ఇరాన్ దాడిలో తీవ్రంగా దెబ్బతిన్న దుబాయ్ విమానాశ్రయం
x
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇరాన్ దాడుల తరువాత పరిస్థితి

ఇరాన్ దాడిలో తీవ్రంగా దెబ్బతిన్న దుబాయ్ విమానాశ్రయం

గల్ఫ్ కు ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులు రద్దు


Click the Play button to hear this message in audio format

ఖమేనీ హత్య తరువాత పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాలలో ఉన్న అనేక అమెరికా సన్నిహిత దేశాలపై ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ లు డ్రోన్లు, క్షిపణులు ప్రయోగిస్తూ భీభత్సం సృష్టిస్టున్నారు. ముఖ్యంగా ప్రపంచంలోని అతిపెద్ద ఎయిర్ పోర్టు అయిన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, బుర్జ్ అల్ అరబ్ హోటల్లపై డ్రోన్ లతో దాడులకు దిగాయి. దీనితో ఇక్కడ భారీ నష్టం సంభవించినట్లు, కొంతమంది వ్యక్తులకు గాయాలైనట్లు అంతర్జాతీయ మీడియా వార్తలు ప్రసారం చేసింది.

దుబాయ్ మీడియా కార్యాలయం ఎక్స్ లో తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లోని కొన్ని ప్రాంతాలపై దాడులు జరిగాయి. ఇక్కడ నష్టం సంభవించింది. కానీ పరిస్థితి అదుపులోనే ఉంది’’ అని ట్వీట్ చేసింది. ఐకానిక బుర్జ్ అల్ అరబ్ హోటల్ బయట ప్రాంతాలలో దాడులు జరిగి మంటలు చెలరేగాయని తెలిపింది.
బుర్జ్ అల్ అరబ్ హోటల్ యూఏఈ గర్వించదగిన నిర్మాణం. 1999 లో దీనిని జుమేరా బీచ్ లోని ఒక కృత్రిమ దీపంలో ఓ తెరచాప టవర్ ఆకారంలో నిర్మించారు. ఇది విలాసాలకు చిహ్నం.
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రాయాలలో ఒకటి దుబాయ్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు. దీనిపై రాత్రిపూట ఇరాన్ దాడులకు దిగింది. మొదట ఇక్కడ జరిగిన దాడిలో ప్రయాణికులు మరణించినట్లు ఎక్స్ లో విమానాశ్రయ అధికారులు పోస్ట్ చేశారు. కానీ తరువాత వాటిని తొలగించారు. ఇరాన్ తన క్షిపణులు దుబాయ్, అబుదాబి వైపు ప్రయోగిస్తుండటంతో అనేక విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేసుకున్నాయి. విమానయాన ట్రాకింగ్ డేటా ప్రకారం ఇక్కడ మొత్తం ఖాళీగా ఉందని చూపిస్తోంది.


Read More
Next Story