చంద్రుడిపైకి రెండో ల్యాండర్ పంపిన చైనా.. ఎందుకో తెలుసా ?
x

చంద్రుడిపైకి రెండో ల్యాండర్ పంపిన చైనా.. ఎందుకో తెలుసా ?

మన పొరుగు దేశం చైనా మరోసారి చంద్రుడిపైకి ల్యాండర్ ను పంపింది. ఇంతకుముందు 2020లో చాంగ్ 5 అనే ల్యాండర్ ను పంపి..


అంతరిక్ష ప్రయోగంలో బీజింగ్ మరో ముందడుగు వేసింది. చంద్రుడి ఉపరితలం పైకి మరో ల్యాండర్ ను ప్రయోగించగా అది సురక్షితంగా ల్యాండ్ అయినట్లు ప్రకటించింది. చంద్రుడిపై తక్కువ పరిశోధనలు జరిగిన దక్షిణ ప్రాంతం నుంచి పరిశోధన కోసం మట్టి, రాళ్లను సేకరిస్తున్నట్లు వెల్లడించింది.

ల్యాండింగ్ మాడ్యూల్ బీజింగ్ కాలమానం ప్రకారం ఉదయం 6:23 నిమిషాలకు సౌత్ పోల్-ఐట్‌కెన్ బేసిన్ అని పిలువబడే భారీ క్రేటర్‌ను తాకినట్లు చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. దీనికి చైనా చంద్ర దేవత పేరు ‘ చాంగ్ ’ పేరును పెట్టారు. చంద్రుడి పరిశోధనలో భాగంగా చైనా ప్రయోగించిన ఆరో కార్యక్రమం ఇది.

ఇంతకుముందు చైనా 2020లో చాంగ్ 5 మాడ్యూల్ ద్వారా చంద్రుడి ఉపరితలం లోని మట్టి, రాళ్ల నమూనాలను సేకరించింది. అంతరిక్ష పరిశోధనలో అమెరికాతో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో చైనా కూడా తన ప్రయోగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. మరో వైపు భారత్, జపాన్ సైతం అంతరిక్ష పరిశోధనలలో దూసుకుపోతుండటంపై చైనా అక్కసుగా ఉంది. ఇప్పటికే సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించిన బీజింగ్.. అక్కడికి క్రమం తప్పకుండా వ్యోమగాములను పంపుతోంది.

2030 నాటికి అంతరిక్ష పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి చంద్రుడిపైకి మానవుడిని పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంలో చంద్రుడిపైకి మానవుడిని పంపిన రెండో దేశంగా నిలవాలని తహతహలాడుతోంది. మరోవైపు అమెరికా సైతం రెండో సారి మానవుడిని చంద్రుడిపైకి పంపాలని ప్రయత్నాలు చేస్తోంది. 2026లో ఈ ప్రయోగం చేపట్టాలని ప్రణాళికలు రచించింది. అయితే వ్యోమనౌకలను ప్రయోగించడానికి ప్రైవేట్ రంగ రాకెట్లను ఉపయోగించే US ప్రయత్నాలు పదేపదే ఆలస్యం అవుతూనే ఉన్నాయి. శనివారం బోయింగ్ మొదటి వ్యోమగామి విమానం ప్రణాళికాబద్ధమైన ప్రయోగానికి చివరి నిమిషంలో కంప్యూటర్ సమస్య ఏర్పడింది.
అంతకుముందు శనివారం, ఒక జపాన్ బిలియనీర్ స్పేస్‌ఎక్స్ చేత మెగా రాకెట్‌ను అభివృద్ధి చేయడంపై ఒప్పందం కుదుర్చుకోవాలని అనుకున్నాడు.కానీ అవి అమలుకు నోచుకోలేకపోవడంతో తన ప్రణాళికను రద్దు చేసుకున్నాడు. అయినప్పటికీ నాసా చంద్రుడిపైకి మానవ సహిత యాత్ర చేయడానికి ఇలాంటి వాటికే ఆర్డర్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
ప్రస్తుతం చంద్రుడిపైకి చైనా ప్రయోగించిన ల్యాండర్ మిషన్ మెకానికల్ ఆర్మ్, డ్రిల్ ను ఉపయోగించి రెండు రోజుల్లో రెండు కిలోల ఉపరితల, భూగర్భ మట్టి నమూనాలను సేకరించాలి. తరువాత ల్యాండర్ పైన ఉన్న మరో పరికరం మెటల్ వాక్యూమ్ కంటైనర్ లోని నమూనాలను చంద్రుని చుట్టూ తిరిగే మరోక మాడ్యూల్ కు అందజేస్తుంది. తరువాత ఈ మాడ్యూల్ జూన్ 25న చైనా ఇన్నర్ మంగోలియా ప్రాంతంలోని ఎడారులలో భూమిపైకి చేరుస్తుంది.
చంద్రుడి వెనక వైపుకు మిషన్లు ప్రయోగించడం చాలా కష్టం, ఎందుకంటే అది భూమికి ఎదురుగా లేదు, కమ్యూనికేషన్లను నిర్వహించడానికి రిలే ఉపగ్రహం అవసరం. అక్కడ భూభాగం మరింత కఠినమైనది, చాలా తక్కువ స్థాయిలో చదునైన ప్రాంతాలు ఉంటాయి.
Read More
Next Story