
కన్యత్వాన్ని 18 కోట్లకు వేలం వేసిన బ్రిటన్ ముద్దుగుమ్మ!
22 ఏళ్ల బ్రిటన్ యువతి లారా ఆన్ లైన్లో తన కన్యత్వాన్ని వేలం పెట్టారు. అనేక మంది స్పందిస్తూ కుప్పలు తెప్పలుగా టెండర్లు వేశారు.
ఈ అమ్మాయి పేరు లారా.. అందాల ముద్దు గుమ్మ.. నిండా 22 ఏళ్లు కూడా లేవు. దేశం ఇంగ్లండ్. ఉండేది మాంచెస్టర్. పెళ్లి కాలేదు. ఈ అమ్మాయికో వింత ఆలోచన వచ్చింది. కన్యత్వంపై ఏవేవో మాటలు, పాటలు, కవితలు, విలువలు, ప్రేమలు వంటివాటిని పక్కనపెట్టి జీవిత భద్రత కల్పించుకుంటే ఎలా ఉంటుందన్నఆలోచన వచ్చింది. తన దేహం తన ఇష్టం. అనుకున్నదే తడవుగా చేతిలో గిరగిరా తిప్పుతున్న ఫోన్ తీసి ఆన్ లైన్లో తన కన్యత్వాన్ని వేలానికి పెట్టింది. కొన్ని వందల మంది స్పందించారు. కొట్లు వెచ్చిస్తామంటూ ముందుకువచ్చారు. చదవడానికి కాస్తంత ఇబ్బందిగా ఉన్నా వేలం మాత్రం నిజం. డబ్బున్న ఓ అమెరికా నటుడు ఈ అమ్మాయి కన్యత్వాన్ని వేలంలో కొనుక్కున్న మాట వాస్తవం. ఆమె సృష్టించిన ఈ సంచలనం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంతకీ ఆ కథేంటంటే..
22 ఏళ్ల బ్రిటన్ యువతి లారా ఆన్ లైన్లో తన కన్యత్వాన్ని వేలం పెట్టారు. అనేక మంది స్పందిస్తూ కుప్పలు తెప్పలుగా టెండర్లు వేశారు. ముఖ్యంగా సిండ్రెల్లా ఎస్కార్ట్స్ ఏజెన్సీ వెబ్‌సైట్ ద్వారా లారా తన కన్యత్వాన్ని అమ్మబోతున్నట్లు ప్రకటించారు. అనేక మంది బిడ్‌లు వేశారు. హాలీవుడ్‌కి చెందిన ఒక ప్రముఖ నటుడు 18 కోట్ల రూపాయల (భారతీయ కరెన్సీలో) భారీ మొత్తాన్ని చెల్లించి లారాను పొందాడు. ఈ వేలం తర్వాత లారా మీడియాతో మాట్లాడింది. తాను ఇలా చేసినందుకు తానేమీ పశ్చాత్తాపడడం లేదని తెగేసి చెప్పింది.
ఆమె వాదన ఏమిటంటే.."చాలామంది అమ్మాయిలు తమ కన్యత్వాన్ని మోజులో పడి కోల్పోతారు. కానీ నేను దీని ద్వారా భవిష్యత్తుకు భద్రత కల్పించుకున్నాను. ఈ వేలంలో వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు, ఇతర డబ్బున్న వాళ్లు పాల్గొన్నారు. చివరికి హాలీవుడ్ నటుడు అత్యధిక ధరకు ముందుకు వచ్చారు. నేను అతనికే నా కన్వత్వాన్ని ఇవ్వాలనుకుంటున్నాను" అని చెప్పారు.
నెటిజన్ల సిగపట్లు...
లారా వ్యవహారమై నెటిజన్లు తీర్పరులుగా మారారు. రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు లారా వ్యవహారాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. డబ్బు కోసం ఇంతగా దిగజారాలా అని విమర్శలకు లంకించుకున్నారు. మరికొందరు ఆమె నిర్ణయాన్ని స్వాగతించారు. తన దేహం తన ఇష్టం అంటున్నారు. ఇది ఆమె వ్యక్తిగత స్వేచ్ఛా వ్యవహారంగా చెబుతున్నారు. ఇలాంటి వ్యవహారాలు సమాజానికి మేలు చేస్తాయా, చేటు చేస్తాయా అని కొందరు చర్చిస్తున్నారు.
మాంచెస్టర్‌కు చెందిన లారా 'సిండ్రెల్లా ఎస్కార్ట్స్' అనే ఏజెన్సీ ద్వారా 2023 డిసెంబర్ లో తన కన్యత్వాన్ని వేలానికి పెడుతూ ఆ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు తనకు తగిన రేటు వచ్చిందని, అందుకే హాలివుడ్ స్టార్ బిడ్ ను ఖరారు చేస్తున్నానని ప్రకటించారు. "లాస్ ఏంజిల్స్‌కు చెందిన అత్యంత ప్రసిద్ధ హాలీవుడ్ నటుడు" ఆ వేలంలో గెలిచాడు. లండన్‌కు చెందిన ఒక రాజకీయ నాయకుడు, దుబాయ్‌కు చెందిన ఒక వ్యాపారవేత్తను మించి వేలంలో అత్యధిక ధర పెట్టినట్టు తెలుస్తోంది.
వీరిద్దరి కలయికకు సిండ్రెల్లా ఎస్కార్ ఏజెన్సీ వారు త్వరలో ఓ తేదీని నిర్ణయించారు. ఓ ఫైవ్ స్టార్ హోటల్లో వారు కలిశారు.
"ఆమె కన్యత్వం ప్రామాణికతను ఓ డాక్టర్ పర్యవేక్షణలో నిర్దారించారు" అని ఏజెన్సీ వ్యక్తి తెలిపారు.
తాను ఈ నిర్ణయం తీసుకున్నందుకు "సంతోషంగా" ఉన్నానని లారా చెప్పినట్లు మెయిల్ ఆన్‌లైన్ ఉటంకించింది. "నా కన్యత్వం నాకు చాలా విలువైంది. నన్ను ఎప్పటికీ పెళ్ళి చేసుకోని వ్యక్తితో నేను నా కన్యత్వాన్ని పొగొట్టుకోవాలనుకోవడం లేదు" అని ఆమె అన్నట్టు లండన్ టాబ్లాయిడ్ పత్రికలు రాశాయి.
తన శరీరంపై పూర్తి హక్కులు లారావేనని, సొంతంగా నిర్ణయాలు తీసుకునే హక్కు ఆమెకు ఉందన, తన నిర్ణయం ప్రభావం ఎలా ఉంటుందో కూడా ఆమెకు పూర్తిగా తెలుసనే తాము భావిస్తున్నట్టు లారా తల్లిదండ్రులు చెప్పారు. ఆమె నిర్ణయంతో మొదట ఆశ్చర్యపోయిన ఆమె తల్లిదండ్రులు ఇప్పుడు ఆమెకు మద్దతు తెలిపారు.
ఆమెకు వచ్చే డబ్బు ఆమె జీవితాన్ని మార్చే మొత్తంగా మారింది. దాంతో ఆమె అపార్ట్‌మెంట్‌లను కొనుగోలు చేసి వాటిని అద్దెకు స్వతంత్రంగా బతికే ఏర్పాటు చేసుకుంది. తన నిర్ణయం తనకు మాత్రమే సానుకూలమైందని, తాను చేసిందే ఇతరులు చేయాల్సిన పని లేదని, ఇందులో చాలా ప్రమాదాలు కూడా ఉంటాయని ఆమె ఇతరులను హెచ్చరించడం గమనార్హం.
లారా ను ఇప్పుడందరూ "షుగర్ బేబీ"గా పిలుస్తున్నారు. ఆమె నెలకు £30,000 (సుమారు రూ.3 కోట్లు) సంపాదించాలని యోచిస్తున్నట్టు లండన్ పత్రికలు రాశాయి.
Next Story