
డెన్వార్ విమానాశ్రయంలో ఎయిర్ స్లయిడ్ నుంచి దిగుతున్న ప్రయాణీకులు
ఈసారి అమెరికా ప్రయాణికులను భయపెట్టిన బోయింగ్
ల్యాండింగ్ గేర్ లో సమస్య తలెత్తడంతో విమానంలో పొగలు, వణికిపోయిన ప్రయాణీకులు
ఇండియా, ఫ్రాన్స్, మలేషియా, అమెరికా ఇలా ఏదైన బోయింగ్ విమానాలు ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి. గుజరాత్ లో 260 మంది ప్రయాణికులు మరణించిన సంఘటన మర్చిపోక ముందే యూఎస్ లోని డెన్వర్ విమానాశ్రయంలో ఇలాంటి సంఘటన జరగడానికి తృటిలో తప్పిపోయింది.
ల్యాండింగ్ గేర్ పనిచేయక విమానంలో పొగలు అలుముకోవడంతో విమానంలో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని కూర్చున్నారు. చివరకు అత్యవసర ద్వారం తెరిచి ఎయిర్ స్లయిడ్ నుంచి ఒక్కొక్కరుగా కిందకి దూకాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్ లో వైరల్ గా మారింది.
విమానంలో మంటలు, పొగలు రావడంతో బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం నడుపుతున్న ఏఏ-3023 టేకాఫ్ సమయంలో సంఘటన ఈ సంఘటన జరిగింది. ఈ సందర్భంగా విమానంలో 173 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం టైర్ లో నిర్వహణ సమస్య తలెత్తిందని ఎయిర్ లైన్ తరువాత ప్రకటించింది.
ల్యాండింగ్ గేర్ సంఘటన
ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) ప్రకారం విమానం డెన్వర్ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరింది. అయితే విమానంలో సమస్య తలెత్తడంతో ప్రయాణికులను వెంటనే రన్ వే పైకి తరలించి బస్సులో టెర్మినల్ కు తరలించినట్లు తెలిపింది.
గందరగోళం.. భయం
ఎయిర్ బస్ ఏ321 విమానం క్యాబిన్ లో పొగలు వస్తున్నాయని సిబ్బంది చెప్పడంతో అత్యవసర ప్రతిస్పందన బృందాలు వెంటనే విమానాన్ని చుట్టుముట్టాయి. బ్రేక్ లు వేడెక్కడం వలన ఈ పొగ వచ్చిందని వారు భావిస్తున్నారు. ఎటువంటి మంటలు లేవని నిర్ధారించబడినప్పటికీ, ఆ పొగ ప్రయాణికుల్లో గందరగోళాన్ని, భయాన్ని మరింత పెంచింది.
‘‘విమానం టేకాఫ్ కోసం తిరగడం ప్రారంభించింది. ఆపై అకస్మాత్తుగా ఆగిపోయింది’’ అని ఒక ప్రయాణీకుడు సీబీఎస్ న్యూస్ కొలరాడోతో అన్నారు. ‘‘పొగ రావడంతో ప్రయాణీకులు భయపడి బయటకు రావాలని అరుస్తున్నారు.
మాకు తెలిసిన తదుపరి విషయం ఏంటంటే, అత్యవసర తలుపులు తెరిచి, స్లయిడ్ లో వచ్చాము’’ అని చెప్పారు. ఈ సందర్భంగా ఒక ప్రయాణీకులు స్వల్ఫంగా గాయపడ్డాడు.
నిర్వహణ సమస్య..
ల్యాండింగ్ గేర్ పై టైర్ ఉండటంతో విమానం నిర్వహణ సమస్యను ఎదుర్కొందని అమెరికన్ ఎయిర్ లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘అందరూ ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా దిగిపోయారు. మా నిర్వహణ బృందం తనిఖీ చేయడానికి విమానాన్ని సేవల నుంచి పక్కన పెట్టారు’’ అని పేర్కొంది.
డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రభావిత రన్ వే పై కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే విమానాశ్రయ కార్యకలాపాలపై పెద్దగా ప్రభావం చూపలేదు. అగ్ని ప్రమాదం సంఘటనపై ఎఫ్ఏఏ మరింత దర్యాప్తు చేయబోతోంది.
బిడ్డ కంటే లగేజీ కావాలి..
విమానంలో ప్రయాణించిన వారిలో ఒకరు తన బిడ్డ కంటే లగేజీకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో విమర్శలకు గురి అయింది. వీడియోలో అతను విమానం నుంచి కిందికి జారుకుంటూ ఒక చేతిలో బిడ్డ మెడను పట్టుకోగా, మరో చేతిలో లగేజీని పట్టుకున్నాడు. స్లయిడ్ నుంచి వచ్చిన తరువాత బ్యాలెన్స్ నిలబెట్టుకోలేక తన బిడ్డపై పడినట్లు కనిపించాడు. దీనితో విమర్శలకు గురైయ్యారు.
Next Story