‘అయ్యా.. ఇక మీరు దయచేయండి’, ట్రూడోకు సొంత పార్టీ ఎంపీల షాక్..
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కు సొంత పార్టీ ఎంపీలు షాక్ ఇచ్చారు. ఆయనకు వ్యతిరేకంగా పదుల సంఖ్యలో అసమ్మతి తెలియజేస్తూ ఓ లేఖ అందజేశారు.
తన పదవి కాపాడుకునేందుకు ఇప్పటికే చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తున్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోకు సొంత పార్టీ ఎంపీలే షాక్ ఇచ్చారు. పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇప్పటికే భారత్ తో దౌత్య ఉద్రిక్తతలు పెంచారని న్యూఢిల్లీ ఆరోపించింది. సరిగా ఇవే అంశాలపై సొంత పార్టీ ఎంపీల నుంచి ట్రూడో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.
కొన్ని నివేదికల ప్రకారం, ఇటీవల పోల్‌లో పార్టీ పేలవమైన ఫలితాలు, క్షీణిస్తున్న ప్రజాదరణకు ట్రూడో నే కారణమని సొంత పార్టీ ఎంపీలు విమర్శలు గుప్పిస్తున్నారు. చట్ట సభ సభ్యులు అక్టోబర్ 28న ట్రూడ్ భవితవ్యం తేల్చాలని పిలుపునిచ్చారు. 20 మందికి పైగా లిబరల్ ఎంపీలు ట్రూడోకు వ్యతిరేకంగా లేఖపై సంతకం చేశారు. లేఖలో ట్రూడోకు గడువు ఇచ్చారని నివేదికలు చెబుతున్నాయి.
కెనడియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్ప్ మాత్రం సంతకం చేసిన ఎంపీల సంఖ్యను 24గా పేర్కొంది. హౌస్ ఆఫ్ కామన్స్‌లో మొత్తం 153 మంది ఎంపీలు ఉన్నారు. ట్రూడో ప్రభుత్వం ఇప్పటికే మైనారిటిలో పడింది. ఆయన సంకీర్ణ ప్రభుత్వానికి మద్ధతనిచ్చిన న్యూ డెమెక్రాటిక్ పార్టీ తన మద్ధతు ఉపసంహరించుకుంది. బుధవారం జరిగిన లిబరల్స్ కాకస్ సమావేశంలో ఈ లేఖను ట్రూడోకు చదివి వినిపించినట్లు తెలిసింది. ట్రూడో మాత్రం అక్టోబర్ 2025 చివరి నాటికి జరిగే ఎన్నికలలో నాలుగోసారి పోటీ చేయాలని నిశ్చయించుకున్నారు.
కెనడియన్ ప్రధాని తన పార్టీ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించిన తర్వాత ఉదారవాదులు "బలంగా, ఐక్యంగా" ఉన్నారని, మరో 20 మంది ఎంపీలు జారీ చేసిన గడువు వేరే కథను చెబుతుందని కెనడియన్ న్యూస్ ఛానెల్ నివేదించింది.
" ప్రజల నాడీని అతడు వినడం ప్రారంభించాలి" అని న్యూఫౌండ్‌ల్యాండ్‌కు చెందిన లిబరల్ ఎంపీ కెన్ మెక్‌డొనాల్డ్ అన్నారు. ట్రూడోను వ్యతిరేకించే ఎంపీలలో ఆయనకు పేరుంది.
పార్టీ రేటింగ్ పడిపోతోంది: పార్టీ
ప్రజాభిప్రాయ సర్వేల ప్రకారం ట్రూడో పోటీ చేస్తే కన్జర్వేటివ్ పార్టీ దారుణ ఓటమిని ఎదుర్కొంటుందని సూచిస్తున్నాయి. నానోస్ రీసెర్చ్ ఇటీవల జరిపిన పోల్ ప్రకారం, ప్రస్తుతం కన్జర్వేటివ్‌లు 39 శాతం ప్రజా మద్దతును పొందుతున్నారు, లిబరల్స్ 23 శాతం, న్యూ డెమోక్రాట్‌లు 21 శాతం మద్ధతు పొందుతున్నారు. అయితే వ్యక్తిగతంగా ట్రూడో పాపులారిటి కూడా దారుణంగా ఉంది.
లిబరల్స్‌కు పెరుగుతున్న ప్రజాదరణ ఎన్నికలకు ముందు తన సహచరులలో చాలా మందిని కలవరపెట్టిందని కన్జర్వేటివ్ ఎంపీ మెక్ డొనాల్డ్ అన్నారు. "ప్రస్తుతం కొన్ని ప్యాలెస్ డ్రామాలు జరుగుతున్నాయని మీరు చూస్తున్నారు. కెనడియన్లపై దృష్టి సారించే నంబర్ వన్ ఉద్యోగం నుంచి అది మమ్మల్ని దూరం చేస్తుంది" అని లిబరల్ పార్టీ సభ్యుడు, ఉపాధి మంత్రి రాండీ బోయిసోనాల్ట్ చెప్పినట్లు కెనడా న్యూస్ ఛానెల్ పేర్కొంది. "నాయకుడిగా కొనసాగాలా వద్దా అనేది పార్టీ నాయకుడి నిర్ణయం" అని అంటారియో లిబరల్ శాసనసభ్యుడు వైవాన్ బేకర్ అన్నారు. ట్రూడోకు బదులుగా కొత్త ముఖాన్ని రంగంలోకి దింపితే పార్టీకి ఆశ ఉంటుందని మరో ఎంపీ వేన్ లాంగ్ అన్నారు.
దీని అర్థం ఏమిటి.. ?
హెచ్చరికలు ఉన్నప్పటికీ, ట్రూడో పదవీకి వచ్చిన గండం ఏమి లేదు. ఎందుకంటే అతనిని తొలగించడానికి అటువంటి యంత్రాంగం లేదు. కెనడాలో నాయకులు ఎంపీలచే కాకుండా ప్రత్యేక సమావేశంలో సభ్యులచే ఎన్నుకోబడతారు. మరో మాటలో చెప్పాలంటే, నిష్క్రమించాలా వద్దా అనే నిర్ణయం ట్రూడోపై మాత్రమే ఉంటుంది. అసమ్మతి ఎంపీలు పంపిన లేఖపై ఆయన ఇంకా సంతకం చేయలేదు.
Next Story