మోదీ చేసిందే సరైనది అంటున్న డొనాల్డ్ ట్రంప్
x

మోదీ చేసిందే సరైనది అంటున్న డొనాల్డ్ ట్రంప్

వచ్చే నెలలో వైట్ హౌజ్ ను సందర్శించనున్న భారత ప్రధాని


అక్రమ వలసదారుల విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేస్తుందే సరైందని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. యూఎస్ లో అక్రమంగా నివాసం ఉంటున్న 18 వేల మంది భారతీయ వలసదారులను వెనక్కి తీసుకోవడానికి న్యూఢిల్లీ సిద్దంగా ఉందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు .. ట్రంప్ సమాధానమిస్తూ.. ‘‘అతను(మోదీ) చేస్తాడు.. ఏది సరైందో అదే.. మేము ఆయనతో మాట్లాడుతున్నాం’’ అని అన్నారు.

మోదీని, ట్రంప్ వచ్చే నెలలో వైట్ హౌజ్ కు రావాల్సిందిగా ఆహ్వనించారు. ఆయన ఫ్లోరిడా లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి నేరుగా ప్రధాని మోదీకి ఫోన్ చేశారు.
ఈ విషయం పై ట్రంప్ స్వయంగా మీడియాకు సమాచారం ఇచ్చారు. మోదీతో తాను ఫోన్ లో మాట్లాడినట్లు, వచ్చే నెలలో మోదీ వైట్ హౌజ్ రాబోతున్నట్లు ప్రకటించారు. భారత్ తో మాకు మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.
అమెరికాలో తయారు చేసిన మరిన్ని భద్రతా పరికరాలను కొనుగోలు చేయాలని, న్యాయమైన ద్వైపాక్షిక సంబంధాల వైపు ఇరుపక్షాలు వెళ్లాలనే ట్రంప్ న్యూఢిల్లీ నాయకత్వాన్ని కోరినట్లు వైట్ హౌజ్ ప్రతినిధులు చెప్పారు.
‘‘ఇద్దరు నేతలు సహకారాన్ని విస్తరించడం, వ్యూహాత్మకంగా బలోపేతం కావడంపై సుదీర్ఘంగా చర్చించారు. ఇండో పసిఫిక్, మిడిల్ ఈస్ట్, యూరప్ భద్రతతో సహ అనేక ప్రాంతీయ సమస్యలపై కూడా వారు మాట్లాడుకున్నారు’’ అని వైట్ హౌజ్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇరు దేశాల మధ్య సంబంధాలను కొత్త పుంతలు తొక్కించేందుకు స్నేహం, వ్యూహాత్మక బలాన్ని పెంపొందించేందుకు మోదీ వైట్ హౌజ్ ను సందర్శించే ప్రణాళికలు సైతం చర్చించారు. ఈ సంవత్సరం చివర్లో ట్రంప్ హయాంలో ఏర్పడిన క్వాడ్ కూటమి సదస్సు కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. దీనికి దేశాధినేతలు హజరయ్యే అవకాశం ఉంది. ఇది చైనీస్ ప్రభావాన్ని తగ్గించడానికి ఏర్పడిన బహూళ కూటమి.
ట్రంప్- టారిఫ్ లు..
ఇంతకుముందు ఫ్లోరిడా లోని రిట్రీట్ లో రిపబ్లికన్లలతో మాట్లాడిన ట్రంప్, చైనా, ఇండియా, బ్రెజిల్ లను అమెరికా ఉత్పత్తులపై అధికంగా టారిఫ్ విధిస్తున్నాయని, వారిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ట్రంప్- భారత్
అమెరికాను తిరిగి మొదటి స్థానంలోకి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా చైనా, బ్రెజిల్, భారత్ పై సుంకాలు విధిస్తామని, అలాగే ఇతర దేశాలకు ఇస్తున్న సబ్సీడీలు, సాయాలను వెంటనే నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు.
అన్ని దేశాల మాదిరిగానే భారత్ తోనూ వ్యవహరిస్తున్నామని తన పార్టీ ప్రతినిధులకు హమీ ఇచ్చారు. వలసల విషయంలో 2022 చివరి నాటికి 2,20 వేల మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నారని 2024 ఏప్రిల్ లో హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది.
Read More
Next Story