ఇక కెనడా హయ్యర్ స్టడీస్ చాన్స్ అందరికీ రాదు,
x

ఇక కెనడా హయ్యర్ స్టడీస్ చాన్స్ అందరికీ రాదు,

తమ దేశంలోకి చదువుకోవడానికి వచ్చే విద్యార్థుల సంఖ్యలో కోత విధించాలని కెనడా ప్రభుత్వం నిర్ణయించింది.


తమ దేశంలోకి వచ్చే వలసదారుల సంఖ్యను తగ్గించుకునేందుకు కెనడా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా అంతర్జాతీయ విద్యార్థులకు ఇచ్చే స్టడీ పర్మిట్స్ ను ఈ సంవత్సరం 35 శాతం తగ్గించుకుంటున్నామని, వచ్చే ఏడాది మరో 10 శాతం తగ్గించనున్నట్లు ప్రకటించింది.

దీంతోపాటు విదేశీ ఉద్యోగుల నిబంధనలను కూడా ప్రభుత్వం కఠినతరం చేసింది. ఇది కొంతమంది విద్యార్థులు, తాత్కాలిక విదేశీ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు వర్క్ పర్మిట్ అర్హతను కూడా పరిమితం చేసింది. కొత్త నియమాలు భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. కెనడాకి చదువుకోవడానకి వెళ్తున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులే. అక్కడి యూనివర్శిటీలన్నీ కూడా భారతీయ విద్యార్థులు కట్టే ఫీజులతోనే నడుస్తున్నాయి.
వ్యవస్థను సరిచేస్తున్నాం..
“ మేము ఈ సంవత్సరం 35 శాతం తక్కువ అంతర్జాతీయ విద్యార్థులకు అనుమతులను మంజూరు చేస్తున్నాము. వచ్చే ఏడాది, ఆ సంఖ్య మరో 10 శాతం తగ్గుతుంది" అని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఎక్స్‌లో పోస్ట్ చేశారు. "ఇమ్మిగ్రేషన్ మా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రయోజనం. కానీ కొంతమంది వ్యక్తులు వ్యవస్థను దుర్వినియోగం చేసి విద్యార్థుల వల్ల ప్రయోజనాలు పొందుతున్నారు, అందువల్ల మేము కఠిన నిర్ణయం తీసుకున్నాం" అని ప్రధాని ట్రూడో ట్వీట్ చేశారు.

గణాంకాలు..
2023లో కెనడా 5,09,390 అంతర్జాతీయ అధ్యయన అనుమతులను ఆమోదించినట్లు ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ డేటా చూపుతోంది. ఈ సంఖ్య 2024లో 4,85,000కి తగ్గించుకోవాలని, మరో వచ్చే ఏడాది పది శాతం కోత తర్వాత 2025లో 4,37,000 అనుమతులకు తగ్గుతుంది. రాబోయే మూడేళ్లలో ఈ మార్పులు "సుమారు 3,00,000 తక్కువ స్టడీ పర్మిట్‌లను ఇస్తాయని" ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ బుధవారం తెలిపారు.
కారణం ఏంటీ..
క్యూబెక్‌లో ఎన్నికల్లో ఓ ముఖ్యమైన సీటును అధికార పార్టీ కోల్పోయింది. దీనికి ప్రధాన కారణం తమ దేశంలోకి వలసదారులను ఇబ్బందిముబ్బడి అనుమతించవల్లే అని ఓటర్లు భావించారు. ఇది ట్రూడో నేతృత్వంలోని అధికార పార్టీకి ఓటమి భయాన్ని కలిగించింది. దీనికి తోడు వచ్చేవారం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సి ఉంది.
ఇమ్మిగ్రేషన్ విధానాలు హౌసింగ్, సామాజిక సేవలను కఠినతరం చేయాలని ప్రజలు భావిస్తున్నారు. కెనడాలో తక్కువ ధరకు ఇళ్లు లభించకపోవడం, పెరిగిన జీవన వ్యయానికి వలసదారులే కారణం అని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. దీనికి ట్రూడో ప్రభుత్వ విధానాలే కారణమని వీటిని కఠినతరం చేయాలని వారు కోరుతున్నారు. దీనితో ట్రూడో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. అందుకే తాజా ప్రకటన అని అంతర్జాతీయ నిపుణుల మాట.
ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు పని చేస్తున్నాయని మిల్లర్ చెప్పాడు. "విద్యార్థులు ఎక్కువగా ఉండే కొన్ని అద్దె మార్కెట్‌లపై ప్రభావం చూపిందనడానికి వృత్తాంత సాక్ష్యాల కంటే ఎక్కువ" అని ఆయన ఉటంకించారు. కెనడా జనాభా 41 మిలియన్లు దాటినందున, విదేశీ విద్యార్థులు, కార్మికులతో సహా తాత్కాలిక నివాసితుల తగ్గింపు వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలకు దారితీసే కీలక అంశంగా ఉద్భవించింది.
భారతీయులు ఎలా ప్రభావితమవుతారు
కెనడాలో దాదాపు 13.35 లక్షల మంది భారతీయ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని, దాదాపు 4.27 లక్షల మంది కెనడాలో ఉన్నారని, ఇది భారతీయ విద్యార్థులకు ఇష్టమైన గమ్యస్థానాలలో ఒకటిగా మారిందని భారత ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
కెనడాలోని విదేశీ విద్యార్థుల్లో దాదాపు 40 శాతం భారతీయులే ఉన్నారని రాయిటర్స్ నివేదిక వెల్లడించింది. 2013 నుంచి 2022 వరకు సుమారు 9 సంవత్సరాలలో కెనడాకు చదువుల కోసం వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య 260 శాతం పెరిగింది. కెనడా ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్థులకు అనుమతులను తగ్గించడంతో, భారతీయులు US, ఆస్ట్రేలియా, UK, ఐరోపాలోని ఇతర దేశాల వంటి ఇతర గమ్యస్థానాలను చూడవలసి ఉంటుంది.


Read More
Next Story