
కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో
దమ్ముంటే నన్ను పట్టుకెళ్లు: ట్రంప్ కు కొలంబియా ప్రెసిడెంట్ సవాల్
గ్రీన్ ల్యాండ్ ను ముట్టుకుంటే ‘నాటో’ విచ్ఛిన్నమే అన్న డెన్మార్క్ ప్రధాని
గ్రీన్ ల్యాండ్ ను తమ ఆధీనంలోకి తీసుకుంటామని, కొలంబియాకు వెనెజువెలా గతి పడుతుందని హెచ్చరించిన ట్రంప్ కు ఆయా దేశాధినేతల గట్టి హెచ్చరిక జారీ చేశారు.
కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో మాట్లాడుతూ.. ‘‘దమ్ముంటే నన్ను పట్టుకో. ఇక్కడ మీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను’’ అని ట్రంప్ కు సవాల్ విసిరాడు.
డానిష్ ప్రధానమంత్రి మెట్టె ఫ్రెడెరిక్సన్ కూడా ట్రంప్ కు ఇలాంటి సమాధానమే ఇచ్చారు. గ్రీన్ ల్యాండ్ ను అమెరికా స్వాధీనం చేసుకోవడం అంటే నాటో విచ్చిన్నమే అని హెచ్చరించారు.
జాగ్వార్ లు వస్తారు..
అమెరికా కొలంబియాపై బాంబు దాడి చేయాలని నిర్ణయించుకుంటే అది పర్వతాలలో వేలాది మంది గెరిల్లాల పెరుగుదలకు దారితీస్తుందని ఆయన అమెరికాను హెచ్చరించారు. అమెరికా తనను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే ప్రజా జాగ్వార్ ను విడుదల చేస్తుందని పెట్రో అన్నారు.
‘‘వారు(యూఎస్) బాంబులు వేస్తే క్యాంపెసినోలు పర్వతాలలో వేలాది మంది గెరిల్లాలుగా మారతారు. దేశంలో ఎక్కువ మంది ప్రేమించే, గౌరవించే అధ్యక్షుడిని వారు అదుపులోకి తీసుకుంటే వారు ప్రజా జాగ్వార్ ను విడుదల అవడం చూస్తారు’’ అని పెట్రో అన్నారు.
1960 లలో ఆయుధాలు విడిచిపెట్టిన మాజీ వామపక్ష గెరిల్లా అయిన కొలంబియన్ అధ్యక్షుడు తన మాతృభూమిని రక్షించుకోవడానికి మళ్లీ ఆయుధాలు చేపట్టడానికి వెనకాడమని హెచ్చరించారు. ‘‘నేను మళ్లీ ఆయుధాన్ని ముట్టుకోనని ప్రమాణం చేశాను. కానీ మాతృభూమి కోసం నేను మళ్లీ ఆయుధాలు చేపడతాను’’ అని సోమవారం అన్నారు.
ట్రంప్ ఆరోపణలు..
కొలంబియా నుంచి అమెరికాకు కొకైన్ సరఫరా అవుతుందని ఇది అధ్యక్షుడు పెట్రోనే పరోక్షంగా సాగిస్తున్నాడని ట్రంప్ విమర్శించాడు. ఈ నేపథ్యంలో కొలంబియా అధ్యక్షుడు మాట్లాడారు.
‘‘కొలంబియా కూడా ఇలాగే ఉంది. కొకైన్ తయారు చేసి యూఎస్ అమ్మడానికి ఇష్టపడే ఒక రోగి నడుపుతున్నాడు. అతను దీన్ని ఎక్కువకాలం చేయడు. నేను మీకు చెప్పాలి’’ అని కొలంబియాపై ట్రంప్ నోరు పారేసుకున్నాడు.
ఇక్కడ కూడా ఆపరేషన్ జరిగితే తనకు మంచిగా అనిపిస్తుందని చెప్పారు. ఇలాంటి సవాలే మదురో కూడా గత ఏడాది విసిరాడు. ‘‘నన్ను తీసుకెళ్లండి నేను అతని కోసం మిరాఫ్లోర్స్ లో ఉంటాను. పిరికి వాడిలా ఆలస్యం చేయకు’’ అని వెనెజువెలా అధ్యక్షుడు అన్నారు.
‘గ్రీన్ ల్యాండ్ ను అమెరికా స్వాధీనం చేసుకుంటే నాటో అంతమవుతుందని’ డెన్మార్క్ ప్రధాని హెచ్చరించారు. గ్రీన్ ల్యాండ్ పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్టె ఫ్రెడెరిక్సెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. డెన్మార్క్ ను అమెరికా స్వాధీనం చేసుకుంటే అది నాటో సైనిక కూటమి ముగింపుకు సమానమని హెచ్చరించాడు.
‘‘యూఎస్ మరోక నాటో దేశంపై సైనిక దాడి చేయాలని ఎంచుకుంటే ప్రతిదీ ఆగిపోతుంది. అంటే మన నాటోతో సహ రెండో ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుంచి అందించబడిన భద్రతతో అంతం అవుతుంది’’ అని డానిష్ ప్రధాని అన్నారు.
గ్రీన్ ల్యాండ్ వెనెజువెలా తో పోల్చద్దు
గ్రీన్ ల్యాండ్ ప్రధానమంత్రి జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ సోమవారం విలేకరులతో మాట్లాడారు. ‘‘గ్రీన్ ల్యాండ్ ను వెనెజువెలా మాదిరిగానే ఉంచలేమని అన్నారు. రాత్రికి రాత్రే దేశాన్ని స్వాధీనం చేసుకునే పరిస్థితి మాకు లేదు. అందుకే మంచి సహకారం కావాలని మేము పట్టుబడుతున్నాము. యునైటెడ్ స్టేట్స్ గ్రీన్ ల్యాండ్ ను సులభంగా జయించగల పరిస్థితి ఇప్పుడు లేదు’’ అని ఆయన అన్నారు.
Next Story

