కెనడా: ఊరేగింపు చేస్తున్న ప్రజలపైకి దూసుకెళ్లిన కారు
x

కెనడా: ఊరేగింపు చేస్తున్న ప్రజలపైకి దూసుకెళ్లిన కారు

పదుల సంఖ్యలో ప్రజల మృత్యువాత


కెనడాలోని వాంకోవర్ లో ఒక వీధి ఉత్సవం చేస్తున్న ప్రజలపైకి కారు దూసుకెళ్లిన ఘటనలో అనేకమంది ప్రజలు మరణించినట్లు సమాచారం. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు వాంకోవర్ పోలీసులు తెలిపారు.

స్థానిక కాలమానం ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకు ఈ సంఘటన జరిగింది. నగరంలోని ఫ్రేజర్ పరిసరాల్లో ఫిలిప్పిన్స్ కమ్యూనిటీ చెందిన ప్రజలు ‘‘లాపు లాపు’’ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఒకే ప్రదేశంలోకి చేరిన సందర్భంలో ఈ సంఘటన జరిగింది.
‘‘ఈ రాత్రి ఎనిమిది గంటల తరువాత ఈ.41 అవెన్యూ, ఫ్రేజర్ వద్ద జరిగిన వీధి ఉత్సవంలో ఒక డ్రైవర్ జనంలోకి కారు నడపడంతో అనేక మంది మరణించారు. అనేకమంది గాయపడ్డారు. డ్రైవర్ అదుపులోకి తీసుకున్నాము. దర్యాప్తు ముగిసే కొద్ది మేము మరిన్ని వివరాలను అందిస్తాము’’ అని వాంకోవర్ పోలీసులు తెలిపారు.
సంతాపం తెలిపిన మేయర్..
ఈ సంఘటనపై నగర మేయర్ సంతాపం తెలిపారు. సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేస్తూ.. ‘‘ఈ భయంకరమైన సంఘటనలతో నేను షాక్ కు గురయ్యాను. చాలా బాధపడ్డాను’’ అన్నారు. ఈ సంఘటనపై పూర్తి విచారణ జరిగాక, మరిన్ని వివరాలు అందిస్తానని హమీ ఇచ్చారు.
‘‘ఈ రోజు జరిగిన లాపు లాపు దినోత్సవ కార్యక్రమంలో జరిగిన దారుణ సంఘటన నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. తీవ్ర బాధ కలిగించింది. వీలైనంత త్వరగా మరిన్ని వివరాలు అందించడానికి మేమే కృషి చేస్తున్నాము.
కానీ ఈ సమయంలో వాంకోవర్ పీడీ అనేక మరణాలు, గాయాలు సంభవించాయని నిర్ధారించింది. ఈ క్లిష్ట సమయంలో ప్రభావితమైన వారందరితో, వాంకోవర్ ఫిలిఫ్పిన్స్ కమ్యూనిటీతో మా ఆలోచనలు ఉన్నాయి’’ అని పోస్ట్ పేర్కొంది.


Read More
Next Story