ఢాకాకు రాక


బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) యాక్టింగ్ చైర్మన్ తారిఖ్ రెహమాన్ 17 సంవత్సరాలు లండన్ లో ప్రవాసంలో గడిపిన తరువాత గురువారం తన భార్య, కుమార్తె తో కలిసి లండన్ నుంచి బంగ్లాదేశ్ కు తిరిగి వచ్చారు.

ఆయన ఉదయం 11.41 గంటలకు ఢాకాలోని సిల్హెట్ మీదుగా హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్ లైన్స్ విమానంలో ఢాకాకు వచ్చారని డైలీ స్టార్ వార్తలు ప్రచురించింది.

ఆ విమానం ఉదయం 9:58 గంటల ప్రాంతంలో సిల్హెట్ లోని ఉస్మాని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగినట్లు పేర్కొంది. రెహమాన్ తన భార్య, ఇద్దరు సన్నిహితులు అబ్దుర్ రెహామాన్ సునీ, కమల్ ఉద్దీన్ లతో కలిసి బంగ్లాదేశ్ కు తిరిగి వచ్చారు. వారి పెంపుడు పిల్లిని కూడా వారితో పాటు తీసుకొచ్చారు.

బీఎన్పీ నాయకుల స్వాగతం..
విమానాశ్రయంలో బీఎన్పీ స్టాండింగ్ కమిటీ సభ్యులు రెహమాన్ కు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఢాకాలోని ప్రయాణికులకు అసౌకర్యాన్ని తగ్గించడానికి సుహ్రవర్థి ఉద్యాన్, మానిక్ మియా అవెన్యూ మీదుగా ప్రయాణించారు.
ఈ కాన్వాయ్ లో రెండు బుల్లెట్ ఫ్రూఫ్ వాహానాలు ఉన్నాయి. బీఎన్పీ నాయకులు కార్యకర్తలు ఆయను స్వాగతం పలికేందుకు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు. బీఎన్పీ సీనియర్ నాయకుడు, పార్టీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వేదికపై ఉన్నప్పటికీ రెహామాన్ మాత్రమే సభలో ప్రసగిస్తారు.
ఖలీదా జియా తో బేటీ..
బహిరంగ ప్రసంగం తరువాత ఆయన ఎవర్ కేర్ ఆసుపత్రికి వెళ్లి నెల రోజులకు పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి, మాజీ ప్రధానమంత్రి జియాను పరామర్శిస్తారు.
తన తల్లితో సమావేశం తరువాత రెహమాన్ విమానాశ్రయం రోడ్డు, కాకోరీ మోర్ మీదుగా గుల్షన్ -2 లో జియా కుటుంబ నివాసం అయిన ఫిరోజాకు వెళతారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ రోజు ఢాకాలో దాదాపు 50 లక్షల మంది ప్రజలు హజరవుతారని బీఎన్పీ నాయకత్వం అంచనా వేస్తోంది.
అరెస్ట్.. దేశ బహిష్కరణ
తారిక్ రెహమాన్ మార్చి 7, 2007 న అరెస్ట్ అయ్యారు. సెప్టెంబర్ 3, 2008 న అతనికి బెయిల్ లభించింది. ఆయన వైద్య చికిత్స కోసం ఆ సంవత్సరం సెప్టెంబర్ 11న తన కుటుంబంతో కలిసి లండన్ బయలు దేరాడు. అప్పటి నుంచి తారిక్ తన భార్య జుబేదా రెహమాన్, వారి కుమార్తె జైమా రెహమాన్ తో కలిసి లండన్ లోనే ప్రవాస జీవితం గడుపుతున్నారు.
అత్త అనారోగ్యం కారణంగా జుబేదా రెహమాన్ ఢాకాకు తిరిగి వచ్చి రెండు వారాల పాటు ఉన్నారు. ఆమె డిసెంబర్ 20 న తిరిగి లండన్ కు వెళ్లారు. అవామీ లీగ్ ప్రభుత్వ పదవీకాలంలో తారిక్ ఐదు కేసులో గైర్హాజరు కాగా దోషిగా నిర్ధారణ అయింది. అతనిపై దాదాపు వంద కేసులు ఉన్నాయి. అవామీ లీగ్ ప్రభుత్వం పతనం తరువాత అతనిపై కేసులన్నీ రద్దు అయ్యాయి.
రాజకీయ జీవితం..
తారిఖ్ చిన్న వయస్సులోనే తన జీవితాన్ని ప్రారంభించాడు. 1988 లో 22 సంవత్సరాల వయస్సులో బొగురా జిల్లాలోని బంగ్లాదేవ్ నేషనలిస్ట్ పార్టీ గబ్తాలీ జిల్లా యూనిట్ లో సభ్యుడయ్యాడు.
అయితే అధికారికంగా పార్టీ చేరడానికి ముందే ఆయన రాజకీయాల్లోకి పాల్గొన్నాడు. 1991 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన తల్లితో కలిసి దేశవ్యాప్త ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. 2002 లో ఆయన బీఎన్పీ సీనియర్ జాయింట్ సెక్రటరీ జనరల్ గా నియమితులయ్యారు.
లండన్ లో ప్రవాసంలో ఉన్నప్పుడూ తారిఖ్ తన తమ్ముడు అరాఫత్ రెహమాన్ చనిపోయాడు. విదేశాల్లో ఉన్న అతను 2009 లో బీఎన్పీ ఐదో జాతీయ మండలిలో పార్టీకి సీనియర్ వైస్ ఛైర్మన్ గా ఎన్నికయ్యాడు.
2016 లో మరోసారి అదే పదవికి ఎన్నికయ్యాడు. ఫిబ్రవరి 8, 2018 లో జియా అనాథ ట్రస్ట్ అవినీతి కేసులో మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా జైలు శిక్ష అనుభవించిన తరువాత తారిక్ బీఎన్పీ తాత్కాలిక ఛైర్మన్ గా పనిచేస్తున్నారు.
Read More
Next Story