
మదురోను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న అమెరికా డెల్టా ఫోర్స్
వెనెజువెలా అధ్యక్షుడిని తక్షణమే విడుదల చేయండి: చైనా
అంతర్జాతీయ చట్టాలను అమెరికా ఉల్లంఘించిందని బీజింగ్ వ్యాఖ్య
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను వెంటనే విడుదల చేయాలని, వివాదాలను చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని చైనా, యూఎస్ఏకు సూచించింది.
అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్యను అమెరికా బలవంతంగా బంధించి దేశం నుంచి బయటకు తీసుకెళ్లడంపై చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది’’ అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ చర్య అంతర్జాతీయ చట్టం, అంతర్జాతీయ సంబంధాలలో ప్రాథమిక నిబంధనలు, యూఎన్ చార్టర్ ఉద్దేశ్యాలు, సూత్రాలను స్పష్టంగా ఉల్లంఘించడమే అని చైనా పేర్కొంది.
వెనెజువెలాపై అమెరికా వైమానిక దాడులను, మదురో, అతని భార్యను బంధించడాన్ని మంత్రిత్వ శాఖ శనివారం ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించే ఆధిపత్య చర్యగా అభివర్ణించింది.
ఆధిపత్య చర్యలు..
వెనెజువెలాపై అమెరికా వైమానిక దాడులు, మదురో అతని భార్య సిలియా ప్లోర్స్ ను అరెస్ట్ చేయడం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఒక సార్వభౌమ రాజ్యంపై అమెరికా బలప్రయోగం చేయడం, దాని అధ్యక్షుడిపై చర్య తీసుకోవడంపై చైనా తీవ్ర దిగ్బ్రాంతి చెందింది. తీవ్రంగా ఖండిస్తోంది’’ అని పేర్కొంది.
అమెరికా ఆధిపత్య చర్యలు అంతర్జాతీయ చట్టాన్ని, వెనెజువెలా సార్వభౌమత్వాన్ని తీవ్రంగా ఉల్లంఘిస్తాయని, లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంతంలో శాంతి, భద్రతకు ముప్పు కలిగిస్తాయని మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.
బీజింగ్ కు ఎదురు దెబ్బ..
మదురో ప్రభుత్వం పతనం, అమెరికా అతనిని పట్టుకోవడం బీజింగ్ కు పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించబడుతుంది. ఎందుకు మదురోకు ముందు పగ్గాలు స్వీకరించిన హ్యూగో చావేజ్ నుంచే చైనాకు వెనెజువెలాకు ఇది సన్నిహిత వ్యూహాత్మక సంబంధాలను నడుపుతోంది.
గత రెండు దశాబ్ధాలుగా వెనెజువెలాతో బీజింగ్ వ్యూహాత్మక భాగస్వామ్యం, రాజకీయ సమన్వయం నడుపుతోంది. అమెరికా, పాశ్చాత్య ప్రభావానికి వ్యతిరేకంగా అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ చైనా, వెనెజువెలా నుంచి భారీ ఎత్తున చమురు కొనుగోలు చేస్తోంది. అలాగే ప్రధాన పెట్టుబడిదారు, రుణదాత కూడా.
Next Story

