మీకు బంగ్లాదేశ్ రజాకార్ల గురించి తెలుసా?
x

మీకు బంగ్లాదేశ్ రజాకార్ల గురించి తెలుసా?

మీకు నిజాం రాజ్యంలో, ముఖ్యంగా తెలంగాణలో రజాకార్లు చేసిన దుర్మార్గాలు తెలుసు. కానీ ఇదే పేరుతో వేరే దేశంలో ఉన్న రజాకార్లు గురించి తెలుసా? షేక్ హసీనా వారి గురించి


బంగ్లాదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మెరిట్ ను ప్రాతిపదికగా తీసుకోవాలని వారం నుంచి ఉద్యమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ జరిగిన హింసాకాండలో ఇప్పటి వరకూ 130 మందికి పైగా నిరసనకారులు మరణించారు. ఇదిలా ఉండగా ఈ వివాదం సుప్రీంకోర్టు కు చేరింది. ఈ రోజు ప్రకటించిన తీర్పులో మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి ఉన్నత న్యాయస్థానం అనుమతిఇచ్చింది. 93 శాతం ఒపెన్ లో 7 శాతం వివిధ వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వాలని సూచించింది.

షేక్ హసీనా నోటి నుంచి రజాకార్లు అనే పదం..
నిజాం రాజ్యంలో రజాకార్ల వ్యవస్థ సాగించిన దురాగతాలు అన్ని ఇన్నీ కావు. కనబడిన స్త్రీలందరిని చెరిచి, హత్యలు కావించిన పాశవిక ఇస్లాం మతోన్మాద మూకలే ఈ రజాకార్లు. మహిళలతో నగ్నంగా బతుకమ్మ ఆడించి పైశాచిక ఆనందం పొందారు. కాశీం రజ్వీ నేతృత్వంలోని ఈ మతోన్మాద మూకలు తెలంగాణ అంతటా నెత్తుటేరులు పాలించాయి. ఇవన్నీ 1948 కాలంలో జరిగాయి. అయితే దేశ విభజన జరిగిన తరువాత ఏర్పడిన పాకిస్తాన్ లోనూ ఒక రజాకార్ వ్యవస్థ ఏర్పాటు అయింది. ఈ రజాకార్ వ్యవస్థ ఇస్లాం లోని తమ వర్గం పైనే దాడి చేసి మరోసారి నెత్తుటేరులు పాలించింది .
ప్రస్తుతం బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది. ఉద్యమం హింసాత్మకంగా మారడంతో ప్రధాని షేక్ హసీనా ఉద్యమకారులను రజకార్లుగా అభివర్ణించింది. దీంతో ఈ నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. “స్వాతంత్ర్య సమరయోధుల మనవళ్లకు కాకపోతే, కోటా ప్రయోజనాలు ఎవరికి వస్తాయి? 'రజాకార్ల' మనవాళ్లకు ఇవ్వాలా? ఇది నా ప్రశ్న. నేను దేశ ప్రజలను అడగాలనుకుంటున్నాను. వారు తమ నిరసనను కొనసాగించవచ్చు. నిరసనకారులు ఆస్తులను ధ్వంసం చేస్తే లేదా పోలీసులపై దాడి చేస్తే, చట్టం తన పనిని తాను చేసుకుపోతుంది. మేము సాయం చేయలేమని పేర్కొంది.
'రజాకార్లు' ఎవరు?
చారిత్రాత్మకంగా రజాకార్ అంటే వారి సాగించిన దుర్మార్గాలే కనిపిస్తాయి. కానీ పర్షియన్, ఉర్ధూలో రజాకార్ అంటే స్వచ్చంద సహాయకుడు అని అర్థం.
"రజాకార్లు" 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ సమయంలో తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుతం బంగ్లాదేశ్)లో పారామిలిటరీ దళం. వారు పాకిస్తాన్ సైన్యంచే స్థాపించబడ్డారు. ప్రధానంగా బంగ్లా స్వాతంత్ర్య ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారు ఇందులో చేరారు. బంగ్లాదేశ్ లో ఉన్న సాధారణ ప్రజానీకాన్ని ఊచకోత కోశారు. లక్షలాది మంది మహిళల మానప్రాణాలను దోచుకున్నారు.
మే 1971లో, జమాతే ఇస్లామీ సీనియర్ సభ్యుడు మౌలానా అబుల్ కలాం ముహమ్మద్ యూసుఫ్ తూర్పు పాకిస్తాన్‌లోని ఖుల్నాలో మొదటి "రజాకార్ల" సమితిని ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ సైన్యానికి సాయంగా ఇది ఉపయోగపడింది. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యానికి మద్దతిచ్చిన బెంగాలీ పౌరులపై సామూహిక హత్యలు, అత్యాచారాలు, ఇతర మానవ హక్కుల ఉల్లంఘనలతో సహా ఇతర మిలీషియా గ్రూపులతో పాటు "రజాకార్లు" ఈ దారుణాలలో పాల్గొన్నారు. ఆధునిక బంగ్లాదేశ్ లో రజాకార్ అనే పదాన్ని ఒక నీచమైన అర్థంలో వాడతారు. దూషణ, పరువు తగ్గించడానికి కూడా ఇదే పదాన్ని సమాన అర్థంలో వాడతారు.
అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్
2010లో, షేక్ హసీనా ప్రభుత్వం 1971 సంఘర్షణ సమయంలో యుద్ధ నేరాలకు పాల్పడిన వారిపై విచారణ జరిపేందుకు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. బెంగాలీ ప్రజలపై దారుణంగా అకృత్యాలకు పాల్పడిన యూసఫ్ 2013లో అరెస్టయ్యాడు. ఒక సంవత్సరం తరువాత గుండె పోటు తో జైలులోనే మరణించాడు.
డిసెంబర్ 2019లో, ప్రభుత్వం 1971- దేశ లిబరేషన్ వార్ సమయంలో పాకిస్తాన్ దళాలతో కలిసి పనిచేసిన 10,789 మంది “రజాకార్ల” జాబితాను ప్రచురించింది. ఈ జాబితాలో ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు నిషేధించబడిన జమాత్-ఇ-ఇస్లామీ పార్టీకి చెందినవారు ఈ లిస్ట్ లో ఎక్కువ మంది ఉన్నారు.
Read More
Next Story