YSR ACA Cricket Stadium, Visakhapatnam

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో క్రికెట్‌ టెస్ట్‌మ్యాచ్‌లు జరగనున్నాయి. హైదరాబాద్, విశాఖపట్నం వేదికలుగా భారత్‌–ఇంగ్లండ్‌ జట్లు తలపడనున్నాయి.


– టెస్టు మ్యాచ్‌కు వేదికకానున్న హైదరాబాద్, వైజాగ్‌

– ఈ నెల 25 నుంచి హైదరాబాద్, ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్‌లో తలపడనున్న భారత్‌ – ఇంగ్లండ్‌ జట్లు
– హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్న టికెట్లు
– రోజుకు రెండు వేల మంది విద్యార్థులకు ఉచిత ఎంట్రీ
తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 25 నుంచి క్రికెట్‌ సందడి మొదలు కానుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్డేడియం వేదికగా గురువారం నుంచి ప్రారంభం కానునున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భాగంగా భారత్‌ – ఇంగ్లాండ్‌ జట్లు తలపడనున్నాయి. అదేవిధంగా ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు రెండో టెస్టు మ్యాచ్‌ వైజాగ్‌లోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఏసీఏ–వీడీసీఏ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో మ్యాచ్‌ ర్వహించనున్నారు.
టెస్ట్‌ మ్యాచ్‌ల టైంటేబుల్‌
మూడో టెస్టు మ్యాచ్ః సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం, రాజ్‌కోట్‌ (ఫిబ్రవరి 15 నుంచి 19వ తేదీ వరకు), నాలుగో టెస్టు మ్యాచ్ః జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్‌ స్టేడియం కాంప్లెక్స్, రాంచి (ఫిబ్రవరి 23 నుంచి 27వ తేదీ వరకు), ఐదో టెస్టు మ్యాచ్ః హిమాచల్‌ ప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం, ధర్మశాలలో (మాచ్చి 7 నుంచి 11వ తేదీ వరకు) మ్యాచ్‌ జరగనుందని ఇప్పటికే బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌ పర్‌ క్రికెట్‌ ఇన్‌ ఇండియా (బీసీసీఐ) ఇప్పటికే ప్రకటించింది. ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ, వైస్‌ కెప్టెన్‌గా జస్‌ప్రీత్‌ బుమ్రా ఉన్నారు. బ్యాటింగ్‌ లైనప్‌లో శుభమన్‌ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్‌ కోహ్లీ, శ్రేయాస్‌ అయ్యర్‌ తదితరులు ఉన్నారు.
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో విశాఖపట్నం టెస్ట్‌మ్యాచ్‌ టిక్కెట్లు
ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు విశాఖపట్నం వేదికగా జరగనున్న భారత్‌ – ఇంగ్లండ్‌ జట్ల మధ్య 2వ అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌ కోసం అన్ని రకాల టిక్కెట్లు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో ఉంచినట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్‌ఆర్‌ గోపినాథ్‌రెడ్డి తెలిపారు. ఆన్‌లైన్‌ టికెట్లు ఈ నెల 15 నుంచి అమ్మకం ప్రారంభించారు.
పేటీఎం యాప్‌ లేదా Inrider.inఅనే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా ఒక రోజు మ్యాచ్‌ కోసం రూ. 100, రూ. 200, రూ. 300, రూ. 500 విలువ చేసే టిక్కెట్లు, అదేవిధంగా సీజన్‌ మొత్తానికి (5 రోజులకు కలిపి) రూ. 400, రూ. 800, రూ.1,000 విలువ చేసే టికెట్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 1,500 టికెట్లు ఆన్‌లైన్‌లో అయిపోయినప్పటికీ ఆఫ్‌లైన్‌ ద్వారా విక్రయించే కౌంటర్లలో కొనుగోలు చేయవచ్చు. మ్యాచ్‌ను తిలకించేందుకు హైదరాబాద్‌లో రోజుకు 3 వేల మంది, వైజాగ్‌లో రోజుకు 2 వేల మంది విద్యార్థులకు ఉచితంగా ఎంట్రీ ఇవ్వనున్నారు.
26వ తేదీ నుంచి ఆఫ్‌లైన్‌లో టికెట్ల విక్రయాలు
టెస్టు మ్యాచ్‌ కోసం ఆఫ్‌లైన్‌ ద్వారా ఈ నెల 26 నుంచి ఫిబ్రవరి 6 వరకు పీఎం పాలెంలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్‌ స్టేడియం, 26 నుంచి ఫిబ్రవరి 1 వరకు స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో విక్రయించేందుకు 13,382 టికెట్లు అందుబాటులో ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ వారు ఉంచారు.
ఆన్‌లైన్‌ టిక్కెట్లు
ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు ఉంచిన ధరలు, టికెట్ల సంఖ్య వివరాలు ఇలా ఉన్నాయి. రోజుకు రూ.100+సీజన్‌కు రూ.400ల టిక్కెట్లు 2వేలు, రోజుకు రూ.200+సీజన్‌కు రూ.800ల టిక్కెట్లు వెయ్యి, రోజుకు రూ.300+సీజన్‌కు రూ.1,000 ల టిక్కెట్లు 2,500, రోజుకు రూ.500+సీజన్‌కు రూ.1,500ల టిక్కెట్లు 400 , మొత్తం కలిపి 5,900లు అందుబాటులో ఉన్నాయి.
ఆఫ్‌లైన్‌ టిక్కెట్లు
ఆఫ్‌లైన్‌లో విక్రయించేందుకు కేటాయించిన ధరలు, టిక్కెట్ల సంఖ్య ఈ విధంగా ఉన్నాయి. రోజుకు రూ.100+సీజన్‌కు రూ.400ల టిక్కెట్లు 2,092, రోజుకు రూ.200+సీజన్‌కు రూ.800ల టిక్కెట్లు 330, రోజుకు రూ.300+సీజన్‌కు రూ.1,000ల టిక్కెట్లు 1,903, రోజుకు రూ.500+సీజన్‌కు రూ.1,500ల టిక్కెట్లు 309 ఉన్నాయి. మొత్తం కలిపి 4,632 టిక్కెట్లు ఉన్నాయి.
రాష్ట్రంలోని క్రికెట్‌ క్లబ్‌ క్రీడాకారుల కోసం (రాయితీపై) 2,850 టికెట్లు
క్రికెట్‌ క్లబ్‌ క్రీడాకారులకు రాయితీపై ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని 2,850 మంది క్రికెట్‌ క్లబ్‌ క్రీడాకారులకు రాయితీపై రూ. 250లకు ఐదు రోజుల పాటు మ్యాచ్‌ను తిలకించే అవకాశం కల్పించినట్లు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎస్‌.ఆర్‌.గోపినాథ్‌రెడ్డి తెలిపారు.
Next Story