ఇండోనేషియాలో సునామీని సృష్టించిన భూకంపం
x

ఇండోనేషియాలో సునామీని సృష్టించిన భూకంపం

రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో ప్రకంపనాలు, 30 అంగుళాలు ఎగసి పడిన అలలు


Click the Play button to hear this message in audio format

ఇండోనేషియా ఉత్తర ప్రాంతంలో గురువారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు పై ఇది 7.4 తీవ్రతతో నమోదైంది. సముద్ర గర్భంలో ఇది నమోదు కావడంతో తీర ప్రాంతాలలో చిన్నపాటి సునామీని సృష్టించింది. ఈ బీభత్సంలో ఒక వ్యక్తి మరణించగా, అనేక భవనాలు కూలిపోయాయి.

మొలుక్కా సముద్రంలో కేంద్రంగా సంభవించిన ఈ భూకంపం జరిగిన అరగంట తర్వాత, అనేక పర్యవేక్షణ కేంద్రాల వద్ద సాధారణ ఆటుపోట్ల కంటే 75 సెం.మీ (30 అంగుళాలు) ఎత్తు ఉన్న అలలు తీరం వైపు దూసుకొచ్చాయి.

భూకంపం సంభవించిన కొన్ని గంటల తర్వాత ఇండోనేషియా వాతావరణ సంస్థ తన సునామీ హెచ్చరికను ఉపసంహరించుకుంది. భూకంప కేంద్రానికి ఉత్తరాన ఉన్న దేశానికి ఎలాంటి ముప్పు లేదని ఫిలిప్పీన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వోల్కనాలజీ అండ్ సీస్మాలజీ తెలిపింది.
ఇండోనేషియా విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం, ఉత్తర సులవేసి ప్రావిన్స్‌లోని బిటుంగ్‌లో, అలాగే పొరుగున ఉన్న ఉత్తర మలుకు ప్రావిన్స్‌లోని టెర్నాటే నగరంలో 10 నుంచి 20 సెకన్ల పాటు బలమైన ప్రకంపనలు సంభవించాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం, టెర్నాటేలోని కొన్ని ప్రాంతాలలో, ఒక చర్చి, రెండు ఇళ్లు కూలిపోయాయి. బిటుంగ్‌లో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు.
ఉత్తర సులవేసిలోని మనడో నగరంలో భవనం కూలిపోవడంతో 70 ఏళ్ల మహిళ మరణించగా, మరో నివాసి గాయపడ్డారని ఇండోనేషియా సహాయక సంస్థ ప్రకటించింది. టెర్నాటేలో కనీసం ముగ్గురు గాయపడగా, వారిని ఆసుపత్రిలో చేర్చారు. సహాయక సంస్థ విడుదల చేసిన వీడియోలలో చాలా ఇళ్లు కూలిపోయినట్లు కనిపిస్తున్నాయి. కొన్ని వీడియోలలో భూకంప ప్రభావంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసినట్లు ఇంటర్ నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి.
సమీప ప్రాంతాల్లో దాదాపు 50 ప్రకంపనలు సంభవించాయి. "మేము నిద్రలేచిన వెంటనే అకస్మాత్తుగా భూకంపం వచ్చింది... మేమందరం ఇంట్లోంచి బయటకు పరుగెత్తాము," అని బిటుంగ్ నివాసి మార్టెన్ మందగి అన్నారు. "భూకంపం చాలా బలంగా వచ్చింది." 28 కోట్లకు పైగా జనాభా ఉన్న విశాలమైన ద్వీపసమూహమైన ఇండోనేషియా, ప్రధాన భూకంప కేంద్రాలపై ఉంది. ఇక్కడ తరచుగా భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవిస్తుంటాయి.


Read More
Next Story