సంక్లిష్ట భౌగోళిక, రాజకీయ పరిస్థితులు ఎదురవుతున్నాయి: జైశంకర్
x
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్- రష్యా ఉప ప్రధాని డెనిస్ మంతురోవ్

సంక్లిష్ట భౌగోళిక, రాజకీయ పరిస్థితులు ఎదురవుతున్నాయి: జైశంకర్

రష్యా- భారత్ మధ్య సంబంధాలు విస్తరించాలని ఆకాంక్షించిన విదేశాంగ మంత్రి


సంక్లిష్ట భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్- రష్యా సృజనాత్మక, వినూత్న విధానాన్ని రూపొందించుకోవాలని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. మాస్కో లో పర్యటిస్తున్న ఆయన ఉప ప్రధాని డెనిస్ మంతురోవ్ తో చర్చలు జరిపారు.

రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుపై వాషింగ్టన్ తో న్యూఢిల్లీ సంబంధాలలో ఒడిదుడుకులు ఎదురవుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

రెండు దేశాల జాయింట్ వెంచర్ లతో సహకార ఎజెండాను నిరంతరం వైవిధ్యపరుచుకోవాలని, వాటిని విస్తరించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

‘‘ఎక్కువ పనులు చేయడం, అవి భిన్నంగా చేయడం మన మంత్రాలుగా ఉండాలి’’ అని జైశంకర్ అన్నారు. అంతకుముందు జైశంకర్ మాట్లాడుతూ.. ‘‘సంక్లిష్టమైన భౌగోళిక రాజకీయ పరిస్థితి నేపథ్యంలో రష్యా- భారత్ మధ్య ఆర్థిక సహకారం మరింతగా పెంచడానికి ఐఆర్ఐజీఐసీ- టెక్ ను మరింత సమర్థవంతమైన ఉత్ప్రేరకంగా మార్చడానికి కొన్ని సూచనలు అందిస్తున్నట్లు చెప్పారు.
వాషింగ్టన్- న్యూఢిల్లీ సంబంధాలలో..
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై సుంకాలను 50 శాతానికి రెట్టింపు చేసిన తరువాత భారత్- అమెరికా మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. ఇందులో భారత్ - రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసినందుకు 25 శాతం అదనపు సుంకాలు ఉన్నాయి.
జైశంకర్ మంతురోవ్ చర్చలు..
జైశంకర్ - మంతురోవ్ చర్చలు భారత్- రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ ఫర్ ట్రేడ్ ఎకనామిక్, సైంటిఫిక్ టెక్నలాజికల్, కల్చరల్ కో ఆపరేషన్ చట్టం( ఐఆర్ఐజీఐసీ- టెక్)కింద జరిగాయి.
ఈ సంవత్సరం చివర్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు వస్తున్న నేపథ్యంలో అందులో ఏయే ఏయే అంశాలు చర్చించబోతున్నారో ఎజెండాను సిద్దం చేయడం ఈ సమావేశం లక్ష్యం.
రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, ముఖ్యంగా ఆర్థిక రంగంలో సంబంధాలు బలపడటానికి ఆయన నిర్ధిష్ట సూచనలు చేశారు. పరస్పర సంప్రదింపుల ద్వారా ఇరుపక్షాలు నిరంతరం తమ ఎజెండాను వైవిధ్యపరుచుకోవాలని, విస్తరించాలని విదేశాంగ మంత్రి అన్నారు.
సంబంధాల విస్తరణ..
‘‘ఇది వాణిజ్యం, పెట్టుబడి సంబంధాల పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి మాకు సాయపడుతుంది. మనం దెబ్బతిన్న ట్రాక్ లో చిక్కుకోకూడదు’’ అని ఆయన అన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలను విస్తరించడంలో మరిన్ని లక్ష్యాలను సాధించడానికి లెక్కించదగిన వాటిని నిర్ధిష్ట కాలక్రమాలను(టైమ్ ఫ్రేమ్) నిర్దేశించుకోవాలని కూడా జైశంకర్ సూచించారు. దీని వల్ల చేయాల్సిన పనులు, చేయదగిన పనులు సులభంగా చేయవచ్చని, తద్వారా మరిన్ని కొత్తపనులు కొత్త రంగాలకు విస్తరించే అవకాశం ఉందన్నారు.
‘‘ప్రతి వర్కింగ్ గ్రూపు ప్రతి సబ్ గ్రూప్ లక్ష్యాలను నిర్ధేశించుకోవడానికి తనను తాను అన్వయించుకోవచ్చు. ఐఆర్ఐజీసీ- టెక్ తదుపరి సెషన్ నాటికి మనం ఏం సాధించగలమో చూడవచ్చు’’ అని ఆయన అన్నారు.
‘‘ఐఆర్ఐజీసీ మరింత మెరుగైన ఫలితాల ఆధారితంగా సందర్భోచితంగా, రెండు వైపులా వ్యాపార వర్గాలకు సులభంగా అందుబాటులో ఉండాలని మేము కోరుకుంటున్నాము’’ అని ఆయన అన్నారు.
Read More
Next Story