పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండిస్తూనే, పాక్ కు మద్దతు ప్రకటించిన చైనా
x
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ

పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండిస్తూనే, పాక్ కు మద్దతు ప్రకటించిన చైనా

ఉగ్రవాదంపై తమ పోరు ఆగదన్న అజిత్ ధోవల్


పాకిస్తాన్ విషయంలో చైనా తీరు మారలేదు. పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించిన బీజింగ్, పాకిస్తాన్ కు తన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది.

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి, భారత జాతీయ భద్రతా సలహదారు అజిత్ ధోవల్ తో పాటు , పాక్ ఉప ప్రధానితో ఫోన్ లో మాట్లాడారు.
ధోవల్ తో మాట్లాడిన వాంగ్ యీ..
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, దోవత్ లో పాటు, పాకిస్తాన్ ఎన్ఎస్ఎ ఇషాక్ దార్ తో ఫోన్ లో మాట్లాడినట్లు చైనాకు చెందిన అధికారిక వార్తా ప్రసార మాధ్యమ సంస్థ జిన్హువా తెలియజేసింది. ఇరుదేశాల మధ్య ఉన్న విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకుని కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలని కోరారు.
యుద్ధం భారత్ తొలి అవకాశం కాదని, అయితే ఉగ్రవాదం పై తమ పోరాటం మాత్రం ఆగదని చైనా మంత్రికి స్పష్టం చేసినట్లు జిన్హువా రిపోర్టు చేసింది. వాంగ్ సైతం పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించారు. ఈ ఉగ్రవాద దాడి ప్రశాంతంగా ఉన్న సరిహద్దు లో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా చేసింది.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్..
పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత భారత సైన్యాలు పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులకు దిగడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. మే 7 న ప్రారంభమైన ఘర్షణ మే పదిన రెండు దేశాల కాల్పుల విరమణ ఒప్పందంతో ముగిసింది.
భారత్ , పాక్ లు భూమి, ఆకాశం, జల మార్గాల్లో వెంటనే కాల్పుల విరమణ పాటించడానికి అంగీకరించాయి. దీనితో నాలుగు రోజులు సరిహద్దులో డ్రోన్లు, క్షిపణుల దాడి, సైరన్ల మోతకు తెరపడింది.
అయితే రాత్రి కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పాక్ డ్రోన్లు, కాల్పులు జరపడంతో భారత్ తిరిగి ప్రతిదాడులు జరిపింది. అర్థరాత్రి విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిస్రీ మీడియాతో మాట్లాడారు. ఇస్లామాబాదే కాల్పులు విరమణ ఒప్పందానికి పూర్తి బాధ్యత వహించాలని అన్నారు.
భారత్ దళాలు పూర్తిగా అప్రమత్తతతో ఉన్నారని, డ్రోన్లను కూల్చివేస్తున్నట్లు తెలిపారు. జమ్మూకాశ్మీర్ తో పాటు గుజరాత్ లోనూ డ్రోన్లు కనపడినట్లు వాటిని సైన్యం నిర్వీర్యం చేసినట్లు చెప్పారు.
చర్చలు జరుపుకోండి..
దోవల్ తో జరిగిన చర్చలలో భారత్, పాకిస్తాన్ ప్రశాంతంగా సంయమనంతో ఉంటాయని, చర్చలు, సంప్రదింపులు ద్వారా విభేదాల సరిగ్గా పరిష్కరించుకుంటాయని, పరిస్థితి తీవ్రతరం కాకుండా ఉండగలవని వాంగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత్, పాకిస్తాన్ సంప్రదింపుల ద్వారా సమగ్రమైన, శాశ్వత కాల్పుల విరమణను సాధించాలని ఈ ప్రతిపాదనకు చైనా మద్దతు ఇస్తుందని తాము అదే ఆశిస్తున్నాయని వాంగ్ అన్నారు. ఇది రెండు దేశాల ప్రాథమిక ప్రయోజనాలకు, అంతర్జాతీయ సమాజం ఉమ్మడి ఆకాంక్షను తీరుస్తుందని అన్నారు.
పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిని చైనా ఖండిస్తుందని, అన్ని రకాల ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుందని ఆయన అన్నారు. ఆసియాలో శాంతి, స్థిరత్వం కష్టపడి సాధించుకున్నామని, వాటిని గౌరవించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
భారత్- పాకిస్తాన్ పొరుగు దేశాలని, వాటిని దూరంగా తరలించలేమని, అవి రెండు చైనాకు పొరుగు దేశాలని ఆయన అన్నారు.
యుద్ధం తొలి ఛాయిస్ కాదు..
పహల్గామ్ దాడిలో భారత పక్షానికి తీవ్ర నష్టం వాటిల్లిందని, ఉగ్రవాద నిరోధక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వాంగ్ తో ధోవల్ అన్నారు. యుద్దం అనేది భారత్ తొలి ఛాయిస్ కాదని స్పష్టం చేశారు.
ఇస్లామాబాద్..
పాకిస్తాన్ తన ప్రాథమిక, దీర్ఘకాలిక ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుందని చైనా విశ్వసిస్తుందని ఆయన అన్నారు. భారత్ తో కాల్పుల విరమణకు పాకిస్తాన్ సిద్దంగా ఉందని, అయితే దాని సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించే ఏవైనా చర్యలకు ప్రతిస్పందిస్తుందని దార్ వాంగ్ తో అన్నారు.
పాకిస్తాన్ కు అండగా ఉంటాం..
పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కు విడిగా చెప్పిన సమాచారం ప్రకారం.. బీజింగ్ పాకిస్తాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను నిలబెట్టడంలో ఇస్లామాబాద్ కు దృఢంగా అండగా నిలుస్తుందని వాంగ్ చెప్పారు.
పాకిస్తాన్ ఉప ప్రధానితో వాంగ్ మాట్లాడిన సందర్భంలో ఈ హమీ ఇచ్చారని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. పాకిస్తాన్ సంయమనాన్ని ప్రదర్శించిందని, సవాల్ పరిస్థితులోల బాధ్యతాయుతమైన విధానాన్ని అవలంభించిందని వాంగ్ అన్నారు.
పాకిస్తాన్ తమకు ఆల్ వెదర్ స్నేహితుడని, దాని సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, జాతీయ స్వాతంత్య్రాన్ని నిలబెట్టడంలో పాకిస్తాన్ కు దృఢంగా అండగా నిలుస్తుందని ఆయన పునరుద్ఘాటించారని పాక్ విదేశాంగ కార్యాలయం తెలిపింది.


Read More
Next Story