భారత్ పై విషం కక్కిన జో బైడెన్..
x

భారత్ పై విషం కక్కిన జో బైడెన్..

వలసదారులను అనుమతించకపోవడంతో భారత్, చైనా , జపాన్ లాంటి ఆర్ధిక వ్యవస్థలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.


అమెరికా అధ్యక్షుడు మరోసారి వర్తమాన దేశాలపై విషం కక్కాడు. తమ దేశం ఎంత గొప్పదో చెప్పడానికి పక్క దేశాలను తక్కువ చేసి మాట్లాడటం పాశ్చాశ్య దేశాధినేతలకు అలవాటు. ఇప్పుడు జో బైడెన్ కూడా అదే పని చేశాడు. చైనా, భారత్, జపాన్ ఆర్ధిక వ్యవస్థలు జెనోఫోబియా(విద్వేషం) కారణంగా అభివృద్ధి చెందకుండా ఆగిపోయాయని, అమెరికా ఆర్ధిక వ్యవస్థ మాత్రం వలసదారులు ఇబ్బడిముబ్బడిగా రావడం వల్ల బలపడినట్లు భావిస్తున్నట్లు జో బైడెన్ అన్నారు.

"చైనా ఎందుకు ఆర్థికంగా అంతగా వెనుకబడి ఉంది, జపాన్ ఎందుకు ఇబ్బంది పడుతోంది, రష్యా, భారత్ కూడా వెనకబడి పోతున్నారు. ఎందుకో మీకు తెలుసా అంటూ .. వారు జెనోఫోబిక్" తో బాధపడుతున్నారు. అందుకే వారి ఆర్ధిక వ్యవస్థలన్నీ మందగమనంలో ఉన్నాయి" అని బుధవారం వాషింగ్టన్ లో జరిగిన నిధుల సేకరణ కార్యక్రమంలో బైడెన్ అన్నారు.
వలసదారుల వల్లే ఆర్ధిక వ్యవస్థ..
"వారు( ఆసియా దేశాలైన భారత్, చైనా, జపాన్) వలసదారులను కోరుకోరు" అని వార్తా సంస్థ రాయిటర్స్ ఆయనను ఉటంకిస్తూ పేర్కొంది. "(కానీ) వలసదారులే మమ్మల్ని బలపరుస్తారు." ఆసియా అమెరికన్లు, ఇతర వలసదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, "మా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి మీరు, అనేక ఇతర కారణాల వల్ల సాధ్యమైంది." ఎందుకంటే మేము వలసదారులను స్వాగతిస్తున్నాము." అని బైడెన్ వ్యాఖ్యానించారు.
IMF అంచనా
అంతర్జాతీయ ద్రవ్య నిధి గత నెలలో అంచనా వేసిన దాని ప్రకారం, ప్రతి దేశం 2024లో దాని వృద్ధిని మునుపటి సంవత్సరంతో పోల్చితే, కేవలం 0.9 శాతం మేర అభివృద్ధిని సాధిస్తుంది. అదే భారత వృద్ధిరేటు 6.8 శాతంగా ఉంటుంది. అయితే గడచిన క్వాటర్ లో భారత్ అంచనాలు మించి వృద్ధి నమోదు చేసింది.
యుఎస్ 2.7 శాతం వృద్ధి చెందుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. గత సంవత్సరం దాని వృద్ధి రేటు 2.5 శాతం గా ఉంది. అది ఆర్ధికవేత్తలు ఊహించిన దానికన్నా బాగుందని తేలింది. వలసదారుల వల్ల దాని శ్రామిక శక్తి పెరిగిందని, దాని ఉత్పత్తి విధానాలల్లో వేగంగా మార్పులు వస్తున్నాయని డెమోక్రాటిక్ పార్టీ ప్రచారం చేస్తోంది.
బైడెన వర్సెస్ ట్రంప్
అమెరికా ఎన్నికల్లో ప్రధానంగా వలసదారులు చుట్టే తిరుగుతున్నాయి. పాత ప్రత్యర్ధులైన బైడెన్, ట్రంప్ వలసలపై తమతమ విధానాలను ఇప్పటికే ప్రకటించారు. డెమెక్రాట్లు అక్రమ వలసలను ప్రొత్సహించేలా ప్రచారం చేస్తుండగా, ట్రంప్ మాత్రం వలసలకు అడ్డుకట్ట వేసి తీరతానని ప్రతిజ్ఞ చేశారు.
ఇంతకుముందు అధికారంలో ఉన్న ఆయన.. అమెరికా, మెక్సికో సరిహద్దులో గోడ కట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాని పూర్తి చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. మరో వైపు సరిహద్దు రాష్ట్రమైన టెక్సాస్ ప్రభుత్వం కూడా వలసలతో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. వెంటనే ఈ అక్రమ వలసలను నిరోధించాలని ఫెడరల్ ప్రభుత్వంపై ఒత్తిడి పెడుతోంది.
Read More
Next Story