మా ఎన్నికల్లో జోక్యం చేసుకుంటున్నారన్నకెనడా.. తిరస్కరించిన భారత్
x

మా ఎన్నికల్లో జోక్యం చేసుకుంటున్నారన్నకెనడా.. తిరస్కరించిన భారత్

కమిషన్ కు ట్రూడో నియమించిన వ్యక్తే చైర్మన్


కొంతకాలంగా భారత్ టార్గెట్ గా అనవసర వివాదాలు సృష్టిస్తున్న కెనడా.. మరోమారు న్యూఢిల్లీపై విషం కక్కింది. తమ దేశ ఎన్నికల్లో కొన్ని విదేశీ ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటున్నాయనే ఆరోపణలపై దర్యాప్తు చేసిన కెనడియన్ కమిషన్ నివేదిక సమర్పించింది. అయితే ఈ నివేదికలో భారత్ పేరును ప్రస్తావించడంతో విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది.

కెనడాలో భారత్ పేరును ప్రస్తావించినట్లు మాకు తెలిసింది. ఈ విషయాన్ని తిరస్కరిస్తున్నట్లు విదేశీ వ్యవహరాల మంత్రిత్వశాఖ తెలిపింది. వాస్తవానికి కెనడానే, భారత వ్యవహరాల్లో నిరంతరం జోక్యం చేసుకుంటోందని పేర్కొంది.
‘‘మేము ఉద్దేశపూర్వక జోక్యం ఆరోపించిన కార్యకలాపాల గురించి ఒక నివేదికను చూశాము. వాస్తవానికి ఇది కెనడా, భారత అంతర్గత వ్యవహారాల్లో స్థిరంగా జోక్యం చేసుకుంటోంది’’అని విదేశాంగ శాఖ తెలిపింది.
కెనడా అక్రమ వలసలు, వ్యవస్థీకృత నేరకార్యకలాపాలకు అండగా నిలబడుతోందని ఆరోపించింది. ‘‘మేము కెనడా సూచనలు తిరస్కరిస్తున్నాం. చట్టవిరుద్దమైన వలసలను ఇక ముందు అండగా ఉండకూడదని భావిస్తున్నాం’’ అని విదేశాంగ శాఖ తెలిపింది.
కెనడియన్ వార్తా పత్రిక ది గ్లోబ్ అండ్ మెయిల్ కూడా భారత్ పై విషం కక్కింది. ఫెడరల్ ఎన్నికల్లో మూడు రాజకీయ పార్టీల అభ్యర్థులకు రహస్యంగా ఆర్థికసాయం అందించడానికి భారత ప్రభుత్వం ప్రాక్సీ ఏజెంట్లను ఉపయోగిస్తోందని, కమిటీ నివేదికలో ఇదే ఉందని వార్తను ప్రచురించింది.
విచారణ కమిషన్..
సెప్టెంబర్ 2023లో ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఎన్నికల్లో విదేశీ జోక్యం ఆరోపణలపై విచారణ కమిషన్ కు జస్టిస్ మేరీ జోసే హోగ్ ను నియమించారు. కెనడియన్ మీడియా నివేదికల ప్రకారం.. చైనా, రష్యా, ఇతరులు తమ దేశంలో జరిగే ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయనే ఆరోపణలను కమిషన్ పరిశీలించింది.
గత జూన్ లో కెనడా నేషనల్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ కమిటీ ఆఫ్ పార్లమెంటేరియన్స్ చేసిన నివేదికలో కొంతమంది పార్లమెంటేరియన్లు విదేశీ జోక్యంలో పాల్గొనేవారిలో మాట్లాడుతున్నారని బయటకు వచ్చింది.
Read More
Next Story