నష్టపరిహారం చెల్లించాలి: ప్రధాని మోడీ
x
ప్రధాని నరేంద్ర మోదీ

నష్టపరిహారం చెల్లించాలి: ప్రధాని మోడీ

వాతావరణ మార్పుల వల్ల నష్టపోయిన దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు తగిన నష్టపరిహారం, సాంకేతిక పరిగ్నానం బదిలీ చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.


వాతావరణ కాలుష్యంతో ఏ మాత్రం సంబంధం లేని దేశాలు ప్రకృతి మార్పుల వల్ల జరిగే నష్టాలను ఎందుకు భరించాలని ప్రశ్నించారు. దుబాయ్ లో జరగనున్న కాప్ 28 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని శుక్రవారం న్యూఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు. అనంతరం దుబాయ్ కేంద్రంగా నడుస్తున్న స్థానిక మీడియా అలెతీహద్ తో ఆయన ముచ్చటించారు. గ్లోబ్ లోని దక్షిణ దేశాల ప్రతినిధిగా మాట్లాడుతున్నట్లు చెప్పారు.

ప్రపంచానికి హమీ ఇచ్చినట్లు పునరుత్పాదక ఇంధనం, అడవుల పెంపకం ఇంధన పొదుపు వంటి అంశాలపై విజయం సాధించినట్లు చెప్పారు. ఇది భారత రాజకీయ నాయకత్వ విజయానికి ఉదాహరణగా వివరించారు. దుబాయ్ సమావేశంలో వాతావరణ మార్పులకు తగిన చర్యలు తీసుకునే విషయంలో కీలక ముందడుగు పడుతుందనే న్యూఢిల్లీ ఆశాభావంతో ఉందని ప్రధాని అన్నారు. ప్రపంచం కలిసికట్టుగా ముందడుగు వేసి ప్యారిస్ ఒప్పంద విషయాలను అమలు చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

భారత్ -యూఏఈ వ్యూహత్మక మిత్ర దేశాలని , వాతావరణ విషయంలో భవిష్యత్ భాగస్వామ్య మార్పులను దృష్టితో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఇంధన రంగంలో తాము ఒకరికొకరు సహకరించుకుంటున్నామని అన్నారు. కాగా 2014 తరువాత భారత ప్రధాని యూఏఈలో పర్యటించడం ఇది ఆరోసారి.

Read More
Next Story