
యూకే జాతీయ జెండా
‘‘వలసదారులను వెనక్కి పంపండి’’
బ్రిటన్ చరిత్రలోనే అతిపెద్ద ర్యాలీ, ఇస్లామిక్ శక్తులకు వ్యతిరేకంగా కదంతొక్కిన బ్రిటిషర్లు
వలసదారులు, ఇస్లామిక్ జిహాద్ గ్రూపులకు వ్యతిరేకంగా గ్రేట్ బ్రిటన్ రాజధాని లండన్ లో జాతీయవాదులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ దాదాపు లక్షకు పైగా ఇంగ్లీష్ ప్రజలను ఆకర్షించింది.
ఇది యూకే చరిత్రలోనే అతిపెద్ద ర్యాలీగా చరిత్ర కెక్కింది. ఈ సందర్భంగా మరో గ్రూపు వీరికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నించింది. ఈ సందర్భంగా రైట్ వింగ్ కు చెందిన గ్రూపు పోలీస్ అధికారులపై, ప్రత్యర్థికి చెందిన గ్రూపుపై దాడులకు పాల్పడింది. రైట్ వింగ్ లీడర్ టామీ రాబిన్సన్ ఈ ర్యాలీని నిర్వహించాడు.
‘‘యునైట్ ది కింగ్డమ్’’ ర్యాలీలో ప్రజలు విసిరిన సీసాలతో పాటు అనేకమంది అధికారులను నిరసనకారులు పిడిగుద్దులు, తన్నడం, కొట్టడం జరిగిందని మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు.
విధుల్లో ఉన్న వేయి మందికి పైగా అధికారులకు మద్దతుగా హెల్మెట్లు, కవచాలతో అదనపు బలగాలను మోహరించారు. ఈ దాడులలో 26 మంది గాయపడ్డారు. వారిలో నలుగురికి పళ్లు విరిగిపోగా, కొంతమంది ముక్కు పగిలిపోయింది. కంకషన్, వెన్నెముక గాయం వంటి తీవ్ర గాయాలు అయినట్లు కూడా నివేదికలు అందుతున్నాయి.
ఈ అల్లర్లలో దాదాపుగా 25 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రాబిన్సన్ నిర్వహించిన ఈ ర్యాలీకి దాదాపు 1.10 లక్షల మందిని ఆకర్షించినట్లు తెలిసింది.
రాబిన్సన్ నిర్వహించిన ర్యాలీకి వ్యతిరేకంగా కొంతమంది స్టాండ్ అప్ టూ రేసిజం, ‘‘మార్చ్ ఎగైనస్ట్ ఫాసిజం’’ పేరిట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇందులో 5 వేల మంది పాల్గొన్నారు. ఈ రెండు గ్రూపుల మధ్య ఎలాంటి ఆందోళన చెలరేగకుండా ఉండటానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు.
మన సంస్కృతికి వ్యతిరేకం..
వలస వ్యతిరేక థీమ్ అవలంబించే రాబిన్సన్ అసలు పేరు స్టీఫెన్ యాక్సీ లెన్నాన్. జాతీయవాద, ఇస్లాం వ్యతిరేక ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్ ను స్థాపించారు. బ్రిటన్ లో ప్రముఖ రైట్ వింగ్ నాయకులలో ఒకరు. ఈ మార్చ్ ను వాక్ స్వాతంత్య్రానికి మద్దతు ప్రదర్శనగా అభివర్ణించారు.
యూరప్ మొత్తం ఇస్లామిక్ జిహదీ గ్రూపుల అరాచకాలు పెరిగిపోతుండటం, ప్రస్తుత నాయకులు ఉదారవాద భావజాల రాజకీయాలు చేస్తుండటంతో కొత్తగా రైట్ వింగ్ రాజకీయాలకు ప్రాధాన్యం పెరిగింది. వీరంతా ఇబ్బడిముబ్బడిగా వలస వస్తున్న వలసదారులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
‘‘మన యూరోపియన్ ప్రజలను దక్షిణాది నుంచి వచ్చే ప్రజలు, ముఖ్యంగా ముస్లిం సంస్కృతి తీవ్రంగా ఇబ్బందిపెడుతోంది. మనం వలసరాజ్యాలుగా మారడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అని ఫ్రెంచ్ రైట్ వింగ్ రాజకీయ నాయకుడు ఎరిక్ జెమ్మౌర్ అన్నారు.
యూకే ను విమర్శించిన ఎలన్ మస్క్..
బ్రిటిషు ప్రభుత్వాన్ని ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ తీవ్రంగా విమర్శించారు. ఈ సంవత్సరం ఆయన ఇలా అనేకసార్లు కీర్ స్టార్మర్ ప్రభుత్వం లక్ష్యంగా పలు ఆరోపణలు చేశారు. వామపక్ష భావాలు అనుసరిస్తున్న యూకే ప్రభుత్వం వల్లే ఇదంతా జరుగుతుందని ఎక్స్ లో విమర్శలు గుప్పించారు.
‘‘బ్రిటిష్ గా ఉండటంలో ఏదో అందమైన విషయం ఉంది. ఇక్కడ నేను చూస్తున్నది బ్రిటన్ నాశనం. ప్రారంభంలో నెమ్మదిగా కోత, కానీ భారీ అనియంత్రిత వలసలతో బ్రిటన్ వేగంగా పతనమవుతోంది’’ అని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేసిన వీడియో అభిప్రాయపడ్డారు.
‘‘ఈ దేశాన్ని నిర్మించిన బ్రిటిష్ ప్రజల కంటే వలసదారులకు ఇప్పుడు కోర్టులలో ఎక్కువ హక్కులు ఉన్నాయి’’ అని రాబిన్సన్ గద్గద స్వరంతో భారీ జనసమూహానికి చెప్పారు. అనుమతి లేకుండా లక్షలాది పడవలు ఇంగ్లీష్ ఛానల్ ద్వారా బ్రిటన్ లోకి వస్తున్న సమయంలో సమయంలో రాబిన్సన్ వంటి నాయకులు ఈ కవాతుకు పిలుపునిచ్చారు.
వలస వ్యతిరేక నిరసనలు..
లండన్ శివారులో 14 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఇథియోపియన్ వ్యక్తి అరెస్ట్ అయిన తరువాత ఈ వేసవిలో శరణార్థులు ఉన్న హోటళ్ల వెలుపల అనేక వలస వ్యతిరేక నిరసనలు జరిగాయి. తరువాత ఇవి హింసాత్మకంగా మారి, అరెస్ట్ లకు దారి తీశాయి. ఈ ర్యాలీలలో బ్రిటన్ జాతీయ జెండాలు, యూకే తిరిగా కావాలి అనే నినాదాలు చేశారు. కొంతమంది ట్రంప్ టోపీలు ధరించారు.
యూకే పీఎం కీర్ స్టార్మర్ లక్ష్యంగా..
జాతీయవాదులు వలస పడవలు ఆపండి, వాటిని ఇంటికి పంపండి. మా పిల్లలను రక్షించండి అని రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకున్నారు. ఉన్నవారిని వెనక్కి పంపండని డిమాండ్ చేశారు. ‘‘నిలబడండి.. పోరాడండి’’ అని బోర్డును కూడా ప్రదర్శించారు.
రాబిన్సన్ మద్దతుదారులు యూకే ప్రధాని కీర్ స్టార్మర్, సెంటర్ లెప్ట్ లేబర్ పార్టీ నాయకుడు లక్ష్యంగా విమర్శలు గుప్పించాడు. యూఎస్ లో హత్యకు గురైన సంప్రదాయవాద కార్యకర్త చార్లీకిర్క్ కు కూడా మద్దతుగా నినాదాలు చేశారు.
అనేక మంది వక్తలు కిర్క్ కు నివాళులర్పించారు. కొద్దిసేపు మౌనం పాటించి ఆయనను స్మరించుకున్నారు. ఆ తరువాత బ్యాగ్ పైపర్ ‘‘అమేజింగ్ గ్రేస్’’ వాయించగా ఒక ప్రదర్శనకారుడు ‘‘వాక్ స్వేచ్ఛ చనిపోయింది, చార్లీ కిర్క్ కు నివాళి అర్పించండి’’ అని రాసి ఉన్న బోర్డును పట్టుకున్నాడు. లండన్ నిర్వహించిన ఈ నిరసన ప్రదర్శన వాటర్లూ రైల్వే స్టేషన్ దాటి సుమారు ఒక మైలు దూరం వరకూ విస్తరించి కనిపించింది.
నిరసనలు చాలావరకూ ప్రశాంతంగా జరిగాయి. కానీ మధ్యాహ్నం సమయానికి ‘‘యునైట్ ది కింగ్ డమ్’’ మద్దతుదారులు ప్రత్యర్థి ర్యాలీ పై వస్తువులు విసిరి, దాడి చేయడానికి ప్రయత్నించారు. దీనితో అధికారులు బల ప్రయోగం చేయాల్సి వచ్చింది.
Next Story