సొంత రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్న మాజీ సైనికులు
x

సొంత రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్న మాజీ సైనికులు

బంగ్లా విద్యార్థి నాయకులు కొత్త పార్టీ ప్రకటించిన నేపథ్యంలో సైన్యం కూడా రంగంలోకి?


ప్రణయ్ శర్మ

పాకిస్తాన్ లో పేరుకే రాజీకీయ పార్టీలు ఉంటాయి.. కానీ తెరవెనక మొత్తం పాలన ఎవరు చేస్తారో అందరికి తెలుసు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఆ పరిస్థితి రాబోతుందా అని అవుననే అంటున్నాయి పరిస్థితులు.

అక్కడ ఆర్మీ అధికారుల బృందం సొంత రాజకీయ పార్టీని ప్రారంభించాలనే కోరికతో ఉంది. ఇది అక్కడ రాజకీయ వర్గాల్లో కలకలం రేగడానికి కారణం అయింది.

అయితే తాము ఇప్పుడు జోక్యం చేసుకోమని, మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి తన కార్యకలాపాలను పరిమితం అవుతుందని ఆర్మీ చీఫ్ చెప్పారు.

అనేక సార్లు సైనిక పాలన
బంగ్లాదేశ్ స్వాతంత్య్రం పొందిన తరువాత వెంటనే సైనిక పాలనలోకి జారుకుంది. అందువల్ల ప్రస్తుత సైనికాధికారుల మాటలను మనం అంతగా నమ్మలేము.
గత ఏడాది షేక్ హసీనాను అధికారం నుంచి పడగొట్టడానికి నిరసనలకు నాయకత్వం వహించిన విద్యార్థులు త్వరలో ఒక రాజకీయ పార్టీని ప్రారంభించడంపై ఇప్పుడు మీడియా దృష్టి ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది. కానీ మేము కూడా త్వరలో రాజకీయ పార్టీని ప్రారంభిస్తామని మాజీ సైనికాధికారులు చెప్పడమే ఇక్కడ ప్రకంపనలు సృష్టిస్తోంది.
దేశం సంక్షోభంలో ఉన్నప్పుడూ మేమంతా కలిసిరావాలని అనుకుంటున్నామని చీఫ్ కో ఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్న రిటైర్డ్ బ్రిగేడియర్ జనరల్ షమీమ్ కమల్ అన్నారు.
ఒత్తిడి పెంచే ప్రయత్నమే..
‘‘మాకు తెలుసు, మేము ఇక్కడ ఉన్న పార్టీలను తొలగించలేకపోవచ్చు. కానీ 30 నుంచి 40 సీట్లతో వాటిపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది’’ అని షమీమ్ కమల్ అన్నారు. యూనస్ దేశంలోని పాలన, ఆర్థిక వ్యవస్థతో పోరాడుతున్న సమయంలో ఈ ప్రకటన వచ్చింది.
ఇప్పటికే రాజధాని ఢాకా సహా ఇతర కీలక నగరాల్లో శాంతిభద్రతలు పూర్తి పతనం అంచున ఉన్నాయి. మనం గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నాము. నేరస్థులు దీనిని ఆసరగా చేసుకుంటున్నారని ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ అంగీకరించారు.
సైన్యం మాత్రమే స్థిరత్వాన్ని తీసుకు వస్తుంది..
దేశంలోని సాయుధ దళాలు, భద్రతా సంస్థలను అణగదొక్కితే బంగ్లాదేశ్ విచ్ఛిన్నమవుతుందని ఆయన హెచ్చరించారు. క్రమశిక్షణ కలిగిన ఏకైక శక్తిగా సైన్యం మాత్రమే బంగ్లాదేశ్ ను స్థిరంగా ఉంచగలదని కమల్ అతని సహచరుల నమ్మకం.
వీరికి అనేక మంది మాజీ జనరల్స్, మేజర్లు ఇతర మధ్య స్థాయి అధికారులు మద్దతు ప్రకటించారు. వీరికి ఇతర బ్యూరోక్రాట్లు తోడైతే పరిస్థితి ఏంటీని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రిటైర్ మేజర్ జనరల్ ఇబ్నే ఫజల్ సైఖుజ్జౌమన్, రిటైర్డ్ మేజర్ దిల్వార్ హుస్సేన్ ఖాన్, జాతీయ పార్టీ మాజీ నాయకుడు నూరుల్ ఖాదర్ ఖాన్ తమ భావసారూప్యత కలిగిన అధికారులు అధికారులు, రాజకీయ నాయకులతో సమన్వయం చేసుకోవడానికి ఒక కమిటీ ఏర్పడింది.
బంగ్లాదేశ్ లో సైన్యం పాత్ర
గత ఏడాది ఆగష్టు 5న హసీనా పదవీత్యుతురాలిగా అయిన తరువాత యూనస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంది. సైన్యం సేవలో ఉన్నప్పుడూ రాజకీయాల్లో జోక్యం చేసుకునే అవకాశానని జనరల్ వాకర్ తోసిపుచ్చారు. ‘‘ఒక రాజకీయ పార్టీ స్థానంలో సైన్యం కాదు మరో రాజకీయ పార్టీ రావాలి’’ అని ఆయన అన్నారు.
చాలా ఘనమైన చరిత్ర
బంగ్లాదేశ్ సైన్యం చేతులు రక్తంతో తడిశాయనే చెప్పాలి. బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్, ఆర్మీ జనరల్ జియావుర్ రెహమాన్ హత్యలలో పాల్గొంది. తరువాత అనేక పోరాటలకు తన మద్దతును అందించింది.
తరువాత ఇద్దరు జనరల్స్ అయిన జియా, హెచ్ ఎం ఎర్షాద్ ఇద్దరూ సైనిక అధికారులు, వారు రాజకీయాల్లో చేరి, సైన్యానికి అతీతంగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని ప్రారంభించారు. తరువాత తాత్కలిక ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. కొన్నింటికి బయట నుంచి మద్దతు ఇచ్చింది.
సైన్యం అంటేనే గౌరవం..
బంగ్లాదేశ్ లో అంతటా సైన్యం గౌరవించబడుతుందని రిటైర్ మేజర్ డెల్ హెచ్ ఖాన్ మాట. సైన్యం రాజకీయాల్లోకి వచ్చిన ప్రతిసారీ దాని ప్రతిష్ట దెబ్బతింటుందని జనరల్ వాకర్ వాదన. సైన్యంలో కూడా క్లీన్ ఇమేజ్ ఉన్నవారే మాకు కావాలని అని కమల్ అంటున్నారు.
దేశంలో రాజకీయ శూన్యత..
కమల్ తండ్రి ప్రజాదరణ కలిగిన ఎంపీ, ఏకంగా ఏడుసార్లు గెలిచాడు. రంగ్ పూర్ నుంచి బీఎన్పీ తరఫున చట్టసభల్లో అడుగుపెట్టాడు. ఇప్పుడు బ్రిగేడియర్ తండ్రి ప్రజాదరణను డబ్బుగా మలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఢాకాలో జరిగిన ప్రతిపాదిత పార్టీ సమావేశంలో కాన్సెప్ట్ ను బయటకు తెచ్చారు.
దీనికోసం సైన్యం నుంచి రిటైర్ అయిన అనేకమంది రిటైర్డ్ అధికారులు, వ్యాపార వర్గాలు, ఉన్నత స్థాయి బ్యూరో క్రాట్లు హజరయ్యారు. ‘‘ భవిష్యత్ బంగ్లాదేశ్ కోసం పనిచేయాలి. ఇతర దేశాల కోసం కాదు’’ అని కమల్ అంటున్న మాట.
హసీనా తొలగింపుతో లోటు..
హసీనా తొలగింపు తరువాత దేశ రాజకీయ రంగంలో భారీ ఖాళీని మిగిల్చింది. దీనిని అనేక రాజకీయ పార్టీలు పూరించడానికి ప్రయత్నిస్తున్నాయని మేజర్ ఖాన్ మాట.
అయితే వారికి ఆ సామర్థ్యం ఉందా లేదా అనే ప్రశ్న.. ప్రశ్నగానే మిగిలిపోయింది. విద్యార్థుల ప్రజాదరణ కేవలం ఢాకా సరిహద్దుల వరకే పరిమితం అయింది. ఇతర ప్రాంతాలలో వారికి సరైన గుర్తింపు లేదు. వారు మధ్య స్థాయి నిపుణులను ఆకర్షించలేకపోయారు. మేము ఈ విభాగాలను ఉపయోగించుకుంటున్నామని ఖాన్ అన్నారు.
హసీనా వ్యతిరేక భావాలు..
ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉన్న అన్ని పార్టీలలో హసీనా వ్యతిరేకత కనిపిస్తుంది. సహకరించగల ఎవరైనా మాకు కావాలి. కానీ అవామీ లీగ్ తో సంబంధాలు ఉన్నవారు కాదని మాజీ ఆర్మీ అధికారి ఖాన్ చెప్పారు.
హసీనా పదవీకాలంలో అవినీతి, దుష్ఫ్రవర్తన కారణంగా దాదాపు 460 మంది సైనికాధికారులను సర్వీస్ నుంచి తొలగించారు. అనేక మంది వివక్ష కారణంగా సర్వీస్ ను విడిచిపెట్టారని అంటున్నారు. ‘‘నిజమైన సైనిక అధికారులుగా, నిజమైన కేసులు ఏంటో మాకు తెలుసు’’ అని కమల్ అన్నారు.
Read More
Next Story