‘‘మానవ హక్కులపై మాకు నీతులు చెప్పొద్దు’’
x
క్షితిజ్ త్యాగి

‘‘మానవ హక్కులపై మాకు నీతులు చెప్పొద్దు’’

మానవ హక్కుల సమావేశంలో పాక్ కు తలంటిన భారత్


భారత్ పై అంతర్జాతీయ మానవ హక్కుల సమావేశం లో పాకిస్తాన్ చేసిన ఆరోపణలను న్యూఢిల్లీ తిప్పికొట్టింది. ఇస్లామాబాద్ ఖైబర్ ఫంక్తూన్ ఖ్వా లో సొంత ప్రజలపై యుద్ధ విమానాలతో దాడి చేసిందని, న్యూఢిల్లీపై నిరాధారమైన, రెచ్చగొట్టే ఆరోపణలు చేయడానికి మరోసారి యూఎన్ హెచ్ ఆర్సీ వేదికలను దుర్వినియోగం చేసిందని విమర్శలు గుప్పించింది.

జెనీవాలో జరిగిన మానవ హక్కుల మండలి 20 వ సమావేశంలో భారత దౌత్యవేత్త శాశ్వత మిషన్ కౌన్సెలర్ క్షితిజ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ భారత భూభాగాన్ని కోరుకునే బదులు కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థను, హింసతో తడిసిన మానవ హక్కుల రికార్డులను పరిష్కరించుకోవాలని కోరారు.
పాకిస్తాన్ పై విరుచుకుపడిన..
పాక్ కు చెందిన ఒక ప్రతినిధి బృందం భారత్ కు వ్యతిరేకంగా నిరాధారమైన, రెచ్చగొట్టే ప్రకటనలతో ఈ వేదికను దుర్వినియోగం చేస్తూనే ఉందని త్యాగి సమాధానమిచ్చారు. పక్క దేశాల భూభాగాలను కోరుకునే బదులు, వారి ఆక్రమణలో ఉన్న భారత భూభాగాన్ని ఖాళీ చేసి, లైఫ్ సపోర్ట్ పై ఆధారపడిన దాని ఆర్థిక వ్యవస్థను, సైనిక ఆధిపత్యంతో నిండిన రాజకీయాలను, హింసతో కూడిన దాని మానవ హక్కుల రికార్డులను సరిచేసుకోవడంపై దృష్టి పెట్టాలని తలంటారు.
పాక్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడం, ఐరాస నిషేధించిన ఉగ్రవాదులను ఆశ్రయించడం, వారి స్వంత ప్రజలపై బాంబులు వేయడం నుంచి వంటివి మానుకోవాలన్నారు. కౌన్సిల్ సార్వత్రిక లక్ష్యం వేరే ఉందని, కానీ దానిని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
కౌన్సిల్ కూడా ఇలాంటి వాటిపై దృష్టి సారించాలని కోరారు. ప్రపంచం సవాళ్లను నుంచి ఇలాంటి విషయాలు దృష్టి మళ్లిస్తున్నాయని అన్నారు. భారత్ మానవ హక్కులలో శాశ్వత పురోగతి ఉందన్నారు.
‘‘దేశ నిర్ధిష్ట ఆదేశాల విస్తరణ పట్ల మేము ఆందోళన చెందుతున్నాము. కౌన్సిల్ ప్రధాన ఆదేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి బదులుగా, అవి పక్షపాతం, ఎంపిక అవగాహాలను బలోపేతం చేస్తాయి.
కొన్ని దేశాలలో మానవ హక్కుల పరిస్థితిపై సంకుచితంగా దృష్టి పెట్టడం వల్ల ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యవసర, ఉమ్మడి సవాళ్ల నుంచి మన దృష్టి మరల్చబడుతుంది’’ అని భారత దౌత్యవేత్త అన్నారు.
ఖైబర్ ఫంక్తూన్ ఖ్వా లో ..
ఖైబర్ ఫంక్తూన్ ఖ్వాలో రెండు రోజుల క్రితం నిద్రిస్తున్న ప్రజలపై బాంబుల వర్షం కురిపించింది. తాము తాలిబన్లపై దాడులు చేసినట్లు పాక్ ప్రకటించుకుంది. ఈ దాడిలో పదిమంది పౌరులు సహ 24 మంది మరణించారు. దీనికి ఒకరోజు ముందు పాకిస్తాన్ వైమానిక దళం తిరా లోయలోని మాత్రే దారా గ్రామంపై బాంబు దాడి చేసిందని మహిళలు, పిల్లలు సహ కనీసం 30 మంది పౌరులు మరణించారు.
పాకిస్తాన్ వైమానిక దళం చైనాలో తయారైన జే-17 ఫైటర్ జెట్ లను ఉపయోగించింది. ఈ దాడిలో చైనాలో తయారైన ఎల్ఎస్- 6 బాంబులను లేజర్ గైడెడ్ ప్రెసిషన్ మందుగుండు సామగ్రిని ఉపయోగించింది.

అయితే పాకిస్తాన్ మాత్రం టీటీపీ చేసిన ఆరోపణలను ఖండించింది. తాము కేవలం తాలిబన్లపైనే దాడి చేసినట్లు ప్రకటించుకుంది. దేశంలో అరాచకాలు చేస్తున్నందున టీటీపీ పైనే దాడులు చేసినట్లు ప్రకటించుకుంది.


Read More
Next Story